Search
  • Follow NativePlanet
Share
» »రంజాన్ మాసం .. రుచి చూద్దామా !

రంజాన్ మాసం .. రుచి చూద్దామా !

By Mohammad

రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ మాసం మహమ్మదీయులకు ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. అయితే, ఇస్లాం మతంలో చేసే ఉపవాసం మిగితా మతాలకంటే భిన్నమైనది. నెలవంక కనిపించినప్పటి నుండి మళ్ళి నెలవంక దర్శనం ఇచ్చేంత వరకు (సుమారు 30 రోజులు) ... సూర్యోదయం(సహర్) నుండి సూర్యాస్తమం(ఇఫ్తార్) వరకు రోజా(ఉపవాసం) ఉంటారు.

రంజాన్ మాసంలో అందరికీ గుర్తిచ్చేది ఆహారం. అందునా గుర్తుండిపోయేది .. హలీమ్. కేవలం మహామ్మదీయులే కాదు అన్నిమతాలవారు దీనిని ఇష్టపడతారు. కబాబ్, శవర్మ, బిర్యాని, కునఫా, జిలేబి మొదలైన ఆహారాల గురించి కూడా కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇఫ్తార్ అయ్యిందంటే మసీదుకు వెళ్లి ఉపవాస దీక్షలను విరమిస్తుంటారు. ఖర్జూరాను ముందుగా తిని, ఆ తర్వాత తాజా పండ్లు, సమోసలు, రొట్టెలు .. మొదలైనవి తింటారు.

ఈ మాసంలో ప్రత్యేక ఆహారాల గురించి కొన్నైనా ప్రస్తావించుకోవాలి. మీరు ఉద్యోగరీత్యా, పనుల నిమిత్తం ఈ ప్రదేశాల్లో ఉన్నట్లయితే తప్పక వీటిని సందర్శించండి. ఘుమఘుమలాడే ఆహారాలను రుచి చూడండి.

flydime

చిత్ర కృప : flydime

1. కౌసర్ బాగ్, కొంద్వా, పూణే

కడ్డీల మీద కాల్చే నాన్ - వెజ్ (చికెన్ చకోరిస్) మీరెప్పుడైనా ప్రయత్నించారా ? అయితే ఇఫ్తార్ సమయంలో కౌసర్ బాగ్ ప్రదేశానికి వెళ్ళండి. ఇక్కడ ఒక కుటుంబం 13 సంవత్సరాల నుండి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రుచికరమైన ఆహారాలను అందిస్తున్నది. మీరు పూణే లో ఉన్నట్లయితే సాయంత్రం ఒక అరగంట ఈ ప్రదేశంలో గడపండి.

చిరునామా : కౌసర్ బాగ్, కొంద్వా, పూణే, మహారాష్ట్ర 411048

ఏమేమి తినవచ్చు : చికెన్ లాలిపాప్, ఫిర్ని , చికెన్ బిర్యానీ

Hill93

చిత్ర కృప : Hill93

2. మసీదు రోడ్, ఫ్రాజర్ టౌన్, బెంగళూరు

బెంగళూరులోని శివాజీ నగర్ రంజాన్ మాసంలో కిక్కిరిసి ఉంటుంది. ఇఫ్తార్ సమయంలో సందులన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. దీనికి పక్కనే ఉన్న ఫ్రాజర్ టౌన్ గల్లీ లలో వెళితే ఘుమఘుమలాడే నాన్ - వెజ్ ఆహారాలను రుచి చూడవచ్చు. ఇక్కడికి వెళితే హలీమ్ తప్పక టెస్ట్ చేయండి.

చిరునామా : ఫ్రాజర్ టౌన్, బెంగళూరు

ఏమేమి తినవచ్చు : డబుల్ కా మీఠా, మటన్ ఖీమా, మటన్ బిర్యాని

Hill93

చిత్ర కృప : Hill93

3. బరహ్ హండి, ముంబై

మటన్ పాయా ఎప్పుడైనా తిన్నారా ? లేకపోతే బరహ్ హండి వెళ్ళండి. రంజాన్ మాసంలో ముంబై లో ఉన్నట్లయితే ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించండి. ఈ ప్రదేశానికి 150 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇఫ్తార్ సమయంలో ఈ పాయాను సూప్ గా తాగుతుంటారు.

చిరునామా : షాప్ నెం : 261, నాగ్ దేవి దేవి స్ట్రీట్, లోహార్ చౌల్, ముంబై, మహారాష్ట్ర 40003

ఏమేమి తినవచ్చు : పిచోట పాయా తప్పక రుచి చూడండి

Miansari66

చిత్ర కృప : Miansari66

4. కరిమ్స్, న్యూ ఢిల్లీ

కరీమ్స్, ఢిల్లీ లోని ప్రఖ్యాత జమా మసీద్ రోడ్ లో కలదు. ఇక్కడ మొఘల్ కాలం నాటి ఆహారాలను, పురాతన కాలం నాటి ఆహారాలను రుచి చూడవచ్చు. ఈ ప్రదేశానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. నాన్ వెజ్ ప్రియులు కరీమ్స్ కు వెళితే, ఇక్కడ లభించే ఓల్డ్ స్టైల్ కబాబ్స్ తినండి.

చిరునామా : కలన్ మెహల్, చాందిని చౌక్, న్యూ ఢిల్లీ, ఢిల్లీ 110002

ఏమేమి తినవచ్చు : మటన్ బుర్ర, మటన్ ఖుర్మా, బ్రెయిన్ కర్రీ, చికెన్ మోఘలాయ్

rchidgalore

చిత్ర కృప : rchidgalore

5. చార్మినార్ ఫుడ్ స్టాల్స్, హైదరాబాద్

హైదరాబాద్ లో రంజాన్ మాసం వైభవంగా మొదలై, వైభవంగా ముగుస్తుంది. ఇఫ్తార్ సమయంలో చార్మినార్ గల్లీలు, నాంపల్లి గల్లీలు దావత్ లతో కిటకిటలాడుతుంటాయి. పాతబస్తీ నుండి గోల్కొండ వరకు ఘుమఘుమలాడే ఆహారాలు, హలీమ్ లు దారిపొడవునా కనిపిస్తుంటాయి. కబాబ్ లు, యమ్మి యమ్మి పరోటాలు, దాల్ ఖీమా, స్టఫ్డ్ రోస్ట్ చికెన్ దజాజ్, మటన్ కుర్మా, ఖీర్ ఖుర్మా మొదలైనవి రుచి చూడవచ్చు. హలీమ్ కి పిస్తా హౌస్ హైదరాబాద్ లో చెప్పుకోదగ్గది. ఇక్కడ హలీమ్ ధర 110 నుండి 150 వరకు ఉంటుంది.

చిరునామా : చార్మినార్ స్ట్రీట్, హైదరాబాద్

ఏమేమి తినవచ్చు : చికెన్ స్టిక్, వెరైటీ నాన్ - వెజ్(చికెన్, మటన్), నోరూరించే చేపలు

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+