Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తర భారతీయ వంటకాలను ఆస్వాదించాలంటే.. వైజాగ్ వెళ్లాల్సిందే..!

ఉత్తర భారతీయ వంటకాలను ఆస్వాదించాలంటే.. వైజాగ్ వెళ్లాల్సిందే..!

ఉత్తర భారతీయ వంటకాలను ఆస్వాదించాలంటే.. వైజాగ్ వెళ్లాల్సిందే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంద‌మైన బీచ్‌లు, ఉద్యాన‌వ‌నాలు, ప‌చ్చ‌ని కొండ‌లు, జ‌ల‌పాతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల‌కు ప్ర‌సిద్ధి చెంద‌డ‌మే కాకుండా రుచిక‌ర‌మైన వంట‌కాల‌కు కూడా ప్ర‌సిద్ధి చెందింది. ఇక‌, ఎపిలోని విశాఖ‌ప‌ట్నంలో రుచిక‌ర‌మైన వంట‌కాలు అందించే రెస్లారెంట్లు, హోట‌ల్స్ ఎన్నో ఉన్నాయి. ఇక్క‌డ కేవ‌లం ఆంధ్ర ఫుడ్ మాత్ర‌మే కాకుండా ఉత్త‌ర భార‌తీయ వంట‌కాలు కూడా అందుబాటులో ఉంటాయి. బీహార్‌లోని రుచికరమైన లిట్టి చౌకా నుండి మధ్యప్రదేశ్‌లోని అభిరుచిగల పోహా వరకు, రాజస్థానీ థాలీ నుండి పంజాబ్‌లోని ఆరోగ్యకరమైన ఆలూ పరాటా వరకు అన్ని ర‌కాల వంట‌కాలు వైజాగ్‌లో ల‌భిస్తాయి. విశాఖ‌ప్న‌టం ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌వుతుంటే మాత్రం ఇక్క‌డి ఉత్త‌ర భార‌తీయ వంట‌కాల‌ను ఓసారి ఆస్వాదించేయండి మ‌రి..

1

లిట్టి చౌకా..

బీహార్‌లో ప్ర‌సిద్ధి చెందిన లిట్టి చౌకా అనేది ఒక ఘాటైన వంటకం. ఇందులో కాల్చిన గోధుమ బంతులు (లిట్టి) మసాలా పొడితో నింపబడి, మెత్తని కూరగాయలతో ఈ వంట‌కాన్ని (చౌకా) వడ్డిస్తారు. ఈ సాంప్రదాయక రుచికరమైన వంటకం బీహార్ వారసత్వాన్నిప్రతిబింబిస్తుంది. ఈ వంట‌కం బీహార్‌లోని సిబిఎమ్ కాంపౌండ్‌, సంప‌త్ వినాయ‌క టెంపుల్ రోడ్ స‌మీపంలోని స్వీట్ ఇండియా షాపులో ల‌భిస్తుంది. ప్ర‌త్యేకంగా ఈ వంట‌కాన్నిరుచి చూసేందుకు ప‌ర్యాట‌కులు ఇక్క‌డ బారులు తీరుతారు.

2

పోహా, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లో ప్ర‌సిద్ధి చెందిన, ప్ర‌జాధార‌ణ పొందిన భార‌తీయ అల్పాహారం పోహా. దీనిని వివిధ ప్రాంతాలలో పౌవా, సిరా, చిరా లేదా అవల్ అని కూడా పిలుస్తారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. వైజాగ్‌లోని శ్రీ శ్యామ్ రెస్టారెంట్‌లో ఈ ఆరోగ్య‌క‌ర‌మైన అల్పాహారం ల‌భిస్తుంది. పనీర్ బటర్ మసాలా, జీరా రైస్ విత్ దాల్ ఫ్రై, కడాయి పనీర్ వంటి ఇతర నార్త్ ఇండియన్ స్పెషాలిటీలు కూడా ఈ రెస్టారెంట్‌లో అందుబాటులో క‌ల‌వు.

చిల్లా, ఛత్తీస్‌ఘడ్‌

ఛత్తీస్‌గఢ్‌లో ప్రసిద్ధి చెందిన చిల్లా అనే వంట‌కం స్థానిక సుగంధ ద్రవ్యాలు, మూలికల పిండితో తయారు చేసిక‌ ఒక రుచికరమైన పాన్‌కేక్. ఇది బ‌య‌టికి పెళుసైనదిగా లోపల మృదువైన‌దిగా ఉంటుంది. ఇది ఛత్తీస్‌గడ్‌లో ప్ర‌సిద్ధి చెందిన వంట‌కం. దీనిని ఉద‌యం పూట అల్పాహారంగానూ, సాయంత్రం స్నాక్స్‌గానూ తీసుకుంటారు. ఇప్పుడు వైజాగ్ రెస్టారెంట్‌ల‌లో కూడా ఈ వంట‌కం ప్ర‌సిద్ధి చెందింది.

3

ధోక్లా, గుజరాత్

గుజరాత్‌కు చెందిన ధోక్లా అనే వంట‌కం పులియబెట్టిన పప్పు పిండితో తయారు చేయబడిన ఒక ఆవిరి కుడుములాంటిది. త‌రుచుగా మ‌నం ద‌క్షిణాదిన చేసుకునే ఆవిరి కుడుము త‌ర‌హాలో ఈ వంట‌కం ఉంటుంది. దీనిని పుదీనా చట్నీ, వేయించిన మిరపకాయలతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. స్సైసీ ఫుడ్ ఇష్ట‌ప‌డే వారికి ఈ వంట‌కం బాగా న‌చ్చుతుంది. ఎందుకంటే, ఇది ఎంతో ఘాటుగా ఉంటుంది. వైజాగ్‌లో ప్ర‌సిద్ధి చెందిన ల‌డ్డూ గోపాల్ రెస్టారెంట్‌లో ఈ వంట‌కాన్ని రుచిచూడొచ్చు. ఈ వంట‌కం ఉత్తర భారతీయ స్నాక్స్‌ల‌లో ఒక‌టిగా ప్ర‌సిద్ధి చెందింది.

పావ్ భాజీ, మహారాష్ట్ర

సాధార‌ణంగా పావ్ భాజీ అనేది వైజాగ్‌లో స్ట్రీట్‌ఫుడ్‌ల‌లో ఫేమ‌స్ అయిన వంట‌కం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప్రాంతంలో పావ్‌భాజీని రుచిచూసుంటారు. కానీ, వైజాగ్‌లోని కొన్ని రెస్టారెంట్‌ల‌లో మాత్రం మ‌హారాష్ట్ర పావ్‌బాజీ అందుబాటులో ఉంటుంది. మ‌హారాష్ట్ర‌లోని స్ట్రీట్ ఫుడ్‌గా పావ్ భాజీ ఎంత‌గానో ప్ర‌సిద్ధిచెందింది. మెత్తని రొట్టె రోల్స్‌తో వడ్డించే మసాలా కూరగాయల మిశ్రమం ఈ వంట‌కం. మ‌హారాష్ట్ర‌లో చిన్న చిన్న‌హోట‌ల్స్‌లు, రోడ్‌సైడ్ స్టాల్స్ నుండి, రెస్టారెంట్‌ల‌లో కూడా ఈ పావ్ భాజీ ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం అయితే ఇది వైజాగ్ సిటి వాసుల ఫేవ‌రేట్ స్నాక్‌గా మారిపోయింది. మ‌రీ మీరు కూడా ఉత్త‌ర భార‌తీయ వంట‌కాల‌ను రుచి చూడాలంటే త‌ప్ప‌కుండా వైజాగ్ వెళ్లాల్సిందే..మ‌రెందుకాల‌స్యం బ‌య‌లుదేరండి మ‌రి..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+