Search
  • Follow NativePlanet
Share
» »యాత్రికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌..అమ‌ర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత‌..

యాత్రికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌..అమ‌ర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత‌..

శ్రీ‌నగర్‌లోని అమర్ నాథ్ యాత్రకు ప్రతి సంవ‌త్స‌రం ల‌క్ష‌లాది మంది యాత్రికులు తండోప‌తండాలుగా వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు లింగం ఉంటుంది. ఈ మ‌హాదేవున్ని దర్శించుకున్న‌వారికి స‌క‌ల పాపాలు తొలిగిపోయి మోక్షం లభిస్తుందని ఇక్క‌డికి వ‌చ్చిన భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. అంతేకాదండోయ్‌..ఈ పుణ్య‌క్షేత్రాన్ని దర్శిస్తే 23 ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నారు. ఈ క్రమంలో జూన్ 29 వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర‌కు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. అయితే, అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు వెళ్లే యాత్రికుల‌కు ఓ ముఖ్య‌గ‌మ‌నిక‌.. అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Amarnath Yatra

వ‌ర్షాల కార‌ణంగా..

గ‌త నెల 29 న ప్రారంభ‌మైన ఈ యాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగతుంది. ఈ యాత్రకు వెళ్లేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గ‌త కొన్నిరోజులుగా ఇక్క‌డ కురుస్తున్న వ‌ర్షాల‌కు.. ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గత రాత్రి నుంచి బల్తాల్, పహల్గాం మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. యాత్రికుల భద్రత కోసం ముందస్తు చర్యగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

భారీ సంఖ్య‌లో భ‌క్తులు..

గత సంవ‌త్స‌రం పోల్చితే ఈసారి భ‌క్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ యాత్ర ప్రారంభమ‌యిన వారం రోజుల్లోనే లక్షన్నర మంది యాత్రికుల కంటే ఎక్కువ మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు అధికారులు చెప్పారు. అమర్‌నాథ్ యాత్ర గత నెల 29 వ తేదీన ప్రారంభమ‌య్యింది. ఆగస్టు 19న యాత్ర ముగుస్తుంది. అయితే, జులై 4 వ తేదీ వరకు కేవలం 6 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,30,260 మంది భక్తులు అమర్‌నాథుని ద‌ర్శ‌నం చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.
ఒక్క గురువారం రోజే ఏకంగా 24 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా, బుధవారం 30 వేల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

రెండు మార్గాల్లో నిలిపివేత‌..

ఇక‌, నేడు (శనివారం) ఇక్క‌డ భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఎటువంటి అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అధికారులు యాత్ర‌కు బ్రేక్ వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండుమార్గాల్లోనో యాత్ర‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్‌నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఇక రాగల 4 రోజులలో పెద్ద వర్షపాతం ఉండదని, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ భావిస్తోంది. అందుకే ముంద‌స్తు చ‌ర్యల్లో భాగంగా యాత్ర‌కు తాత్కాలిక బ్రేక్ వేసింది.

More News

    Read more about: amarnath yatra
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+