భారత దేశం ఇపుడు వీసాలను గ్రాంట్ చేయటం లో తేలిక విధానం అవలంబి స్తోంది.గతంలో వీసాలు రావటం ఏ దేశాని కైనా సరే ఎంతో కష్ట తరంగా వుండేది. కాని ఇపుడు భారత దేశ ప్రభుత్వం తన సడలించిన వీసా విధానం లో సుమారు 180 దేశాలకు 'వీసా ఆన్ అరైవల్ 'మరియు ఎలెక్ట్రానిక్ ట్రావెల్ అతరైజైషణ్ లు అవలంబిస్తోంది. ఎలెక్ట్రానిక్ ట్రావెల్ అనుమతులు పొందగోరే విదేశీయులు తమ వీసా లను ఇంటి నుండే దరఖాస్తు చేసుకోన వచ్చు. అయితే, ఈ సౌకర్యం ఎనిమిది దేశాలకు లేదు. అవి, ఇరాన్, శ్రీ లంక, పాకిస్తాన్, సోమాలియా, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా మరియు ఇరాక్ దేశాలు.

నూతన వీసా విధానంలో దరఖాస్తుదారులు నియమిత వెబ్ సైట్ లలో తగిన రుసుము చెల్లిస్తూ దరఖాస్తు చేయాలి. వీరికి ఆన్ లైన్ నిర్ణయం మూడు పని దినాలలో వచ్చేస్తుంది. దీని కొరకు ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను ఉంచుతున్నారు. వీసా ఆన్ అరైవల్ మరియు ఎలెక్ట్రానిక్ ట్రావెల్ అనుమతులు ఈ 180 దేశాల పర్యాటకులకు తొమ్మిది విమానాశ్రయాలలో అమలు చేస్తున్నారు. వాటిలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నయి, కోచిన్, హైదరాబాద్ , గోవా , త్రివేండ్రం లు కూడా కలవు. ఈ సంవత్సరం చివరి కల్లా ఈ కొత్త వీసా విధానం అమలు లోకి వస్తుంది.
ఈ కొత్త విధానాన్ని వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ప్లానింగ్ కమిషన్ సమావేశంలో అనుమతించారు. కొన్ని అధికారిక నివేదేకల మేరకు 2015 సంవత్సరం నాటికి మన దేశపు విదేశీ ఎక్స్ చేంజ్ ఆదాయాలు పర్యాతకత నుండి సుమారు 26బిలియన్ డాలర్లు ఉండగలవని అంచనా.
భారత దేశానికి ప్రస్తుతం దిగువ దేశాల నుండి పర్యాటకులు గరిష్టంగా వస్తున్నట్లు అధికారిక రికార్డులు చూపుతున్నాయి. అవి అమెరిక 10 లక్షలకు మించిన పర్యాటకులతో 16 శాతం, ౨. ఇంగ్లాండ్ - 7 లక్షల పర్యాటకులతో 11.9 శాతం, బంగ్లా దేశ్ - 7 శాతం, శ్రీ లంక 4.5 శాతం, 5, కెనడా 3.8 శాతం కలవు.



Click it and Unblock the Notifications











