Search
  • Follow NativePlanet
Share
» »బుద్ధ‌గ‌యాలో పిండ ప్ర‌దానం చేస్తే.. ఆత్మ‌లు శాంతిస్తాయ‌ట‌..!

బుద్ధ‌గ‌యాలో పిండ ప్ర‌దానం చేస్తే.. ఆత్మ‌లు శాంతిస్తాయ‌ట‌..!

బుద్ధ‌గ‌యాలో పిండ ప్ర‌దానం చేస్తే.. ఆత్మ‌లు శాంతిస్తాయ‌ట‌..!

హిందూ మతంలో, పురాణాలు, హిందూ విశ్వాసాల ప్రకారం, పూర్వీకుల ఆత్మల శాంతి కోసం పిండ ప్ర‌దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం శ్రద్ధ అంటే పిండ ప్ర‌దానం సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 14 వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక సందర్భంగా, భారతదేశ వాసులే కాకుండా విదేశాల నుండి కూడా వేలాది మంది ప్రజలు తమ పూర్వీకులకు పిండ ప్ర‌దానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళతారు. చాలా మంది హరిద్వార్ వెళతారు, కొందరు అయోధ్యకు, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌కు కూడా వెళతారు. ఇవ‌న్నీ కాకుండా పిండ ప్ర‌దానం చేసేందుకు ఓ ప్ర‌త్యేక స్థ‌లం కూడా ఉంది. ఎవరైనా ఈ ప్రదేశంలో పిండ ప్ర‌దానం చేస్తే, వారి పూర్వీకులు మోక్షం పొందుతారని చెబుతారు. ఈ శ్ర‌ద్ధ రోజున పిండ ప్ర‌దానం చేయాల‌నుకుంటే మాత్రం ఈ స్థలం గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.

1

బీహార్‌లోని బుద్ధగయలో పిండ ప్ర‌దానం..

బీహార్‌లోని ఆ ప్రదేశం పేరు బుద్ధగయ. ప్రతి రోజు దేశంలోని నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఈ పవిత్ర నగరమైన బీహార్‌ను సంద‌ర్శించేందుకు వ‌స్తారు. ఈ ప్రాంతంలో పిండ ప్రదానం చేస్తే.. ఆత్మ‌లు శాంతియ‌స్తాని ఇక్క‌డికొచ్చే వారి న‌మ్మ‌కం.. బుద్ధ‌ గయ కేవ‌లం పిండ ప్ర‌దానం చేసేందుకు మాత్ర‌మే కాదు, చాలావాటికి ప్ర‌సిద్ధి చెందింది. బుద్ధ గయను బుద్ధ నగరం అని కూడా పిలుస్తారు. బోధ్ గయా బీహార్‌తో పాటు దేశం మొత్తానికి ప్రధాన మతపరమైన ప్రదేశం.

బోద్ గయా పురాణం గురించి..

బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశాన్ని బోధ్ గయ అని అంటార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధ భిక్షువులు బోద్ గయను చాలా పవిత్రంగా భావించడానికి ఇదే కారణం. క్రీస్తుపూర్వం 531 ప్రాంతంలో, లార్డ్ గౌతమ బుద్ధుడు నది ఒడ్డున జ్ఞానోదయం పొందాడని చెబుతారు. బోధి వృక్షం దగ్గర చాలా రోజులు కఠోర తపస్సు చేశాడు. ఇక్క‌డి ప్రజలు బోద్ గయలోని ఫల్గు నది దగ్గర పిండ ప్ర‌దానం చేసేందుకు నిత్యం వెళుతూ ఉంటారు. పురాణాల ప్రకారం, ప్రజలు నది ఒడ్డున పిండ ప్ర‌దానం కోసం పూజలు చేసేవారని నమ్ముతారు. రామాయణం, మహాభారతాలలో కూడా బోధగయ ప్రస్తావన ఉంది. అందుకే చాలా మంది పితృ పక్షం సందర్భంగా ఫల్గు నది దగ్గర పిండ దానం చేస్తారు.

2

బుద్ధగయలో త‌క్కువ ధ‌ర‌కే గ‌దులు..

బుద్ధగయలో బస చేసేందుకు త‌క్కువ ధ‌ర‌కే గ‌దులు అందుబాటులో ఉంటాయి. ఇందుకు అక్క‌డ ప్ర‌సిద్ది చెందిన హోటల్ మౌర్య విహార్, గెస్ట్ హౌస్, రామ గెస్ట్ హౌస్ వంటి అతిథి గృహాలలో బస చేయొచ్చు. ఈ హోటల్స్, గెస్ట్ హౌస్‌లలో, 400 నుండి 700 రూపాయల మధ్య AC, నాన్-AC గదులను సులభంగా పొందుతారు. ఈ హోటళ్లు మహాబోధి ఆలయానికి స‌మీపంలోనే ఉన్నాయి. బోద్‌గ‌యలో ఆహార ప‌దార్థాలకు ప్ర‌సిద్ధి చెందిన ప్ర‌దేశాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక్కడ చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు అన్నీ ఉన్నాయి. రూ.100లోపే ఆక‌లి తీరిపోతుంది.

బుద్ధగయ చేరుకోవడం ఎలా?

విమాన మార్గం ద్వారా అయితే, గయా దేశీయ విమానాశ్రయం సిటీ సెంటర్ నుండి 14 కిలోమీట‌ర్లు. కోల్‌కతా నుండి సుమారు 485 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. రైలు మార్గం ద్వారా అయితే, గయా జంక్షన్ 15 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న సమీప రైల్వే స్టేషన్. రోడ్డు మార్గం ద్వారా అయితే బుద్ధగయ భారతదేశంలోని అనేక నగరాలకు అనుసంధానించబడి ఉంది. బీహార్ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యాటకుల కోసం రోజుకు రెండుసార్లు డీలక్స్ బస్సులను నిత్యం అందుబాటులో ఉంచుతుంది.

More News

Read more about: bodh gaya bihar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+