Search
  • Follow NativePlanet
Share
» » షాక్ ఇచ్చే సంస్కృతి - సంప్రదాయాలు !

షాక్ ఇచ్చే సంస్కృతి - సంప్రదాయాలు !

ఇండియా భిన్న సంస్కృతులు కల దేశం. కలలు ఏ రకంగా అందించినా అవి నమ్మబడతాయి. ఈ దేశంలో ఎంతో మంది వేదాంతులు, జోస్యం చెప్పే వారు, రాజ కుమారులు, స్వామీజీలు. అందరూ మిమ్మల్ని కలల ప్రపంచం లోకి తీసుకు వెళ్ళే వారే. ఇక్కడ ఏదీ కష్టం కాదు, ఏదీ సింపుల్ కాదు. ఇండియా అన్ని రకాల ప్రజలకు ఆహ్వానం పలుకు తుంది. ప్రఖ్యాత అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ ఇండియా సందర్శించినపుడు, ఆయన వ్రాసిన మొదటి మాటలు ' ఇండియా ఒక అద్భుతం'. అయితే, ఇండియా ను టూరిస్ట్ లు సరిగా అర్ధం చేసుకోలేరు.

ఒప్పుకున్నా లేక ఒప్పుకోక పోయినా, ఈ దేశంలోని బెగ్గర్లు, అవినీతి పరుల గురించిన కధలు మాత్రం పూర్తిగా అబద్ధాలు కావు. ఒక తెలివైన వాడు చెప్పినట్లు, మీరు ఎండను దాని వేడిని అంగీకరిస్తే, ఒక పిడుగును, మెరుపును కూడా అంగీకరించాలి. కనుక ఇక మీరు ఇండియా లో కల కల్చర్ మార్పు ను ఎలా ఎదుర్కొనాలో తెలుసుకోండి.

అతిధి దేవో భవ
మనం వచ్చిన అతిధులను దేముళ్ళుగా భావిస్తాం. ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాగానే, టాక్సీ డ్రైవర్ లేదా ఏజెంట్ లు టవున్ లో కల సౌకర్యాలను ఏకరువు పెడుతూ ఆ అతిధిని చుట్టూ ముట్టేస్తారు. మర్యాదగా కారు ఎక్కిన్చేస్తారు. ఒక్కసారి మీరు కారు లోకి ఎక్కి హోటల్ కు బయలు దేరితే, ఇక రోడ్లను గురించి చెప్పనవసరం లేదు. ఒంటె పై సవారీ యా లేక, టాక్సీ యా అన్న అనుమానం వస్తుంది. అన్నీ ఎగుడు దిగుడులే. ఒక ఎద్దు బండి లేదా, ఇసుక లారీలో ప్రయాణం వలే కూడా వుంటుంది. ఉచిత సలహా ఏమంటే, అలవాటు చేసుకొనండి, సహనం వహించండి. ఇండియా గుణాలు ప్రధానం.

సహనం

ఫుడ్ కొరకు హోటల్ లో ఆర్డర్ చేసి వేచి వున్నారా ? సహనం వహించండి. ఎక్కడైనా క్యు లో టికెట్ లకు నిలబడ్డారా నిట్టూర్పులతో సహనం వహించండి. సౌండ్, హార్న్, ఓకే. ఎన్నో రణగొణ ధ్వనులు, వాహనాల మోతలు. మిమ్ములను గందరగోళంలోకి దిన్చుతాయి. ఉచిత సలహా ఏమంటే, అంత సంక్షోభంలోనూ, ఒక పద్ధతి కొరకు వెతకండి.

కాలుష్యం

కాలుష్య రహిత ప్రదేశం అని వ్రాయబడి ఉన్నప్పటికీ అక్కడ అన్ని రకాల కాలుష్యం కనపడుతుంది. అచ్చమైన పర్యావరణ ప్రదేశం ఇండియాలో చూడాలనుకుంటే, మా నేటివ్ ప్లానెట్ సహాయం పొందాల్సిందే.

కల్చర్ షాక్ - కంగారు పడకండి ?

హై టెక్ నగర ఆశ్చర్యాలు!

ఏనుగులు, ఒంటెలు, పశువులు వంటివి ప్రతి చోటా వుంటాయి. బెంగుళూరు హై టెక్ నగరం లో ఒంటె సవారీ యా ? ఆశ్చర్యపడకండి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇక్కడ ఒంటె సవారీ దొరుకుతుంది. మీకు అందుబాటులో ఉన్నవన్నీ ప్రయత్నించండి. ఎల్లపుడూ మీ కెమెరాలను అందుబాటులో వుంచుకోనండి. మీరు మిస్ కాకూడని అంశాలు ఎన్నో వుంటాయి. రోడ్డు పై వెళ్ళే సాధువును పలకరించండి. వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడేస్తాడు. పిల్లలతో మాట్లాడండి అసలైన ఇండియా ఏమిటో మీకు చెపుతారు. ఉచిత సలహా, ఇండియా లో ఎదో స్పెషల్ కావాలని కోరుకోకండి. ఇక్కడ అన్నీ స్పెషల్ గానే వుంటాయి.

More News

    Read more about: travel పర్యటన
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+