Search
  • Follow NativePlanet
Share
» »తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఆర్‌సీటీసీ

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఆర్‌సీటీసీ

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఆర్‌సీటీసీ

దేశంలో అనేక చారిత్ర‌క, ఆధ్యాత్మిక క‌ట్ట‌డాల‌ను, ప్ర‌దేశాల‌నూ చూసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో 'భారత్ గౌరవ్' రైలును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రైలుకు సంబంధించిన స‌రికొత్త అప్‌డేట్ సంద‌ర్శ‌కుల‌ను మ‌రింత ఆక‌ర్షిస్తోంది. స‌రికొత్త ప్ర‌దేశాల‌లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించేందుకు.. ఆధ్యాత్మిక చింత‌త‌ను పెంపొందించేందుకు సిద్ద‌మైన‌వారు తప్ప‌కుండా ఈ విశేషాల‌ను తెలుసుకోండి.

ఐఆర్‌సిటిసి. ఈ పేరు వింటేనే రైల్వే ప్ర‌యాణీకుల మ‌న‌సులో ఏదో తెలియ‌ని ఉత్సాహం బ‌య‌టకు వ‌స్తుంది. ఎందుకంటే, ఇది ప్ర‌యాణీకుల‌ను ఆక‌ర్షించేలా సౌక‌ర్య‌వంత‌మైన ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించ‌డంతో ముందువ‌రుస‌లో ఉంటుంద‌నేది వారి భావ‌న‌. అలాంటి ఐఆర్‌సీటిసీ మొదటి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ సర్వీస్‌ను మార్చి18న ప‌ట్టాల‌పైకి తీసుకువ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

bharatgauravirctcpackage

అందులోనూ తెలుగు రాష్ట్రాల వారికి మ‌రొక సుభ‌వార్త చెప్పింది. ఈ ట్రైన్‌ దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రారంభం కానుంది. అవును మీరు విన్న‌ది నిజ‌మే, దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) మొదటి సర్వీస్ ప్రొవైడర్‌గా నమోదు చేసుకుంది.

ఇది పుణ్య‌క్షేత్ర యాత్ర‌

దీంతోపాటు ఈ రైలు పేరును 'పుణ్యక్షేత్ర యాత్ర (పూరీ - కాశీ - అయోధ్య) యాత్రగా నామకరణం చేసారు. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలై రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. దీనికి సంబంధించి ఈ రైలు, విశేషాలను అలాగే ప్రాముఖ్యతను దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్ల‌డించారు.

bharatgauravirctcpackage

పుణ్యక్షేత్ర యాత్ర: పూరి - కాశి - అయోధ్య రైలులో భారత్ గౌరవ్ పర్యటన అనేక చారిత్రక, పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించాలనుకునే రైలు ప్రయాణీకులకు గొప్ప అవకాశం అని తెలిపారు. ఈ యాత్ర మార్చి 18 నుంచి 26 మార్చి 2023 వరకు కొనసాగుతుందన్నారు. ఒక్క ప్ర‌యాణంతో జీవితంలో మ‌ర్చిపోలేని అనేక సంద‌ర్శనీయ ప్ర‌దేశాలును చుట్టేయ‌వ‌చ్చ‌న్న‌మాట‌.

ఎంపిక చేసిన స్టేష‌న్‌ల‌లో హాల్టింగ్‌..

ఈ టూర్‌లో మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగలు ఉంటాయి. ఈ ప్ర‌యాణంలో పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేస్తూ సాగుతుంది. ఈ పర్యటన ప్రయాణికులకు వైవిధ్యమైన, సౌకర్యవంతమైన పర్యాటక అనుభూతిని అందిస్తుందన‌డంలో సందేహ‌మే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన స్టేషన్లలో ట్రైన్ ఆగుతుంది. అధికారిక స‌మాచారం మేర‌కు సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో దీనికి హాల్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

bharatgauravirctcpackage

యాత్రా ప్రయాణం సంద‌ర్శ‌కుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. రైలులో వసతి, నాణ్య‌మైన ఆహారం మొదలైన సదుపాయాలను కల్పించారు. ఈ రైలు అన్నీ రకాల వసతులతో కూడిన ప్యాకేజీతో సేవలను అందిస్తుంది. సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం రైల్వేతోనే సాధ్యమన్న విష‌యం ఇప్ప‌టికే చాలామంది ప్ర‌యాణీకుల అభిప్రాయ‌మ‌నుకోండి. ఇక అస్సులు ఆల‌స్యం చేయ‌వ‌ద్దు మీ ల‌గేజీని ప్యాక్ చేసి మీ ప్ర‌యాణానికి వెంట‌నే సిద్ధ‌మ‌వ్వండి.

More News

    Read more about: irctc bharat gaurav train
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+