వైజాగ్‌లోని ఈ స్ట్రీట్‌ఫుడ్స్‌లో పావ్‌బాజీ రుచి చూశారా?
వైజాగ్ స్ర్టీట్ ఫుడ్స్ అనగానే నోరూరించే పావ్‌భాజీలు, చాట్‌లు, వైరెటీ ఆహారపదార్థాలు వెంటనే గుర్తోస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందడమే కాకుండా, స్ట్రీట్ ఫుడ్‌కు ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక్కడి తినుబండారాల ముందు పొడవాటి క్యూలను చూస్తుంటే వైజాగ్‌వాసులకు స్ట్రీట్ ఫుడ్‌పై ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఇక్కడి ప్రజలు ఎంతగానో ఇష్టపడి తినే స్ట్రీట్ ఫుడ్ డిష్‌లలో ఒకటైన పావ్ భాజీని తినే అవకాశాన్ని మీ సొంతం చేసుకోండి. మీరు మంచి ఆహారప్రియులైతే ఢిల్లీలోని ఈ స్ర్టీట్ ఫుడ్స్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తాయి. మీ పర్యటనకు కావాల్సిన శక్తిని, ఉత్తేజాన్ని అందిస్తాయి. ఈ స్ర్టీట్ ఫుడ్స్ మీకు ఎంతో కొత్తగా అనిపించడమే కాదు. రుచిలోనూ సాటిలేని విధంగా ఉంటాయి.

స్వీట్ ఇండియా
స్వీట్ ఇండియా వైజాగ్ స్ర్టీట్ ఫుడ్‌లలో ఎంతో రుచికరంగా ఉండే వంటకం. వైజాగ్ వాసులు ఎంతగానో ఇష్టపడే ఈ వంటకం ఇక్కడ చాలా ఫేమస్ అయ్యింది. దీని రుచి మిమ్మల్ని మళ్లీ మళ్లీ ఇక్కడికి రప్పించేలా చేస్తుంది. స్వీట్ ఇండియా వేడి వేడి పావ్ భాజీని దాని పైన వెన్నతో నోరూరిస్తుంది. దానిపైన ఉల్లిపాయలు వేసి వడ్డిస్తారు. ఈ పసందైన స్ట్రీట్ ఫుడ్ స్పాట్ విశాఖప్నటంలోని సంపత్ వినాయక దేవాలయానికి సమీపంలో ఉంది. సాయంత్రపూట వైజాగ్‌వాసులు ఇక్కడ బారులు తీరుతారు.

కైలాష్ పావ్ భాజీ
ఈ రోడ్‌సైడ్ తినుబండారం ఆర్‌కె బీచ్‌రోడ్‌లో రద్దీగా వుండే ప్రదేశంలో లభిస్తుంది. వేడి వేడి పావ్ భాజీ మరియు మెత్తని బట్టీ రొట్టేల ప్లేట్‌లను అందిస్తోంది. ఇక్కడ కేవలం పావ్‌బాజీ మాత్రమే కాకుండా పానీపూరి, హాట్‌చాట్, సమోసా మొదలైనవీ అందుబాటులో ఉన్నాయి. కైలాష్ పావ్ భాజీ సాయంత్రం అల్పాహరం తీసుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం. దాంతో పాటు హాట్‌చాట్, సమోస సాయంత్రపూట అల్పహారంగా ఉంటుంది. అందమైన సముద్ర దృశ్యాన్ని చూస్తూ వేడి వేడి కైలాష్ పావ్ భాజీ రుచిని ఆస్వాదించండి.

పూజ కిచెన్
పూజ కిచెన్ వైజాగ్ పట్టణంలో ఉత్తమ ఉత్తర భారతీయ ఆహారాన్ని అందిస్తుంది. ఇక్కడ వడ్డించే పావ్ భాజీ వైజాగ్‌లోని ఉత్తమమైన వాటిలో ఒకటి. చైనీస్ మరియు ఇటాలియన్ వంటకాల ప్రభావంతో పూర్తిగా శాఖహారమైన ఉత్తర భారతీయ శైలి రెస్టారెంట్ ఈ పూజ కిచెన్. అధిక ఖర్చు లేకుండా ఆకలి తీర్చుకోవాలనుకునేవారికి పావ్‌బాజీ బెస్ట్ స్ర్టీట్ స్నాక్. తక్కువ ధరకు లభిస్తుందని దీన్ని తేలికగా తీసి పారేయకండి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే రుచికరమైన ఆహార పదార్థం ఇది.

బొంబాయి పావ్ భాజీ
వైజాగ్‌లోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న బొంబాయి పావ్‌బాజీకి నిత్యం విద్యార్థులు వస్తుంటారు. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో, స్నేహితులతో ముచ్చటిస్తూ వేడి వేడి పావ్ భాజీని ఆస్వాదిస్తుంటారు. బొంబాయి పావ్ భాజీ స్పాట్ సాధారణంగా సాయంత్రం పూట రద్దీగా ఉంటుంది. ఆర్‌టిసి కాంప్లెక్స్‌లోని ఇన్నర్ రోడ్, నెహ్రునగర్ సమీపంలో ఈ పావ్‌బాజీ అందుబాటులో ఉంటుంది.

లడ్డు గోపాల్ బీచ్ రోడ్
వైజాగ్‌లోని లడ్డు గోపాల్ బీచ్ రోడ్ సమీపంలో ఫాస్ట్‌పుడ్ కోసం ప్రజలు సాయంత్రం పూట ఈ ప్రదేశానికి చేరుకుంటూ ఉంటారు. రుచికరమైన డైప్రూట్స్, స్వీట్లు మరియు చాట్‌లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రతి వంటకం రుచికరంగా ఉండడం వల్ల ఆహారప్రియులకు ఇది ఉత్తమమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రుచికరమైన, అన్నిరకాల స్వీట్లు కూడా బాగా ఉన్నాయి. అంతేకాదు, ఇవన్నీ చాలా తక్కువ ధరలకే లభిస్తాయి.



Click it and Unblock the Notifications












