Search
  • Follow NativePlanet
Share
» » హనీమూన్ ఆనందాలు - కొత్త జంటల కోర్కెలు !

హనీమూన్ ఆనందాలు - కొత్త జంటల కోర్కెలు !

కొత్తగా పెళ్ళైన జంటలకు హనీమూన్ ఒక ప్రత్యేకత. ఈ కారణంగా హనీమూన్ ప్రదేశ ఎంపిక ఒక ప్రత్యేక ప్రదేశం గా వుండాలి. అది కుటుంబానికి, స్నేహితులకు దూరంగా వుండి కొత్త జంటలు కలసి మెలసి ఆనందించేది గా వుండాలి. ఈ ప్రేమ జంటలకు ఇండియా లో అనేక ప్రదేశాలు కలవు. ఇండియా లో కొత్తగా పెళ్లి అయిన జంటలు వారి ఆనందాల మొదటి క్షణాలను గడుపుకునేందుకు కొత్త ప్రదేశాలను, అన్వేషిస్తూ వుంటారు. సౌత్ ఇండియా లో హనీమూన్ ప్రదేశాలు చాలా కలవు. వాటిలో కొన్నిటిని మీ దృష్టికి తెస్తున్నాం పరిశీలించండి.

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు
 సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

పొగ మంచులతో నిండిన ఊటీ ప్రదేశం. ఊటీ పేరు తలుచుకుంటేనే చాలు అద్భుత ఆనందం. ఊటీ కొండలను ‘ క్వీన్ అఫ్ హిల్స్' అని కూడా అంటారు. కొత్త జంటలు ఈ పర్వత ప్రదేశ రిసార్ట్ లలో దిగి పొగ మంచు వేళల లో అద్భుత సుఖాలను పంచుకోవచ్చు.

 సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

పొగ మంచులతో నిండిన ఊటీ ప్రదేశం - పేరు తలుచుకుంటేనే చాలు అద్భుత ఆనందం. ఊటీ కొండలను ‘ క్వీన్ అఫ్ హిల్స్' అని కూడా అంటారు. కొత్త జంటలు ఈ పర్వత ప్రదేశ రిసార్ట్ లలో దిగి పొగ మంచు వేళల లో అద్భుత సుఖాలను పంచుకోవచ్చు.

 సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

ఆనందాల హనీ మూన్ జంటల అభిప్రాయాలను కూర్గ్ చక్కగా అర్ధం చేసుకో గలదు. ఎత్తు పల్లాల కొండలు, అద్భుత సుందర దృశ్యాలు కల ప్రకృతి ఇక్కడ ప్రేమ కలయికల లోని తొలి క్షణాలను పూర్తిగా ఆనందించేలా చేస్తుంది.

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

కూర్గ్ లో సుందర ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించటమే కాదు, మీరు ఒకరి తో ఒకరు పోటీలు పది కొన్ని సాహస క్రీడలలో సైతం పాల్గొని ఆనందించవచ్చు. ఇక్కడ వల్నూర్ ఫిషింగ్ కెంప్, అబ్బే ఫాల్స్, ఇరుప్పు ఫాల్స్ , హోన్నమన కేరే వంటివి మీరు మీ ట్రిప్ లో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

కేరళ హౌస్ బోటు లు - అందమైన ఈ ప్రదేశం మీ ప్రేయసి తో అనుభవించేందుకు కేరళ హౌస్ బోటు లకు మించిన ఆనందాలు లేవు. నీటి అలల పై తేలియాడే బోట్లు మిమ్ములను ఆనందాలలో ముంచెత్తుతాయి.

 సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

హౌస్ బోట్స్ - మీ ఆర్థిక స్థితి గతులను బట్టి హౌస్ బోట్స్ వసతులను వివిధ రకాలుగా మీరు ఎంపిక చేసికోవచ్చు. ఈ హౌస్ బోట్స్ లో మీకు ఇవ్వబడే ఆహారాలు, నోటికి అద్భుత రుచులు అందిస్తాయి. బోటు విహారంలో మీరు అనుభవించే పిల్ల గాలులు మిమ్మల్ని ఇక్కడకు మరల మరల రాప్పించేలా చేస్తాయి. ఈ హౌస్ బోటు విహారాలు మీకు కుమరకోమ్ మరియు అల్లెప్పి లలో ధారాళంగా లభిస్తాయి.

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

ప్రేమికుల స్వప్న సౌధం కోడై కెనాల్ లో విహరించండి. కోడై కెనాల్ మరొక అందమైన హిల్ స్టేషన్. మిమ్మల్ని వేరే ఆకర్షణీయ ప్రపంచంలోకి విహరించేలా చేస్తుంది. దట్టమైన పచ్చటి కొండలు, సరస్సులు, వాటిలో బోటు విహారాలు, పచ్చటి ప్రదేశాలలో గుస గుసల కాలి నడకలు, హనీ మూన్ జంటలకు ఒక ప్రత్యేకం.

 సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

కొడైకెనాల్ వెళితే ఏమి చూడాలి ? కోడై కెనాల్ లోని ఆకర్షణలు ప్రధానంగా...కోడై లేక్, బెరిజాం లేక్, బేర్ షోలా ఫాల్స్, కోకర్స్ వాక్ , బ్రియాంట్ పార్క్ , పిల్లర్ రాక్స్ వంటివి మీరు తప్పక ఆనందించి తీరవలసినదే.

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

దట్టమైన పచ్చటి కొండల సమూహం మున్నార్. కొత్త జంటల ముచ్చట్లకు మున్నార్ హిల్ స్టేషన్ ఒక చక్కని అనుభవం గా వుంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు ఎంతసేపు చూసినా తనివి తీరనివిగా వుంటాయి.
ఇక్కడి రిసార్ట్ లు జంటల కవసరమైన ట్రెక్కింగ్ వంటి సదుపాయాలూ కల్పించటంలో అత్యుత్తమైనవి.

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

మున్నార్ లో మీరు పల్లివాసాల్ జలపాతాలు, రాజ్ మాల , ఈకో పాయింట్, పోతన్ మేదు మరియు మీనులి ప్రదేశాలు తప్పక చూడాలి. మీరు ఇక్కడ వున్నపుడు ట్రెక్కింగ్ తప్పక చేయండి.అది మీకు ఒక మరువలేని అనుభవంగా మిగిలిపోతుంది.

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

లక్ష ద్వీపాలు కొన్ని చిన్న చిన్న దీవుల సముదాయం. కొత్తగా పెళ్లి అయిన వారికి జన సమూహాల నుండి దూరంగా ఉండగల అద్భుతమైన ఒంటరి తనాన్ని ఇస్తుంది. వారి జీవితాలలో మరువలేని తొలి మధుల క్షణాలను అందిస్తుంది. అంతేకాక, ఈ దీవులలో జంటలు సాహస క్రీడలు కూడా ఆచరించ వచ్చు.

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

ఇక్కడ కల అందమైన దీవులైన కవరాట్టి, ఆగట్టి లు తప్పక చూడాల్సిందే, ఈ దీవుల లో స్నార్కెలింగ్ మరియు స్కూబా డైవింగ్ వంటివి ప్రధాన క్రీడలు. ఈ ప్రాంతంలోని నీటిలో మీరు మరెక్కడా చూడని వివిధ రకాల నీటి ప్రాణులను చూసి ఆనందించవచ్చు.

సౌత్ ఇండియాలో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియాలో హనీ మూన్ ప్రదేశాలు

కొత్త జంటలకు మరొక ఆకర్షణీయ ప్రదేశం పాండిచేరి లోని పాండి బీచ్. ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. అందాలు చిందే ఈ బీచ్ లో సాయంత్రపు షికార్లు జీవితంలో మరువలేనివిగా వుంటాయి. అపుడపుడే సంబంధాలు ఏర్పడే జంటల జీవితాలలో నూతన అనుభవాలు నింపుతాయి.

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లో హనీ మూన్ ప్రదేశాలు

పాండిచేరి లో చూడవలసిన ప్రదేశాలు అరికేమేడు, ఆరోవిల్లె, ఫ్రెంచ్ వార్ మెమోరియల్ ప్రధానమైనవి. పాండిచేరిలో లభ్యం అయ్యే ఆహారాలు ఎంతో రుచికరంగా వుండి మరల మరల అక్కడకు మిమ్ములను ప్రతి ఏటా రప్పించేవి గా వుంటాయి.ఇక్కడ వివిధ రకాల చేపల వంటకాలు స్థానికులు వారి వంటల తీరులో ఎంతో రుచికరంగా చేస్తారు.

More News

Read more about: kerala travel south india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+