Search
  • Follow NativePlanet
Share
» » ప్రపంచ సింహాల దినోత్సవం సంద‌ర్భంగా దేశంలోని ఈ పార్కుల‌ను చూడాల్సిందే..!

ప్రపంచ సింహాల దినోత్సవం సంద‌ర్భంగా దేశంలోని ఈ పార్కుల‌ను చూడాల్సిందే..!

ప్రపంచ సింహాల దినోత్సవం 2024: 'కింగ్ ఆఫ్ ది జంగిల్' జీవితాన్ని జరుపుకునేందుకు ప్ర‌తి సంవ‌త్స‌రం ఆగస్టు 10వ తేదిన ప్రపంచ సింహాల దినోత్సవాన్ని నిర్వ‌హిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, సాంస్కృతిక సమతుల్యతను కాపాడుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సింహాలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై చర్యలు తీసుకునేందుకు ఈ ల‌య‌న్స్ డే ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

World Lion Day

సింహం అడవికి రారాజు ఇది ఎప్ప‌టినుంచో చ‌దువుతున్న‌దే. అటువంటి సింహాల ర‌క్ష‌ణ కోసం ఏటా ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవాన్ని నిర్వ‌హిస్తారు. ఇక‌, మ‌న దేశంలో సింహాలను రక్షించే జూపార్కులు, అభయారణ్యాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో సింహాలను దగ్గరగా చూడాలనుకునేవారు త‌ప్ప‌కుండా అవి నివ‌సించే ప్ర‌దేశాల గురించే తెలుసుకోవాల్సిందే. మ‌రెందుకాల‌స్యం ఇండియాలోని అడ‌వి రారాజుల నివాస స్థావ‌రాల గురించి తెలుసుకుందాం పదండి.

సింహ‌ల గురించి..

సింహలు ఎక్కువ‌గా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంటాయి. వీటి పొడవు 5 నుంచి 8 అడుగులు ఉండ‌గా, బరువు 150 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది. సింహాల‌లో మ‌గ సింహం మాత్ర‌మే జూలును కలిగి ఉంటుంది. సింహల గ‌ర్జ‌న సుమారు 8 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వినిపిస్తుంద‌ట‌. సింహాలు ఎంతో సునాయ‌సానంగా ఈద‌గ‌ల‌వు. సింహం తోకకి కుచ్చుల పైగల భాగంలో ఉన్న నల్ల చారలని బట్టి సింహం వయసుని తెలుసుకోవ‌చ్చు.

గిర్ నేషనల్ పార్క్, గుజరాత్

గిర్ నేష‌న‌ల్ పార్క్ గుజరాత్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒక‌టిగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ జాతీయ ఉద్యాన‌వ‌నంలో అనేక వన్యప్రాణులు నివాసం పొందుతున్నాయి. ఈ పార్క్‌లో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది సింహాలు, పులుల గురించే. ఈ గిర్ నేషనల్‌ పార్క్ ఆసియా సింహాలకు ఎంత‌గానో పేరుగాంచింది. అందుకే చాలామంది ప‌ర్యాట‌కులు ఈ ప్రాంతాన్ని చూసేందుకు ప్ర‌త్య‌క్షంగా వ‌స్తుంటారు. ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా సింహాలు ఉండ‌డం మ‌నం చూస్తుంటాం. కానీ, గుజరాత్ రాష్ట్రంలోని గిర్‌ అభయారణ్యంలోనే కూడా సింహాలు ఎక్కువ‌గానే ఉంటాయి. కానీ, ప్ర‌స్తుతం ఆసియా ఖండంలో సింహాలు అంతరించే దశకు చేరుకున్నాయి. గిర్ అభ‌యార‌ణ‌న్యం జునాగఢ్ నుండి సుమారు 65 కిలోమీట‌ర్ల‌ దూరంలో గిర్నార్ కొండల మధ్య వెల‌సింది. ఈ అభ‌యార‌ణ్యంలో వివిధ రకాల చెట్లు, పొదలు క‌లిగి ఉంటాయి. సింహాల‌ను నేరుగా చూడాల‌నుకునేవారు మాత్రం త‌ప్ప‌కుండా ఈ పార్క్‌ను సంద‌ర్శించాల్సిందే.

సీతా మాత వన్యప్రాణుల అభయారణ్యం, రాజస్థాన్

​​సీతా మాత వన్యప్రాణుల అభయారణ్యం రాజ‌స్థాన్‌లో ఉంది. ఈ అభ్య‌యార‌ణ్యం పక్షి పరిశీలకులకు స్వర్గధామమ‌ని చెప్పుకోవాలి. ఈ పార్కులో వైట్ నెక్డ్ కొంగ, పెయింటెడ్ కొంగ, లిటిల్ ఎగ్రెట్, లెస్సర్ విజిల్ థ్రష్, బ్లాక్-వింగ్డ్ స్టిల్ట్, రెడ్ టర్టిల్ డోవ్, గ్రీన్ పావురం, రోజ్-రింగ్డ్ పారాకీట్ వంటి ప‌క్షి జాతులు క‌ల‌వు. ఇంకా ఈ అభయారణ్యంలో అడవి ఎలుగుబంటి, మచ్చల జింక, పోర్కుపైన్, జంగిల్ క్యాట్, నక్క, హైనా, చిరుతపులి, పాంగోలిన్, కారకల్, నాలుగు కొమ్ముల జింకలు క‌ల‌వు. ఈ అభయారణ్యం జైపూర్ నుండి దాదాపు 180 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంటుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఆగ్నేయ భాగంలో ఈ పార్క్ క‌ల‌దు.

More News

Read more about: wildlife
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+