Search
  • Follow NativePlanet
Share
» »ఆన్ లైన్ బుకింగ్ లు ...హోటల్ ఆనందాలు !

ఆన్ లైన్ బుకింగ్ లు ...హోటల్ ఆనందాలు !

హోటళ్ళ అధికార వెబ్ సైట్ లలో కొన్ని స్పెషల్ ఆఫర్ లు ఉంటాయ్. వాటి కొరకు తప్పక చూడండి. కొన్ని హోటళ్ళు లాయల్టీ పాయింట్ ప్రోగ్రాం లు కూడా తమ రెగ్యులర్ ఖాతా దారులకు ఏర్పరుస్తాయి.

ఆన్ లైన్ బుకింగ్ లో బెస్ట్ హోటల్ కనుగొనడం ఎలా ? సాధారణంగా తమ హోటల్ బెస్ట్ అంటూ ప్రతి ఒక్క సైట్ పేర్కొంటుంది. మీరు ఆన్ లైన్ లో హోటల్ బుక్ చేసుకుంటూ వుంటే, ముందుగా సరైన ప్రదేశం ఎంపిక చేయండి.

హోటల్ ఎంపిక
పర్యటనలో మీరు నివసించే హోటల్ ప్రదేశం కూడా ముఖ్యమైనదే. మీరు కనుక ట్రైన్ లో ప్రయాణిస్తూ వుంటే, రైల్వే స్టేషన్ సమీపంలోనే కల హోటల్స్ ఎంపిక చేయండి. దూరంగా ఎక్కడో హోటల్ తీసుకొని టాక్సీ లకు లేదా ఆటో లకు సొమ్ము చెల్లించటంలో అర్ధం లేదు.

పిక్ అప్ , డ్రాప్
మీరే కనుక విమాన ప్రయాణం చేసే వారైతే, హోటల్ వారిని ఎయిర్ పోర్ట్ పిక్ అప్ , డ్రాప్ లకు ఉచిత సౌకర్యం కలదా అని వివరణ కోరండి. ఉదయం ఎర్లీ గా లేదా లేట్ నైట్ లో ఫ్లైట్ పిక్ అప్ చేయాలన్నా ఈ సౌకర్యం మీకు తప్పక వుంది తీరాలి.

ఆన్ లైన్ హోటల్ బుకింగ్ ఎలా ?

కంపేర్ చేయండి
కామ్పారిజాన్ టూల్స్ ఉపయోగించి వివిధ హోటళ్ళ ధరలను కంపేర్ చేయండి. దీనితో మీకు మీ బడ్జెట్ లో మంచి హోటల్ ఎంపికకు దొరుకుతుంది.

స్పెషల్ ఆఫర్స్
హోటళ్ళ అధికార వెబ్ సైట్ లలో కొన్ని స్పెషల్ ఆఫర్ లు ఉంటాయ్. వాటి కొరకు తప్పక చూడండి. కొన్ని హోటళ్ళు లాయల్టీ పాయింట్ ప్రోగ్రాం లు కూడా తమ రెగ్యులర్ ఖాతా దారులకు ఏర్పరుస్తాయి. వీరి ద్వారా మీరు హోటల్ ధరలలో డిస్కౌంట్ లు పొందవచ్చు.

సోషల్ మీడియా
నేటి రోజుల్లో చాలా హోటళ్ళు వారి ఖాతాదారులతో సోషల్ మీడియా సైట్ ల ద్వారా అనుసంధానించబడి ఆన్ లైన్ లో స్పెషల్ దేఅల్స్ మరియౌ డిస్కౌంట్ కూపన్స్ వంటివి ఆఫర్ చేస్తున్నాయి. అతి తక్కువ ధరలు కల హోటల్స్ కు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మరింత అధిక డిస్కౌంట్ లు లభించే అవకాశం కలదు.

ఆన్ లైన్ హోటల్ బుకింగ్ ఎలా ?

హోటల్ ఆఫర్ చేసే సౌకర్యాల జాబితా క్షుణ్ణంగా పరిశీలించండి. రూమ్ బుక్ చేసే ముందే, వై . ఫి వంటి సౌకర్యాలు ఉచితంగా లభిస్తున్నాయా, లేక అదనపు చెల్లింపు చేయాలా అనేది గమనించండి. రూమ్ రేట్ లో బ్రేక్ ఫాస్ట్ చేరివుందా, లేక ఆదనమా ? జిమ్ , లేదా స్పా వంటివి ఉపయోగించక పోతే డిస్కౌంట్ లు అదనంగా ఉంటాయా అనేది తెలుసుకోండి.

బడ్జెట్ ట్రావెల్
బడ్జెట్ ట్రావెల్ అనేది వివిధ అర్ధాలు కలిగి వుంటుంది. అది వారి వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి వుంటుంది. మీరు కనుక బ్యాక్ పాకర్ లు లేదా లక్సరీ పర్యటన కోరని వారైతే, సాధారణ హోటళ్ళలో కనీస సౌకర్యాలతో అధిక పర్యటన చేసి ఆనందించ వచ్చు. మీరు కనుక 30 సంవత్సరాల వయసు లోపు వారైతే, యూత్ హాస్టల్ లో సభ్యత్వం పొంది అనేక డిస్కౌంట్ లు, ఇతర సౌకర్యాలు కూడా పొందవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+