Search
  • Follow NativePlanet
Share
» »పోట్ల గిత్తలను లొంగ దీయటం ఎలా ?

పోట్ల గిత్తలను లొంగ దీయటం ఎలా ?

పోట్ల గిత్తలతో మనిషి పోరాటం ! జంతువు తో మనిషి పోట్లాడ టమనేది మానవుడి యొక్క శారీరక దృఢత్వానికి చివరి నిదర్శనం. దక్షిణ భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో అతి ప్రాచీనమైన ఈ సాంప్రదాయక ఆట ఇప్పటికి ప్రాచుర్యంలో వుంది. దీనినే జల్లికట్టు అంటారు.
ఎద్దులతో మనిషి పోట్లాడటం అనేది పొంగల్ పండుగ సందర్భంగా చేసే వేడుకలలో నిర్వహిస్తారు.

Photo Courtesy: wikipedia.org

ఈ జల్లి కట్టు అనే పదం సలలి కాసు అనే పదం నుండి వచ్చింది. సలలి కాసు అంటే నాణెముల పేకేజ్ అని అర్ధం. ఎద్దుల కొమ్ములకు ఒక నాణెముల మూటను కడతారు. ఆ ఎద్దును గెలిచిన మనిషికి ఆ నాణెముల మూట దక్కుతుంది. ఈ ఫెస్టివల్ లో పాల్గొన్న ఎద్దులు, సాధారణంగా పులికులం లేదా జేల్లికాట్ అనే జాతికి చెందినవిగా వుంటాయి. ఈ ఎద్దులకు సహజంగా ఎదుర్కొని పోరాడే గుణం వుంటుంది. పొంగల్ పండుగకు ఈ ప్రాంతంలో ఇది ఒక ప్రత్యేకత.

బుల్ ఫైట్ తో బల ప్రదర్శన !

Photo Courtesy: wikipedia.org

ఈ సాహస క్రీడలో మూడు భాగాలు వుంటాయి. అవి వాడి మనువిరట్టు, వయలి విరాట్టు మరియు వాదం మంజువిరట్టు. వాడి మనువిరట్టు అనేది జల్లికట్టులో అతి ప్రమాదకరమైనది. ఒకసారి ఎద్దును వదలితే, దానితో పోరాడే వ్యక్తి ప్రైజ్ పొందాలంటే, కొంత దూరం నుండి ఎగిరి దాని మూపురం పట్టుకోవాలి. ఈ రకమైన ఆటలను సినిమాలలో లేదా టి.వి. లలో కూడా చూస్తూ ఉంటాము.

వయలి విరాట్టు అనే ఆటలో ఎద్దును ఒక ఓపెన్ ఏరియా లో స్వేచ్చగా వదిలేస్తారు. ఆ ఎద్దు దానిని సమీపించే వ్యక్తిని ఎదుర్కొంటుంది. ఇక పోట్లాట మొదలవుతుంది.

వాదం మంజువిరాట్టు అనేది జలికట్టు ఆటలో సురక్షితమైనది. ఇందులో రిస్క్ తక్కువ. ఎద్దును పొడవైన తాడుకు అంటే సుమారు 50 అడుగుల తాడుకు కడతారు. ఇక దాన్ని ఓపెన్ గ్రౌండ్ లో పరుగేట్టిస్తారు. ఈ ఓపెన్ గ్రౌండ్ లోకి 7 - 9 మంది మనుషులను వదిలి ఆ ఎద్దును 30 నిమిషాలలో ఓడించమంటారు. జల్లికట్టు ఆట స్పెయిన్ లోని ఎద్దు పోరాటాలకు వల్లే వుంటుంది కాని, ఇక్కడ ఎద్దులను చంపరు. ఈ వేడుకను ఒక ఆటగానే ఆడతారు కాని పోరాటంగా ఆడరు.

అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఆటగాళ్ళ మరియు ఎద్దుల సురక్షితానికై కొన్ని చర్యలు చేపట్టింది. ఈ ఆట సమయంలో ఒక డాక్టర్ల బృందానిని కూడా తగిన చికిత్స కై నియమిస్తున్నారు. ఈ వేడుకలు ఈ రాష్ట్రంలో జనవరి మరియు మే నెలల మధ్య జరుగుతాయి. ఈ ఆట నిర్వహించాలంటే, ముందస్తుగా జిల్లా కలెక్టర్ అనుమతి తప్పక తీసుకోవాలి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+