Search
  • Follow NativePlanet
Share
» »పర్యావరణ పరిరక్షణలో పర్యటన !

పర్యావరణ పరిరక్షణలో పర్యటన !

పర్యావరణ పరిరక్షణలో ఒక పర్యాటకుడిగా మీ భాద్యత ఎంత ? పర్యటనలలో ఎన్నో అరుదైన ప్రదేశాలు చూస్తూ వుంటాం. జన సంచారం లేని, అప్పటివరకూ ఎవరూ చూడని కొన్ని ప్రదేశాలు ఎంతో కాలంగా తమ పవిత్రతలను నిలుపుకుంటూ వుంటాయి. ఆ ప్రదేశాలు టూరిస్ట్ లు ప్రవేశిస్తే చాలు, వారి వెంట తీసుకు వెళ్ళే ఖాళీ వాటర్ బాటిల్స్, తినుబండారాల ఖాళీ ప్యాకెట్ లు, ఇతర వృధా వస్తువులు పారవేయబడి, నిండి పోతాయి. అక్కడ పర్యావరణానికి హాని కలిగిస్తాయి. ఒక భాధ్యతకల పర్యావరణ పర్యాటకుడిగా ఏమి చేయాలి ? కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ఆచరించ వలసిన నియమ నిబంధనలు ఏమిటి ? చక్కని వాతావరణంతో కాలుష్య రహిత ప్రదేశాలకు మన వంతు సహకారంగా ఎలా ప్రవర్తించాలి ? భవిష్యత్ తరాలకు ఈ భూగోళాన్ని ఎలా సురక్షితం చేసి అందించాలి ? అనే విషయాలకు గాను ప్రాధమిక అంశాల ను కొన్నిటిని పరిశీలిద్దాం !

1. ఒక పర్యావరణ పర్యాటకుడిగా, ఆ ప్రదేశ నియమాలు గమనించి ఆచరించండి. మీకు ఇవ్వబడిన పేకేజ్ ట్రిప్ అనుమతి కలదేనా అనేది గుర్తించండి ? ఆ ప్రదేశాల రిసార్ట్ లలో మీ వసతి స్థానిక తెగలకు ప్రయోజనం చేకూరుస్తుండా ? అనేది చెక్ చేయండి.

2. ఆ ప్రదేశ స్థానికులతో ముచ్చ టించండి. వారి జీవన విధానాలు తెలుసుకోనండి.

3. అటవీ ప్రదేశాలకు వెళ్ళినా లేక గ్రామాలకు వెళ్ళినా స్థానికుల ఆచార వ్యవహారాలను గ్రహించి ముందుకు సాగండి.

4. ప్రదేశ వాస్తవ వివరాలకు , స్థానిక సంస్కృతులకు గాను అనుమతులు పొందిన గైడ్ ల ను మాత్రమే సంప్రదించండి.

5. ఆయా ప్రదేశాలలో అమలులో కల పరి రక్షణా కార్యక్రమాలకు సహకరించండి.

6. మీరు సందర్శించే ప్రదేశంలో చెత్త వేయటం, ఖాళీ బాటిల్స్ వదలివేయటం వంటివి చేయకండి.

7. కొత్త ప్రదేశాలలో మీరు తినే ఆహారాలు ఆరోగ్యవంతమైన విధానంలో తయారు అయినవిగా చూసుకొనండి. కూల్ డ్రింక్ లు, ఆల్కహాల్ వంటివి ఈ ప్రదేశాలలో విడనాడండి.

ఎకో టూరిస్ట్ ...ఎలా వుండాలి ?

Photos Courtesy: Kerala Tourism

8. మీరు దిగిన ప్రదేశం పర్యావరణ స్నేహ పూరితంగా చేయండి. అక్కడ వుడ్ తగులబెట్టి మంటలు వేయడం వంటివి చేయకండి.

9. సబ్బులు, డిటర్జెంట్ లు ఇతర రసాయన ఉత్పత్తులు స్నానాలు, లేదా దుస్తులు శుభ్రం చేసికొనుటకు వాడకండి.

10. తిరిగి వచ్చేటపుడు, మీతోపాటు వన్య జీవులను లేదా, ఇతర ప్రాకృతిక వస్తువులను, విత్తనాలను, రాళ్ళను, మొదలైన వాటిని తీసుకు రాకండి. అవి అక్కడి జీవ వైవిధ్యతా విధానాన్ని చాటుతూ బాలన్స్ చేస్తూ వుంటాయి.

11. ఆయా ప్రదేశాలలో లభించే గిరిజన, అటవీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసి, స్థానికులతో సహాకరించండి.

12. ఒక పర్యాటకుడిగా మీరు వెళ్ళే ప్రదేశం గురించిన వివరాలు ముందస్తుగా తెలుసుకోనండి.

ఈ భూమిపై నానాటికీ తరిగిపోతున్న సహజవనరులకు, సాంస్కృతిక వారసత్వ సంపదలకు సరి అయిన ఆచరణలో ఎకో టూరిజం చక్కని పరిష్కారం కాగలదు. ఎకో టూరిజం పర్యాటకుడి అనుభవాలను పెంపొందించట మె కాక స్థానికులకు ఆర్ధిక అభివృద్ధిని కూడా కలిగిస్తుంది. ప్రకృతి మరియు స్థానిక సంస్కృతుల అవగాహన ఆయా ప్రదేశాల అభివృద్ధిని రెట్టింపు చేస్తుందని గుర్తించండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+