Search
  • Follow NativePlanet
Share
» »పిల్లలు ఒంటరిగా ఫ్లైట్ లో వెళితే ?

పిల్లలు ఒంటరిగా ఫ్లైట్ లో వెళితే ?

పిల్లలను ఒంటరి విమాన ప్రయాణానికి ఎలా సిద్ధం చేయాలి ? ఏ ఎయిర్లైన్స్ లో పంపాలి ? నేటి రోజుల్లో విమాన ప్రయాణాలు తరచుగా చేస్తున్నాం. దీని వలన వ్యయం అధికమైనప్పటికీ ఎంతో సమయం, శ్రమ పొదుపు అవుతున్నాయి. విమాన ప్రయాణం ఎంతో సుఖంగా వుండి అలసట నుండి దూరం చేస్తుంది. నేటి రోజులలో పిల్లలు సైతం సుఖకరమైన వేగవంతమైన ప్రయాణాలు ఎంపిక చేస్తున్నారు. కాని తల్లి తండ్రులు పిల్లల ఒంటరి ప్రయాణాలకు ఇష్టపడరు. కాని తగిన జాగ్రత్తలతో పిల్లలకు విమాన ప్రయాణాలు సౌకర్యవంతమే. పిల్లలకు విమాన ప్రయాణాలు సురక్షితమే. ప్రయాణ ఇబ్బందులు తక్కువగా వుండి వారికి ఉత్సాహంగా కూడా వుంటుంది. వారికి ఎల్లప్పటికి ప్రయాణం గుర్తుండిపోయేలా చేస్తుంది. మరి వీరిని విమాన ప్రయాణం చేయించేటపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలేమిటో చూద్దాం.

వయసు

సాధారణంగా అయిదు నుండి 18 సంవత్సరాల పిల్లలను తోడులేని ఒంటరి మైనర్ లు గా ఎయిర్లైన్స్ సంస్థలు గుర్తిస్తాయి. అయితే, ఈ అంశం వారు తీసుకొనే ఫ్లైట్ అంటే స్తానికమా లేక అంతర్జాతీయ మా అనే దానిని బట్టి కూడా వుంటుంది. కనుక ముందుగా ఎయిర్లైన్ సంస్థతో విచారణ చేయండి. అసలు మీ పిల్లవాడు మీరు లేకుండా ప్రయానికి ఇష్టపడుతున్నాడా అనేది కూడా తెలుసుకోండి.

ఎయిర్లైన్ టికెట్ బుక్ చేసే ముందు అన్ని ఎయిర్లైన్ సంస్థల గురించి విచారించండి. వారు ఒంటరి పిల్లలను అనుమతిస్తారా అనేది తెలుసుకోండి. ఇప్పటికే చాలా ఎయిర్లైన్ సంస్థలు ఒంటరి పిల్లల ప్రయాణాలు అధికం అవటం చూసి, వారికి తగిన సదుపాయాలూ చేస్తున్నాయి. సాధారణంగా పిల్లలు తల్లి తండ్రులతో ప్రయాణిస్తే, వారికి తక్కువ ఛార్జ్ వుంటుంది. లేదా కొన్ని ఎయిర్ లైన్ సంస్థలు డిస్కౌంట్ లు కూడా ఆఫర్ చేస్తునాయి. అయితే, ఒంటరి పిల్లల ప్రయానికి పూర్తి చార్జీలు వుంటాయి. మీరు ఎయిర్ లైన్ సంస్థకు పిల్లవాడు ఒంటరి ప్రయాణం చేస్తున్నాడని అవసరమైన ఫారాలు నింపటం ద్వారా లేదా నేరుగా వారితో చెప్పండి.

ఫ్లైట్
ఫ్లైట్ ఎంపిక చేసేటపుడు, సాధ్యమైన్తవరకూ డైరెక్ట్ ఫ్లైట్ ఎంపిక చేయండి. కనెక్టింగ్ ఫ్లైట్ ల ప్రయాణం పిల్లలకు కష్టం అవుతుంది. వీలైనంత వరకూ రోజులోని మొదటి ఫ్లైట్ లో పంపండి. తర్వాతి ఫ్లైట్ లు సాధారణంగా డిలే అవుతాయి. ప్రయాణంలో ఆలస్యం పిల్లలను విసుగికి గురి చేసి, కోపం కూడా తెప్పిస్తుంది. పిల్లలకు కొత్త వారైన, పిల్లల ఒంటరి ప్రయాణంలో సహకరించవలసిన సిబ్బంది వారితో ఇబ్బంది పడి అసహనానికి గురి అవుతారు.
పిల్లాడిని ముందుగా ఒంటరి ప్రయాణానికి సిద్ధం చేయండి.

పిల్లలను ముందుగా సిద్ధం చేస్తే, ఆ సమయంలో వారు ఎలా వుండాలి అనేది వారికి అవగతం అవుతుంది. వారికి అన్ని వివరాలు తెలియ చేయండి. మొదటి సారి ఎయిర్ లో వెళ్ళే పిల్లలు అయితే, వివరాలు లేకుంటే మరింత ఇబ్బంది పడతారు. అవసరం అనుకుంటే, కొద్ది రోజులు ముందు, ఎయిర్ పోర్ట్ చూపి అక్కడ సిబ్బంది తో పరిచయం చేయండి. ప్రయాణం రోజు మీరు వెంట లేకున్నా సమస్య వుండదు. సిబ్బంది గుర్తింపు కొరకు పిల్లలకు వారి దుస్తులు, గుర్తింపు కార్డులు మొదలైన వాటి పట్ల వివరించండి. సిబ్బంది ప్రయాణంలో సహకా రిస్తారని తెలుపండి.

ప్యాకింగ్
పిల్లవాడి లగేజ్ లైట్ గా ఉండేలా చూడండి. కాని అవసరమైన అనీ వస్తువులూ వుండాలి. చ్వేటి లగేజ్ లో కొంత మనీ, సెల్ ఫోన్ తక్షణ అవసరానికి అందుబాటులో వుంచండి. సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలుపండి. సాధారణంగా పిల్లలు స్నాక్స్ వంటివి తింటారు. కనుక వారికి ఇష్టమైన కొన్ని స్నాక్స్ ను చిన్న ప్యాకెట్ లలో పెట్టి ఇవ్వండి. ఆకలి వేసినపుడు ఇవి తింటారు.

పిల్లలు ఒంటరిగా ఫ్లైట్ లో వెళితే ?

ఇన్ఫర్మేషన్ కార్డ్
మీ పిల్లాడి ని గురించిన సమాచారంతో ఒక కార్డ్ ప్రిపేర్ చేయండి. ఇందులో వారి పేరు, వయసు, అడ్రస్, ఫ్లైట్ నెంబర్, చేరే ప్రదేశం వుండాలి. అతడిని పిక్ అప్ చేసే వారి పేరు, వివరాలు , ఫొటోగ్రాఫ్, అత్యవసర కాంటాక్ట్ వివరాలు కూడా వ్రాయండి. పిల్లాడికి ఏవైనా ఎలర్జీ లు, లేదా మెడిసిన్ వాడవలసిన అవసరం వుంటే ఈ కార్డ్ లో వ్రాయండి.

పిక్ అప్ అండ్ డ్రాప్
ఫ్లైట్ ఎక్కవలిసిన రోజున ఎర్లీ గా ఎయిర్ పోర్ట్ కి వెళ్లి, మీ పిల్లాడిని పంపవలసిన ఏర్పాట్లు, చేయండి. వారు ఒంటరి పిల్లల ప్రయాణ లిస్టు లో వున్నారా అనేది విచారించండి. పిల్లాడిని ఎయిర్ పోర్ట్ స్టాఫ్ కు పరిచయం చేయండి. ఫ్లైట్ ఆలస్యం ఉందా, ఎప్పుడు బయలు దేరుతుంది అనే అంశాలు వివరించండి. ఎయిర్లైన్స్ సంస్థలు అనేకం ఫ్లైట్ కదిలెంత వరకు తల్లి తండ్రులు అక్కడ వుండాలని కోరతాయి. పిల్లాడితో ఏదైనా సమస్య వస్తే, మీకు అతనిని తిప్పి అప్పగిస్తారు.

విమాన సంస్థలు
తోడులేని పిల్లల ప్రయాణాలకు సంబంధించి, అన్ని విమాన సంస్థలకు వయసు తప్పించి మిగిలిన అంశాలలో ఒకే నిబంధనలు వుంటాయి. గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, ఇండిగో మొదలైన విమాన సంస్థలు స్థానిక ప్రయాణాలకు లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లకు తగిన చార్జీలతో పాటు, ఫోటో గుర్తింపు కార్డు, వారిని ఫ్లైట్ ఎక్కించే వారి గుర్తింపు కారుదులు కోరతాయి. కొన్ని సంస్థలు పిల్లలను ప్రయాణ సమయంలో సిబ్బంది పక్కనే వుంచి ప్రయాణం చేయిస్తారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+