Search
  • Follow NativePlanet
Share
» »కర్జాత్ - ముంబై సమీప ట్రెక్కింగ్ ప్రదేశం !!

కర్జాత్ - ముంబై సమీప ట్రెక్కింగ్ ప్రదేశం !!

నగర జీవితంతో విసుగెత్తిన వారికి, సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది.

By Mohammad

మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో కర్జాత్ ఒక పట్టణం మరియు ఉప జిల్లా. కర్జాత్ పట్టణం మనోహరమైనది. పర్వత ప్రాంతంగా ఉంటుంది. ఈ పట్టణం గంభీరమైన సహ్యాద్రి కొండలనుండి, పడమటి కనుమలు మరియు భోర్ ఘాట్ వరకు విస్తరించి ఉంటుంది. ఇది ఉల్లాస్ నదీ తీరంలో కొంకణ్ ప్రాంతంలో కలదు. కర్జాత్ లో పూర్తిగా పచ్చటి ప్రాంతాలు కనపడతాయి. అదే సమయంలో రాతి ప్రదేశంగా ఉండి వర్షాకాలంలో ఆకర్షణీయ అందాలతో ఎన్నో జలపాతాలు కూడా ఇక్కడ మీకు దర్శనమిస్తాయి.

ఇది కూడా చదవండి : శివనేరి ఫోర్ట్ - ఛత్రపతి శివాజీ జన్మస్థలం !!

సాహస పర్యటనకు ఒక కేంద్రం కర్జాత్ పట్టణం ముంబై నగరానికి సుమారు 67 కి.మీ.ల దూరంలో ఉంటుంది. నగర జీవితంతో విసుగెత్తిన వారికి, సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. కర్జాత్ ను మహారాష్ట్ర అనధికార క్రీడా రాజధానిగా గుర్తించారు. అందమైన ఈ హిల్ స్టేషన్ లో మీ ఎడ్రినాలిన్ అధికమయ్యే సాహస చర్యలు ఎన్నో ఉన్నాయి.

ర్యాఫ్టింగ్ క్రీడ

ర్యాఫ్టింగ్ క్రీడ

కర్జాత్ ట్రెక్కింగ్ కు అనుకూల ప్రదేశం. సవాలుతో కూడిన ఎన్నో ట్రెక్కింగ్ ప్రదేశాలు కలవు. ట్రెక్కింగ్ ప్రియులకే కాదు ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో ఇష్టపడే ప్రదేశం. ఉల్లాస్ నదిలోని తెల్లటి నీటిలో ర్యాఫ్టింగ్ క్రీడ ఆనందంగా ఉంటుంది.

చిత్రకృప : Ramnath Bhat

బౌద్ధమత కట్టడాలు

బౌద్ధమత కట్టడాలు

ఇక్కడి పురాతన చారిత్రక కట్టడాలైన పేధ్ కోట లేదా బౌద్ధమత కట్టడాలు, కొండన గుహలు వంటివి తప్పక చూడదగిన ప్రదేశాలు. గుహలలోని శిల్ప కళా సంపద, పెయింటింగులు చరిత్ర ప్రియులకు, పురావస్తు ప్రియులకు ఆనందం కలిగిస్తాయి. చుట్టుపట్ల ప్రదేశాలను అమితంగా ఇష్టపడవచ్చు.

చిత్రకృప : Shlokmane

చారిత్రక ప్రాధాన్యత

చారిత్రక ప్రాధాన్యత

సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తునకల ఈ పట్టణం ఎంతో సాంప్రదాయకమైనది. చారిత్రక ప్రాధాన్యత కలిగినది. విశ్రాంతి కోరేవారికి అతి తక్కువ రోజుల వ్యవధిలో పర్యటించదగినది.

చిత్రకృప : Anonymousbananas

కొండన గుహలు

కొండన గుహలు

కర్జాత్ లోని కొండన గుహలు చూడదగినవి. బౌద్ధమత జీవిత అవలంబనా విధానాలను అవి ప్రదర్శిస్తాయి. పురాతన ఈ కొండ గుహలు అనేక శిల్పాలను, స్తూపాలను, విహారాలను, చైత్యాలను కలిగి ఉంటాయి. ఈ గుహలు సుమారుగా 2వ శతాబ్దం నాటివిగా చెపుతారు. ఇక్కడి శిల్పాలు, స్తూపాలు బౌద్ధుల కాలంలో అవలంబించిన విధానాలను ప్రతిబింబిస్తాయి.

చిత్రకృప : Rudolph.A.furtado

మధ్యయుగం నాటి

మధ్యయుగం నాటి

కొండ గుహలలోని చెక్కడాలు స్త్రీ పురుషుల అనేక నాట్య భంగిమలను ప్రదర్శిస్తాయి. మధ్య యుగం నాటి ఈ గుహలు ఏటా వేలాది బౌద్ధులచే సందర్శించబడతాయి. ఈ ప్రాంతంలోకి వచ్చే భక్తులు పొగాకు వంటివి సేవించరాదు.

చిత్రకృప : Anonymousbananas

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

కర్జాత్ ప్రాంతం అనేక ట్రెక్కింగ్ అవకాశాలతో ప్రసిద్ధి చెందింది. తేలికగా లేదా అధిక రిస్కుతో కూడా ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఎన్నో ప్రదేశాలు కలవు. కొండలపైకి ఎక్కుతున్న కొలది మనోహర దృశ్యాలు అనేకం కనపడుతూంటాయి. అన్ని మార్గాల ట్రెక్కింగ్ కంటే కూడా పేధ్, చందేరి ఫోర్ట్, మాధేరన్ లకు కర్జాత్ నుండి వెళ్ళే మార్గాలు ఆకర్షణీయంగా ఉంటాయి.

చిత్రకృప : American Center Mumbai

కొండేశ్వర్ దేవాలయం

కొండేశ్వర్ దేవాలయం

కొండేశ్వర్ దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలోనే మరి కొన్ని చిన్న దేవాలయాలు కూడా కలవు. ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచిన హేమందపతి శిల్ప శైలి లో నిర్మించారు. దేవాలయం చాలామంది భక్తులను, పర్యాటకులను ప్రత్యేకించి మహా శివరాత్రి వంటి సందర్భాలలో అధికంగా ఆకర్షిస్తుంది.

చిత్రకృప : Ankit Patel

పేధ్ కోట

పేధ్ కోట

పేధ్ కోటను కోట్లిగడ్ అని కూడా పిలుస్తారు. పేధ్ గ్రామం కర్జాత్ కు సమీపంలో ఉండి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. పేధ్ కొండలు వెనుక భాగంలో మాధేరన్ ప్రదేశ అందాలతో మరింత మనోహరంగా చూడబడతాయి. ఇక్కడనుండి కొంకణ్ గ్రామీణ ప్రాంత అందాలు చూడబడతాయి.

చిత్రకృప : Anonymousbananas

నెధర్ సోల్ డ్యామ్

నెధర్ సోల్ డ్యామ్

ఇక్కడి స్నానపు తొట్టెలు, గదులు అన్ని ఆకర్షణీయంగా కనపడతాయి. ఈ కోటను బలవంతులైన మరాఠా యోధులు శత్రువులనుండి రక్షించుకునేటందుకు నిర్మించారు. ఇదే ప్రాంతంలో నెధర్ సోల్ డ్యామ్ మరియు ఫన్సాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కూడా యాత్రికులు అధికంగా సందర్శించే ప్రదేశాలు.

చిత్రకృప : Ankit Patel

కర్జాత్ ఎలా చేరుకోవాలి ?

కర్జాత్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : కర్జాత్ కు 64 కిలోమీటర్ల సమీపంలో ముంబై ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి కర్జాత్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : కర్జాత్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి పూణే, ముంబై నుండి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : ముంబై, పూణే మరియు దాని సమీప ప్రాంతాల నుండి కర్జాత్ కు పలు ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.

చిత్రకృప : RameshSharma1

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+