Search
  • Follow NativePlanet
Share
» »కుతుబ్ మినార్ - కొన్ని వాస్తవాలు !

కుతుబ్ మినార్ - కొన్ని వాస్తవాలు !

ఢిల్లీలోని కుతుబ్ మినార్ గురించి తెలియని వారుండరు. ఈ నిర్మాణం, ఇండియా లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. చరిత్రలోని ఉత్తమ స్మారక చిహ్నాలలో ఒకటి. చుట్టూ మరిన్ని ఆకర్షణలు కల కుతుబ్ మినార్ ఎత్తైన నిర్మాణంతో దేశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతోంది. మరి ఇంత ప్రధానమైన ఈ పర్యాటక ఆకర్షణను గురించిన కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.

యునెస్కో గుర్తింపు

యునెస్కో గుర్తింపు

యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశం
ఢిల్లీకి వచ్చిన ప్రతి పర్యాటకుడు తప్పక సందర్శించే కుతుబ్ మినార్ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో సంస్థ చే గుర్తింపు పొందిన చారిత్రక నిర్మాణం.

ఎత్తైన చారిత్రక చిహ్నం

ఎత్తైన చారిత్రక చిహ్నం

కుతుబ్ మినార్ ఇండియాలో పర్యాటకులచే అత్యధికంగా చూడబడే ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. గొప్ప చారిత్రక నిర్మాణం. దీని చుట్టూ అనేక ఆకర్షణలు కలవు. అనేక ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా కుతుబ్ మినార్ దేశానికి గర్వకారణంగా వుంది. ఇది ఇటుకలతో నిర్మించబడిన ఒక అతి పొడవైన నిర్మాణం. దీని ఎత్తు 72.5 మీ.లు కాగా, ప్రపంచంలోనే ఎత్తైన ఒక గోపుర నిర్మాణంగా పేరొందినది.

నిర్మాణం యొక్క శిల్ప శైలి

నిర్మాణం యొక్క శిల్ప శైలి

కుతుబ్ మినార్ నిర్మాణ శిల్ప శైలి ఇండో - మొగల్ శిల్ప శైలి కలిగి అందమైన నగిషీ చెక్కడాలు కలిగి వుంది.

ఇనుప స్థంభం

ఇనుప స్థంభం

కుతుబ్ కాంప్లెక్స్ లోపలి భాగంలో కల ఇనుప స్థంభం దానికి సంబంధించిన అనేక అంతు పట్టని గుణగణాలు మరియు రహస్యాలు కలిగి వుంది.

మెట్ల సంఖ్య

మెట్ల సంఖ్య

కుతుబ్ మినార్ టవర్ లోపలి భాగంలో 379 మెట్లు కలవు. ఈ మెట్లు అన్నీ ఎక్కి టవర్ పై భాగానికి చేరుకోవాలి.

రాతి నిర్మాణం

రాతి నిర్మాణం

కుతుబ్ మినార్ టవర్ నిర్మాణంలో పూర్తిగా ఎరుపు మరియు ముతక ఇసుక రాయి ఉపయోగించారు. ఈ నిర్మాణంపై ఖురాన్ నుండి వ్రాయబడిన కొన్ని ప్రార్ధనలు కూడా చెక్కారు.

ఒరిగి పోయిన స్థంభం

ఒరిగి పోయిన స్థంభం

కుతుబ్ మినార్ స్థంభం ఒక పక్కకు కొద్దిగా ఒరిగి పోయింది. కాల క్రమేణా ఈ నిర్మాణానికి చేసిన అదనపు కట్టడాలు మరియు మరమ్మతులు ఈ ఒంపుకు కారణంగా చెపుతారు.

బాల్కనీలు

బాల్కనీలు

ప్రతి అంతస్తులోనూ బాల్కనీలు కలవు. ఈ బాల్కనీలు ముందుకు పొడుచుకు వచ్చి కుతుబ్ మినార్ యొక్క ప్రతి అంతస్తు చుట్టూ వుంటాయి.

చుట్టుపట్ల దేవాలయాలు

చుట్టుపట్ల దేవాలయాలు

కుతుబ్ మినార్ నిర్మాణం చుట్టుపట్ల సుమారు 27 దేవాలయాలు కలవు. ఈ దేవాలయాలను గతంలో మనదేశంపై దండెత్తిన వారు చాలావరకు ధ్వంసం చేశారు.

సందర్శకుల అనుమతి

సందర్శకుల అనుమతి

1981 సంవత్సరం లో ఈ టవర్ పైకి ఎక్కి ఒక దుర్ఘటనలో అనేకమంది తమ ప్రాణాలు కోల్పోయి నందున ప్రభుత్వం ఈ టవర్ పైకి సందర్శకులు ఎక్కడం నిషేధించినది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+