Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ నుండి గోవాకు హ్యాపీ వీకెండ్ రోడ్ ట్రిప్

హైదరాబాద్ నుండి గోవాకు హ్యాపీ వీకెండ్ రోడ్ ట్రిప్

హైదరాబాద్ నుండి గోవాకు అద్భుతమైన వారాంతంపు రోడ్ ట్రిప్ చేయండి!

By Venkata Karunasri Nalluru

గోవా ఒక పరిచయం చేయనవసరం లేని ప్రదేశం. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులో గల ప్రదేశం. పశ్చిమ తీరంలో గల బీచ్లు, నైట్ లైఫ్ లు మరియు 300 ఏళ్ల పోర్చుగీస్ నిర్మాణ శైలి భవనాలు ఇక్కడ ఎక్కువగా వున్నాయి.

పచ్చదనానికి మరియు వన్యప్రాణులకు, ప్రకృతి ప్రేమికులకు ఇది మంచి ప్రదేశం. ఎవరైనా భోజనప్రియులుంటే ఇక్కడ మంచి రుచి గల భోజనాన్ని ఆస్వాదించవచ్చును. గోవాలో గల అందమైన గ్రామాల వద్ద నెమ్మదిగా ఉదయం పూట వాకింగ్ వెళ్తూ అలా ఆస్వాదించవచ్చును. లేదా సాయంత్రం అలా విహరించవచ్చును.

How to Reach from Hyderabad to Goa

PC: Vinoth Chandar

బయల్దేరిన ప్రదేశం : హైదరాబాద్

గమ్యం : గోవా

సందర్శించడానికి ఉత్తమ సమయం : ఫిబ్రవరి నుండి నవంబర్ నడుమ

ఎలా చేరాలి?

విమాన మార్గం :

ప్రధాన విమానాశ్రయం డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయము. ఇది పనాజి నుండి 30 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇది దేశంలో అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడినది.

రైలు మార్గం :

ప్రధాన రైల్వేస్టేషన్ వాస్కో డా గామా. ఈ రైల్వేస్టేషన్ ముంబై, బెంగళూరు మరియు ఇతరప్రధాన నగరాలతో అనుసంధానించబడింది.

రోడ్డు మార్గం : గోవా రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడింది. హైదరాబాద్ నుండి గోవాకి డ్రైవింగ్ దూరం 642 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి గోవాకు పుష్కలంగా బస్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఇతర ఇతర ప్రధాన నగరాల నుండి కూడా దండిగా బస్సులు ఉన్నాయి.

How to Reach from Hyderabad to Goa

PC: Google Maps

రూట్ 1: హైదరాబాద్-మహబూబ్ నగర్ - డియోసుగర్ - రాయచూర్ - సింధనూరు - ధార్వాడ్ - గోవా, ఎస్ హెచ్ 30 ద్వారా

రూట్ 2: హైదరాబాద్-మానెగుడ-గుర్మత్కల్-యడ్గిర్-బాగల్-గోవా, బచి - రాయచూర్ హైవే ద్వారా

రూట్ 3: హైదరాబాద్-మానెగుడ-కల్బర్గి-సిన్డగి-విజయపుర-బాగల్-గోవా, ఎన్ హెచ్ 50 ద్వారా

రూట్ 1 ద్వారా ప్రయాణిస్తే ఎస్ హెచ్ 30 ద్వారా 13 గం.లు పడుతుంది. ఈ రూట్ లో మీరు ఎక్కువ ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా ప్రయాణం సాగించవచ్చును.

రూట్ 2 ద్వారా ప్రయాణిస్తే బచి - రాయచూర్ హైవే ద్వారా గోవా చేరుకోవడానికి సుమారు 14 గంటల సమయం పడుతుంది.

రూట్ 3 ద్వారా ప్రయాణిస్తే ఎన్ హెచ్ 50 ద్వారా గోవా చేరుకోవడానికి 14.5 గంటలు పడుతుంది.

ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ వేసుకోవచ్చును. కాబట్టి మీరు ఒక శుక్రవారం సాయంత్రం మొదలుపెడితే గోవా వద్ద ఒక రోజులో సగం రోజు వుండవచ్చును. తర్వాత మీరు సోమవారం ఉదయం హైదరాబాద్ తిరిగి చేరుకోవచ్చును.

ఇది కూడా చదవండి :

గోవాలో తప్పక సందర్శించవలసినవి

How to Reach from Hyderabad to Goa

PC: Andean Condor

రాయచూరు వద్ద ఒక చిన్న స్టాప్

మీరు రూట్ 1 ద్వారా ప్రయాణిస్తే, హైవే ద్వారా రాత్రంతా డ్రైవ్ చేసేటప్పుడు భోజనాల కోసం రాయచూర్ వద్ద ఆగి మరలా ప్రయాణం సాగించవచ్చును.

చిన్న విరామం తరువాత గమ్యం చేరుకోవడానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోవా చేరుకొనుటకు సుమారు 3 గంటల సమయం పడుతుంది. మీరు గోవా చెక్ పోస్ట్ చేరుకున్న తర్వాత పంజిమ్ - బెల్గాం రోడ్ అందం వివరించడానికి మాటలు చాలవు.

వర్షాకాల సమయంలో అక్కడ కనుమల ద్వారా ఉద్భవిస్తున్న జలపాతాలు చూచుటకు చాలా అందంగా వుంటాయి.

How to Reach from Hyderabad to Goa

PC: Zerohund

గోవాకు చేరుకోవటం మరియు అక్కడి ఆకర్షణీయమైన ప్రదేశాలు

ఒకసారి గోవా చేరుకుంటే సందర్శించటానికి చాలా స్థాలాలు వున్నాయి. చర్చిలు, అందమైన బీచ్లు మరియు అభయారణ్యాలు మొదలైనవి చాలా ఉన్నాయి.

గోవాలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాలలో కొన్ని బొమ్ జీసెస్, బసిలికా ఉన్నాయి. గోవాను ప్రపంచ వారసత్వ సైట్ గా యునెస్కో గుర్తించింది.

గోవాలో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి బాగా, అంజునా, కాలంగుటే, పలోలెం, అగొండ, కోల్వ మరియు వగాటోర్ వంటి అత్యంత ప్రసిద్ధి పొందిన బీచ్లు వున్నాయి. ఈ బీచ్లు వివిధ దేశాల నుంచి అనేకమంది పర్యాటకులని ఆకర్షిస్తాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+