ఈ సెలవుల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మధ్యప్రదేశ్ లోని జ్యోతిర్లింగ ప్రదేశాలు సందర్శించేలా ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఐదు రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీలో రూ.11720 ప్రారంభ ధరతో అందిస్తోంది. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని వంటి జ్యోతిర్లింగ దర్శన భాగ్యం పొందాలనుకుంటే మాత్రం ఈ ఐదు రోజుల టూర్ ప్యాకేజీలో మీరు భాగస్వాములవ్వండి. ఐఆర్సీటీసీ అందిస్తోన్న ఈ ప్యాకేజీ రూ.11720 ప్రారంభ ధరతో ప్రతి బుధవారం కాచిగూడ నుంచి రైలు ప్రయాణం ఉంటుంది.

ప్యాకేజీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్(1 నుంచి ముగ్గురు ప్రయాణికులు)
కంఫర్ట్ 3AC సింగిల్ షేరింగ్‌కి రూ.35800 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ షేరింగకయితే రూ.20180 చెల్లించాలి. ట్రిబుల్ షేరింగ్ అయితే, రూ.15750 చెల్లించాలి. చైల్డ్ విత్ బెడ్(5-11 years) రూ.11910 చెల్లించాల్సి ఉంటుంది. చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) రూ.10020 చెల్లించాలి. స్టాండర్డ్ (SL)సింగిల్ షేరింగ్‌కి రూ.33390 ఉంటుంది. డబుల్ షేరింగ్‌కయితే రూ.17700 నిర్ణయించారు. ట్రిబుల్ షేరింగ్ అయితే, రూ.13260 ఉంటుంది. చైల్డ్ విత్ బెడ్ రూ.9420, చైల్డ్ విత్ అవుట్ బెడ్ రూ. 7530 ఉంటుంది.

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్ (4 నుంచి ఆరుగురు ప్రయాణికులు)
కంఫర్ట్(3AC) డబుల్ షేరింగ్ రూ.16580 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ రూ.14210 చెల్లించాలి. చైల్ విత్ బెడ్(5-11 years) రూ.11910 ఉంటుంది. చైల్ విత్ అవుట్ బెడ్(5-11 years) రూ.10020. స్టాండర్డ్(SL) డబుల్ షేరింగ్ రూ.14100, ట్రిపుల్ షేరింగ్ రూ.11720, చైల్ విత్ బెడ్(5-11 years)రూ.9420, చైల్ విత్ అవుట్ బెడ్(5-11 years)రూ.7530
ఐదు రోజుల టూర్ వివరాలు ఇలా ఉన్నాయి..
మొదటి రోజు బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 4.40 గంటలకు 12707 అనే నెంబర్‌గల సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణం ఉంది. ఇందులో రాత్రంతా జర్నీ ఉంటుంది. రెండో రోజూ గురువారం ఉదయం 08:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. స్టేషన్ నుంచి హోటల్‌కి బయలుదేరుతాం. అనంతరం హోటల్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంచి స్థూపం సందర్శనకు బయలుదేరుతాం. తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ ఆలయ సందర్శన ఉంటుంది. తిరిగి భోపాల్ చేరుకుని గిరిజన మ్యూజియం విజిట్ చేస్తారు. ఆ రాత్రికి భోపాల్‌లోనే బస ఉంటుంది.

మూడో రోజు శుక్రవారం ఉదయం హోటల్‌లో టిఫిన్ చేసి, అక్కడినుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయినికి బయలుదేరతారు. ఉజ్జయినిలో హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత ఉజ్జయినిలోని స్థానిక దేవాలయాలైన శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయం వంటివి సందర్శించొచ్చు.
ఆ రాత్రికి ఉజ్జయినిలో బస చేస్తారు. నాలుగురోజు శనివారం ఉదయం హోటల్‌లో అల్పాహారం ముగించుకుని చెక్ అవుట్ చేస్తారు. అక్కడి నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వర్ బయలుదేరుతాం. అక్కడ అహల్యా దేవి కోట & నర్మదా ఘాట్ సందర్శించిన తర్వాత ఓంకారేశ్వర్‌కు బయలుదేరతారు. అక్కడ హోటల్ లో చెక్ ఇన్ అయ్యి ఓంకారేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస. ఐదోరోజు ఆదివారం ఉదయం హోటల్‌లో టిఫిన్ చేసి చెక్ అవుట్ చేస్తారు.
ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోర్‌కి బయలుదేరతాం. అక్కడ లాల్ బాగ్ ప్యాలెస్, ఖజ్రానా గణేష్ మందిర్ విజిట్ చేస్తారు. రాత్రి 8:00 గంటలకు ఇండోర్ రైల్వే స్టేషన్‌కి వెళతాం. అక్కడ 19301 అనే నెంబర్ గల ట్రైన్ ఎక్కాలి. ఆ రాత్రంతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక, ఆరో రోజు సోమవారం రాత్రి పదికి కాచిగూడ చేరుకుంటారు. ఇవి టూర్ విశేషాలు మరెందుకాలస్యం మీరు కూడా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరీ..



Click it and Unblock the Notifications












