Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీ చుట్టూ జంగిల్ సఫారీకి అనువైన ప్ర‌దేశాలు మీకోసం..

ఢిల్లీ చుట్టూ జంగిల్ సఫారీకి అనువైన ప్ర‌దేశాలు మీకోసం..

ఢిల్లీ చుట్టూ జంగిల్ సఫారీకి అనువైన ప్ర‌దేశాలు మీకోసం..

శీతాకాలం వ‌చ్చేసింది. ఈ సీజన్‌లో, ప్రజలు తమకు ఇష్ట‌మైన చోట‌కు విహార‌యాత్ర‌లు ప్లాన్ చేస్తూ ఉంటారు. త‌మ గమ్యాన్ని ఎంచుకునేందుకు చాలా ఉక్కిరిబిక్కిరి అవుతారు. కొంద‌రు హిల్‌స్టేషన్‌కు వెళ్లి మంచు కురవడాన్ని ఆస్వాదించాల‌నుకుంటే, మ‌రికొంద‌రు తీర‌ప్రాంతాల‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు.

అదే సమయంలో వన్యప్రాణులను ద‌గ్గ‌ర‌గా చూసేందుకు కొందరు జంగిల్ సఫారీకి వెళ్తుంటారు. ఇలాంటివారి కోసం ఢిల్లీ చుట్టుపక్క‌ల‌ ఉన్న‌ అన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ సీజన్‌లో ప్ర‌త్యేకంగా ఎంజాయ్ చేసేందుకు ప‌ర్యాట‌కుల కోసం అనేక సౌక‌ర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మీరు కూడా జంగిల్ సఫారీకి వెళ్లాలనుకుంటే, ఢిల్లీ చుట్టూ ఉన్న ఈ జాతీయ పార్కులను సందర్శించవచ్చు.

పిలిభిత్ టైగర్ రిజర్వ్

పిలిభిత్ టైగర్ రిజర్వ్

జంగిల్ సఫారీలో టైగర్‌ని చూడాలనుకుంటే మీరు పిలిభిత్ టైగర్ రిజర్వ్‌ని సందర్శించవచ్చు. ఈ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ మరియు షాజహాన్‌పూర్ జిల్లాల్లో ఉంది. పిలిభిత్ టైగర్ రిజర్వ్ శీతాకాలంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు తెరవబడుతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో గంభీర‌మైన దృశ్యానికి నిలువుట‌ద్ద‌మైన‌ బెంగాల్ టైగర్‌ను ద‌గ్గ‌ర‌గా చూసే అవ‌కాశం ఉంటుంది. అడ‌వి నక్క, మొసలి, ఘారియల్, జింక, ఎలుగుబంటి మొదలైన వన్యప్రాణులను చూడవచ్చు. జంగిల్ సఫారీ సమయంలో ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి, ఖచ్చితంగా మీతో కెమెరాను తీసుకెళ్లండి.

ఇతావ‌హ్‌ లయన్ సఫారీ

ఇతావ‌హ్‌ లయన్ సఫారీ

మీరు సింహాన్ని నేరుగా చూడటానికి ఇతావ‌హ్‌ లయన్ సఫారీకి వెళ్లాల్సిందే. ఢిల్లీ నుండి ఇక్క‌డకు 314 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. రోడ్డు, రైలు మరియు వాయు మార్గాల ద్వారా ఇతావ‌హ్‌ చేరుకోవచ్చు. ఇక్క‌డి నుండి సమీప విమానాశ్రయం కాన్పూర్. ఇతావ‌హ్‌ లయన్ సఫారీలో 4డి థియేటర్ కూడా ఉండటం అతిపెద్ద విశేషం. ప్ర‌త్య‌కంగా ఏర్పాటు చేయ‌బ‌డిన ఈ థియేట‌ర్ పిల్ల‌ల‌ను, విద్యార్థుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది.

అంతేకాదు, ఇక్కడ మీరు వన్యప్రాణులను దగ్గరగా చూడగలరు. ఈ జ‌ర్నీలో సింహంతోపాటు జింకలు, ఎలుగుబంటి మరియు చిరుతపులి ప్రధాన వన్యప్రాణులతో సహా ఇతర జీవులను చూడవచ్చు. ప‌చ్చ‌ని గ‌డ్డితో నిండిన పచ్చిక‌బ‌య‌ళ్లు ప‌ర్యాట‌కుల మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి.

పన్నా టైగర్ రిజర్వ్

పన్నా టైగర్ రిజర్వ్

ఈ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఉంది. ఈ అభయారణ్యం 1981 సంవత్సరంలో ఏర్పాటు చేయ‌బ‌డింది. 1994లో ప్రభుత్వం పన్నాను టైగర్ రిజర్వ్‌గా ప్రకటించింది. ఢిల్లీ నుండి పన్నా దూరం 700 కిలోమీట‌ర్లు ఉంటుంది. మీరు విమానంలో తక్కువ సమయంలో పన్నా చేరుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, వారాంతపు ప్రయాణాలకు రైలులో కూడా పన్నా చేరుకోవచ్చు.

ఈ టైగర్ రిజర్వ్ 542 చదరపు కిలోమీటర్లలో విస్తరించి, కెన్ నది ఈ అభయారణ్యం సమీపంలో ఉంది. పన్నా టైగర్ రిజర్వ్‌లో సింహం, జింక, ఎలుగుబంటి, రాబందు, హంస, చితాల్, చింకారా, నీల్‌గై మొదలైన అడవి జంతువులను చూడవచ్చు. అరుదైన ప‌క్షిజాతుల‌కు ప‌న్నా టైగ‌ర్ రిజ‌ర్వ్ ఆవాసంగా నిలుస్తోంది. ఇక్క‌డి ప‌క్షుల కిల‌కిలారావాలు సంద‌ర్శ‌కుల‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా చెప్పొచ్చు.

More News

    Read more about: delhi uttar pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+