Search
  • Follow NativePlanet
Share
» »ఆదిలాబాద్‌లో అడుగ‌డుగునా జ‌ల‌పాతాలే స్వాగ‌తం ప‌లుకుతాయి!

ఆదిలాబాద్‌లో అడుగ‌డుగునా జ‌ల‌పాతాలే స్వాగ‌తం ప‌లుకుతాయి!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. ప్ర‌కృతి ప్రేమికుల క‌న్ను ఆదిలాబాద్‌ జిల్లాపై ప‌డుతుంది. ఎందుకంటే, ప‌చ్చ‌ని అడ‌వి అందాలు ఈ సీజ‌న్‌లో ఎంతో క‌నువిందు చేస్తాయి. ప‌ర‌వ‌ళ్లు తొక్కుతూ జాలువారే జ‌ల‌పాతాల స‌వ్వ‌డుల‌కు ఆదిలాబాద్ కేరాఫ్ అడ్ర‌స్ అంటే అతిస‌యోక్తి కాదు. ఓవైపు ప‌చ్చ‌ప‌ర‌దా కప్పుకున్న‌ట్లు క‌నిపించే అడ‌వి అందాలు, మ‌రోవైపు సహజసిద్ధ జలపాతాలు ఇక్క‌డకు సంద‌ర్శ‌కుల‌ను ఆహ్వానిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన జ‌ల‌పాతం కూడా ఇక్క‌డే ఉంది. అందుకే ఈ తొల‌క‌రి స‌మ‌యంలో ఆదిలాబాద్ జ‌ల‌పాతాల‌ను ప‌ల‌క‌రిద్దాం రండి!

గుత్పాల జల‌పాత‌పు స‌వ్వ‌డులు..

గుత్పాల జ‌ల‌పాతం పేరు వింటే ప‌ర్యాట‌క ప్రేమికుల మ‌న‌స్సుల్లో ఏదో తెలియ‌ని ఆనందం వెల్లువిరుస్తుంది. ఈ జ‌ల‌పాతం నేరడిగొండ మండలం రోల్‌మామడ జాతీయ రహదారి నుంచి కిలో మీటరు లోపలికి వెళితే తార‌స‌ప‌డుతుంది. సుమారు 70 అడుగుల ఎత్తునుంచి జాలువారే నీటి ధారల అందాల‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మే. కుటుంబ స‌మేతంగా విహారానికి వెళ్లాల‌నుకునేవారికి గుత్పాల జ‌ల‌పాతం స‌రైన ఎంపిక. ఈ ప్రాంతం అంత‌గా వెలుగులోకి రాన‌ప్ప‌టికీ.. ఇలాంటి ప్ర‌దేశాల‌ను గుర్తించి, విహారానికి ప్లాన్ చేసుకుంటే ఆ మ‌జానే వేరు.

lakhampurfalls1

లఖంపూర్ జ‌ల‌పాతం..

చుట్టూ ప‌చ్చ‌దనంతో నిండిన అంద‌మైన ప్ర‌దేశంలో దాగి ఉంది ల‌ఖంపూర్ జ‌ల‌పాతం. ఇది నేరడిగొండ నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో వేర్వేరు నీటి జలధారలతో ప్ర‌వ‌హిస్తూ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ ప్ర‌దేశంలో అడుగుపెడితే చాలు.. ప‌క్షుల కిల‌కిలారావాలు ఎంతో విన‌సొంపుగా ఉంటాయి. ప్ర‌శాంత‌మైన క్ష‌ణాల‌ను గ‌డిపేందుకు ఎక్కువ‌గా ఇక్క‌డికి వ‌స్తూ ఉంటారు. ఇక్క‌డ గ‌డిపే ప్ర‌తి క్ష‌ణం జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను చేరువ చేస్తుంద‌నే చెప్పాలి.

కొరటికల్ జ‌ల‌పాత‌పు ర‌హ‌దారి అందాలు..

నేరడిగొండ మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో 44వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుంది కొరిటికల్‌ జలపాతం. అయితే, ఈ మార్గం మొత్తం ప‌చ్చ‌ద‌నంతో సంద‌ర్శ‌కుల‌ను ఎంతో ఆహ్లాద‌ప‌రుస్తుంది. రోడ్డుకు ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు ఓ స‌రికొత్త ప్ర‌పంచంలోకి అగుడుపెట్టిన అనుభూతిని క‌లిగిస్తాయి. ఈ జ‌ల‌పాతం అత్యంత తక్కువ ఎత్తులోనే ప్ర‌వ‌హించేట‌ప్ప‌టికీ చూప‌రుల‌ను ఎంతో ఆక‌ర్షిస్తుంది. పైగా ఇది రహదారి పక్కనే ఉండటంతో ఎలాంటి ఏర్పాట్లు లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌యాణికులు కొన్ని క్ష‌ణాల‌పై ఇక్క‌డ గ‌డిపేందుకు ఆస‌క్తి చూపిస్తారు. అలాగే, మండలంలో ఉన్న‌ కుంటాల జలపాతం గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

gutpalafalls

ప్ర‌కృతి సోయాగాల.. గొలుసుల గుండం

దట్టమైన అటవి ప్రాంతంలో దాగిన‌ అందమైన జలపాతమే గొలుసుల గుండం జ‌ల‌పాతం. ఇది నేరడిగొండ నుంచి స‌రిగ్గా 14 కిలోమీటర్ల దూరంలోని గాజిలి గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడకు చేరుకునేందుకు కొంత మేర‌కు సాహ‌సం చేయాల్సి ఉంటుంది. ర‌హ‌దారి సౌక‌ర్యం స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల ప‌ర్యాట‌కులు అసౌక‌ర్యానికి గుర‌వుతూ ఉంటారు. అయినప్ప‌టికీ ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించాల‌నే త‌పన మ‌న‌సులో ఉండాలే కాది, ఇలాంటి అడ్డంకులు ఎంత‌వ‌ర‌కూ ఆపుతాయి చెప్పండి. దారిపొడ‌వునా తార‌స‌ప‌డే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌కృతి సోయాగాల‌ను ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతే గొలుసుల గుండం జ‌ల‌పాత‌పు అందాల‌ను చూసేయ‌వ‌చ్చు.

More News

    Read more about: adilabad tourism waterfalls
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+