Search
  • Follow NativePlanet
Share
» »జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి ? ఎక్కడ ఉన్నాయి ?

జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి ? ఎక్కడ ఉన్నాయి ?

శివ భగవానుడికి నీల కాంత, శంకర, పరమాత్మ, కరుణాసాగర, భోలేనాద అని ఎన్నో పేర్లు. శివ భగవానుడు సాధారణంగా ఎదో ఒక రూపంలో ప్రతి ఇంతా పూజించబడతాడు. దేశంలో శివుడి కి అనేక దేవాలయాలు కలవు. అయితే, హిందువులకు అత్యంత పవిత్రమైన శివ దేవాలయాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు.

ఈ పన్నెండు జ్యోతిర్లిన్గాలను చూస్తె, శివుడి కృపా కటాక్షాలు లభించి మోక్షం కూడా లభిస్తుందని హిందువుల నమ్మిక. సమయం తప్పక చేసుకొని జీవితంలో ఒకసారి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించి, శివుడి కృపకు పాత్రులు కండి. మరి హిందువులు ఇంత పవిత్రంగా భావించే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు భారత దేశంలో ఎక్కడెక్కడ వున్నయో పరిశీలిద్దాం.

సోమనాధ దేవాలయం

సోమనాధ దేవాలయం

గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో సోమనాధ దేవాలయం కలదు. ఈ దేవాలయం అనేక మార్లు విదేశీయుల దండయాత్రలకు గురి అయింది. అయినప్పటికీ దీనిని ఎప్పటికపుడు పునరుద్ధరించి, ఆలయ పవిత్రతలను కాపాడుతున్నారు.

మహా కాళేశ్వర

మహా కాళేశ్వర

ద్వాదశ జ్యోత్లిర్లిన్గాలలో రెండవదైన మహాకాళేశ్వర లింగం మధ్య ప్రదేశ్ లోని అతి పురాతన పవిత్ర నగరమైన ఉజ్జయని దల్లి కలదు. స్వయంభూ లింగ రూపంలో మహా కాళేశ్వర దేఆలయం రుద్రా సాగర సరస్సు సమీపంలో కలదు.

ఓంకారేశ్వర దేవాలయం

ఓంకారేశ్వర దేవాలయం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవదైన ఓంకారేశ్వర దేవాలయం మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది సమీపంలో శివ పూరి అనే ద్వీపంలో కలదు. ఈ ద్వీపం హిందువుల పవిత్ర ఓం కార ఆకారంలో ఉండటంవలన, దీనికి ఓంకారేశ్వర అనే పేరు వచ్చింది. ఈ ద్వీపంలో రెండు దేవాలయం లు కలవు. అవి ఒకటి ప్రనవనాడా ఓంకారేశ్వర టెంపుల్ మరియు రెండవది చిరాయు లేదా అమరనాధ అమరేశ్వర దేవాలయం. ఒక పురాణ కదా మేరకు ఒకే శివ లింగాని రెండు భాలుగా చేసి ఒకటి ఓంకారేస్వరుడి గాని మరొకటి అమరేస్వరుడి గాని ఏర్పడ్డాయని చెపుతారు.

ఫోటో క్రెడిట్ : ShivShankar.in

కేదారనాధ దేవాలయం

కేదారనాధ దేవాలయం

కేదారనాధ దేవాలయం, ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణులలో మందాకినీ నది సమీపంలో కలదు. ఈ ప్రదేశంలోని అతి శీతల వాతావరణం కారణంగా, ఈ జ్యోతిర్లన్గాన్ని సంవత్సరంలో ఏప్రిల్ చివరి నుండి నవంబర్ నెల చివరి వరకు మాత్రమే సందర్శించ దగినది.

ఫోటో క్రెడిట్ Shaq774

భీమ శంకర జ్యోతిర్లింగ

భీమ శంకర జ్యోతిర్లింగ

భీమ శంకర జ్యోతిర్లింగా టెంపుల్ మహారాష్ట్ర లోని పూనే సమీపంలో ఖేడ్ తాలూకా లో కలదు. ఈ టెంపుల్ భీమా నది సమీపంలో వుండటంచే, ఇక్కడి దేవుడికి భీమ శంకరుడనే నామం స్థిరపడింది.

ఫోటో క్రెడిట్ : ସୁରଥ କୁମାର ପାଢ଼ୀ

కాశి విశ్వనాధ దేవాలయం

కాశి విశ్వనాధ దేవాలయం

కాశి విశ్వనాధ దేవాలయం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లేదా కాశి పట్టణంలో కలదు. ఇది హిందూ దేవాలయాలలో ప్రసిద్ధి చెందినా యాత్రా కేంద్రం.

ఫోటో క్రెడిట్ : Wedstock 2011

త్రయంబకేశ్వర దేవాలయం

త్రయంబకేశ్వర దేవాలయం

త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా లో త్రయంబక పట్టణంలో కలదు. ఇది అతి పురాతన ప్రసిద్ధ జ్యోతిర్లింగా దేవాలయం గా చెపుతారు. నాసిక్ పట్టణానికి 28 కి. మీ. ల దూరం లో కల త్రయంబకేశ్వర ద్వీపం భారత దేశంలో అతి పొడవైన గోదావరి నది పుటుక ప్రదేశం.

ఫోటో క్రెడిట్ : Niraj Suryawanshi

వైద్య నాద దేవాలయం

వైద్య నాద దేవాలయం

ఖచ్చితమైన ప్రదేశంపై ఇంకనూ వివాదం ఉన్నప్పటికీ, ఈ దేవాలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగడ్ పట్టణంలో కలదు. దీనిని కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగనిస్తారు.

నాగేశ్వర దేవాలయం

నాగేశ్వర దేవాలయం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జాగేస్వర్ లో కల నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఈ జ్యోతిర్లిన్గాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగనిస్తారు.

రామేశ్వరం

రామేశ్వరం

తమిళనాడు లోని రామేశ్వరం లో కల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా పేరు పడింది.
ఫోటో క్రెడిట్. : Jyothis

ఘుష్ మేస్వర్

ఘుష్ మేస్వర్

రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి సుమారు 100 కి. మీ. ల దూరంలో ఈ జ్యోతిర్లింగా దేవస్థానం కలదు. దీనిని పన్నెండవ, అంటే, చివి జ్యోతిర్లింగంగా పరిగనిస్తారు.

ఫోటో క్రెడిట్ : Ghushmeshwar jyotirlinga

మల్లిఖార్జున దేవాలయం

మల్లిఖార్జున దేవాలయం

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో కల శ్రీశైలం లోని మల్లిఖార్జున దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటై భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+