Search
  • Follow NativePlanet
Share
» »గోవాలో భారతదేశపు మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్

గోవాలో భారతదేశపు మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్

గోవాలో భారతదేశపు మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్

భారతదేశపు మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్ గోవాలో ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా ప్రచారం చేయడం ఈ పండుగ లక్ష్యం. భారతదేశ సముద్ర చరిత్రను 75 ప్రముఖ లైట్‌హౌస్‌ల ద్వారా జరుపుకునే లక్ష్యంతో "ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్" అనే ఒక కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫెస్టివల్ మొదటి ఎడిషన్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ గోవాలో సెప్టెంబ‌ర్ 23న ప్రారంభించారు.

ఫోర్ట్ అగ్వాడాలో..

గోవాలోని ఫోర్ట్ అగ్వాడాలో ప్రారంభ‌మైన మొట్టమొదటి భారతీయ లైట్‌హౌస్ ఫెస్టివల్‌. సముద్ర నావిగేషన్‌లో ముఖ్యమైన భాగమైన లైట్‌హౌస్‌లను సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. లైట్‌హౌస్‌లు శతాబ్దాలుగా ఓడలు, పర్యాటకులను వాటి రహస్య, సుందరమైన అందాలతో ఆకర్షించే ప్రత్యేకమైన నిర్మాణాలని మంత్రి సర్బానంద సోనోవాల్ ట్వీట్ చేశారు. ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ అనేది భారతదేశ లైట్‌హౌస్‌ల వేడుక, దేశ సముద్ర చరిత్రలో వాటి ముఖ్యమైన పాత్రను గుర్తు చేసుకునే అత్యంత ముఖ్య‌మైన పండుగ‌గా దీన్ని చెప్పుకోవ‌చ్చు. లైట్‌హౌస్‌లను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం, వాటిని పర్యాటక ప్రాంతాలుగా ప్రచారం చేయడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు.

Lighthouse beach

స‌ముద్ర చ‌రిత్ర గురించి సెష‌న్లు..

చారిత్రాత్మక లైట్‌హౌస్‌లను మళ్లీ కొత్తగా అందుబాటులోకి తేవడం, వాటిని విద్యా, సాంస్కృతిక, పర్యాటక హాట్‌స్పాట్‌లుగా ప్రపంచానికి అందించడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. పోర్ట్స్, షిప్పింగ్ వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ ఈ లైట్‌హౌస్‌లను ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణలుగా మార్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోంది. ఈ తొలి పండుగలో సాంస్కృతిక ప్రదర్శనలు, సముద్ర చరిత్ర గురించి సెషన్లు, శాస్త్రీయ ప్రదర్శనలు, లైట్ షోలు వంటి వాటిని ప్రదర్శించారు. ప్రముఖ సింగర్స్‌ పాటలు కూడా పాడారు.

మూడు రోజులపాటు ఉత్స‌వం..

మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం దేశంలోని అన్ని లైట్‌హౌస్‌లకు వాటి చారిత్రక ప్రాముఖ్యత, సాంస్కృతిక విలువను పునరుద్ధరించే లక్ష్యంతో దాని వేడుకలను విస్తరిస్తుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర పర్యాటక శాఖ శ్రీపాద్ నాయక్, గోవా టూరిజం మంత్రి రోహన్ ఖౌంటే వంటి ప్రముఖులు ప్రారంభ సెషన్‌కు హాజ‌ర‌య్యారు. సోనోవాల్ గతంలో 'లైట్‌హౌస్ హెరిటేజ్ టూరిజం' ప్రచారాన్ని ప్రారంభించారు, 75 చారిత్రాత్మక లైట్‌హౌస్‌లను అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశాలుగా మార్చే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టారు.

Lighthouse

ఈ చారిత్రాత్మక లైట్‌హౌస్‌ల పునరుద్ధరణలు సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి వాటిని ఆధునిక సౌకర్యాలతో సన్నద్ధం చేస్తున్నాయి. ఒకప్పుడు సముద్ర నౌకలకు మార్గదర్శకంగా ఉండే ఈ లైట్‌హౌస్‌లు ఇప్పుడు ప్రకృతి అందాల‌లో మునిగిపోయే ప్రజలకు ప్రశాంతమైన స్వర్గధామాలుగా ఉపయోగపడతాయని మంత్రి సోనోవాల్ ఉద్ఘాటించారు.

భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తోంది..

భారతీయ లైట్‌హౌస్ చొరవ కేవలం నిర్మాణాలను సంరక్షించడం మాత్రమే కాదు. ఇది భారతదేశ‌పు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం. ఈ అద్భుతమైన లైట్‌హౌస్‌లు పర్యాటకానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, ప్రజలు వారి వారసత్వంతో కనెక్ట్ అయ్యే అవకాశాలను సృష్టిస్తాయ‌ని పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సోనోవాల్ చెప్పిన మాట‌లివి.

More News

    Read more about: fort aguada goa
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+