పర్యాటక ప్రదేశాలుగా గుర్తింపు పొందనప్పటికీ కొన్ని ప్రాంతాలు ప్రకృతి దిద్దిన సుందర దృశ్యాలుగా పలకరిస్తాయి. అలాంటి అద్భుత ప్రదేశమే నల్గొండ జిల్లా చందంపేట మండలం సమీపంలోని కృష్ణానదీ లోయలో ఉన్న మునుల గుహలు. మండలంలోని కాచరాజుపల్లికి దగ్గగా ఉన్న గుట్టల వరుసలో ఈ గాజుబేడం గుహ ఆక్వామెరీన్ (నీలి ఆకుపచ్చ) రంగుతో చూపరుల మనసును కట్టిపడేశాలా దర్శనమిస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు బాహ్యప్రపంచానికి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాయి. ప్రకృతి ప్రేమికులు ఇటువైపుగా అడుగులు వేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఆ అందాల మునులగుహలతోపాటు చుట్టుపక్కల ఉన్న సందర్శనీయ ప్రదేశాల గురించిన ఆసక్తికరమైన విషయాలు చూద్దామా?!
నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న ఈ గుహలోకి ప్రవేశించే మార్గం చాలా విశాలంగా కనిపిస్తుంది. గుహలోపలకు అడుగుపెట్టగానే కళ్ళుచెదిరే రంగులగోడలు, అంతస్తుల ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ మునుల గుహ లేదా భావోజి గుహగా పిలుచుకునే ప్రాంతంలో ఏర్పడిన గుహాంతర్భాగాలు సొరంగాలుగా, అంతస్తులుగా ఎంతో నేర్పరులైన శిల్పులు చెక్కినట్లుగా కనిపిస్తాయి. ఉలితో చెక్కినట్టుగా ఇక్కడి రాతిగోడలు, అందమైన ఆకృతులు అద్భుతమైన రాతి ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభూతిని అందిస్తాయి. లొపలి భాగంలో ఒకచోట ఎరుపు రంగు, మరొకచోట నారింజ రంగుతోపాటు గుహలో 90 శాతం వరకూ ఆక్వామెరీన్ రంగులో మిరుమెట్లుగొలిపేలా కపబడతాయి.
అరుదైన గుహలుగా..
ఈ రాతిగోడలు ఇలా రంగులతో మెరిసిపోసిపోవడానికి కారణం అగ్నిపర్వతంలో లావా ప్రవాహం ప్రభావమని నిపుణులు అంచనా వేస్తున్నారు. లావావేడికి కరిగిన వివిధ ఖనిజాలు కలిసిపోవడంతో ప్రాకృతికంగా గోడలకు ఈ అరుదైన వర్ణాలు అద్దినట్లు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఈ గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే అరుదైన గుహలుగా మంచి విహార యాత్రాస్థలంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు కొత్త హంగులు దిద్దడం ద్వారా అది సాధ్యమవుతుందని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెడితే ప్రతిష్టాత్మకంగా మారడంతోపాటు రేపటి పర్యాటక సంపదకు కూడా మూలకారణం అయ్యే లక్షణాలు ఈ గుహలకు ఉన్నాయనడంలో సందేహం లేదు. దీంతోపాటు గుహలోని కొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా అనేక ఆశ్చర్యపరిచే చారిత్రక విశేషాలు బయటపడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడి సహజమైన అందాలు, పర్యాటకానికి అవసరమైన అన్ని అర్హతలూ మునుల గుహకు ఉన్నాయని చెప్పొచ్చు.
మరిన్ని సందర్శనీయ ప్రాంతాలు..
ఇక్కడికి చుట్టుపక్కల కూడా సందర్శనీయ ప్రదేశాలకు కొదవలేదు. దేవరచర్లలోని పురాతన శివాలయంతో పాటు గాజు బేడం గుహలు, మునిస్వామి గుట్ట దగ్గర మునిస్వామి, ఏలేశ్వరంలో మల్లయ్యస్వామి ఆలయాలు పుష్కరాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. దేవరచర్ల సమీపంలోని మునిస్వామిగుట్టలో ఉన్న జలపాతం దగ్గర దర్శనమిచ్చే శివలింగం ఆధ్యాత్మిక అనుభూతిని చేరువ చేస్తుంది. కాచరాజుపల్లి అటవీప్రాంతంలో ఉన్న గాజు బెడం గుహలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
స్థానిక వైజాగ్ కాలనీ నుంచి కృష్ణానదిలో ప్రయాణిస్తే కొండల మధ్య కృష్ణా నది పరవళ్లు జీవితంలో మర్చిపోలేని అనుభూతులను అందిస్తాయి. మరెందుకు ఆలస్యం కుటుంబసమేతంగా ఇక్కడి పర్యటక ప్రదేశాలను చూసేందుకు ఇప్పుడే జర్నీ మొదలుపెట్టండి మరి!



Click it and Unblock the Notifications













