పర్యాటకులకు ఐఆర్‌సిటిసి నిత్యం సరికొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక, ఈ ఏడాది జరగబోయే కార్తీకమాసం సందర్భంగా ఐఆర్‌సిటిసి శివభక్తులకోసం ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీనీ తెచ్చింది. కార్తీకమాసం ఈ సంవత్సరం అక్టోబర్ 23న ప్రారంభమవుతుంది. కార్తీకమాసం ఎంతో పవిత్రమైనది. ఈ సమయంలో చాలామంది భోలేనాథుని దర్శనం చేసుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా శివాలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ఈ సమయంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుటున్న వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐఆర్‌సిటిసి దివ్యదక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లంగ యాత్ర పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీని పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ నవంబర్ 6వ తేదిన ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం తొమ్మిదిపగళ్లు, ఎనిమిది రాత్రులు సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులకు తమిళనాడులోని తిరువణ్ణామలైలోని అరుణాచలం, రామేశ్వరస్వామి, మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలో రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం, త్రివేండ్రంలో అనంతపద్మనాభ స్వామి ఆలయం, తిరుచ్చిలో రంగనాథస్వామి, తంజావూరులోని బృహదీశ్వర ఆలయాలను సందర్శించొచ్చు. ఇక, ఈ పర్యటన హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణంలోనే భాగంగానే ట్రైన్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ట్రైన్ విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగులో, కావలి,భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మదిర, నెల్లూరు, గూడురు, రేణిగుంట, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం స్టేషన్లలోనూ ఆగుతుంది. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో భాగంగా భారత్ గౌరవ్ టూరిజం ట్రైన్‌లో ఈ ప్రయాణం ఉంటుంది.
టూర్ షెడ్యూల్ ఇదే..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటిరోజు నవంబర్ 6వ తేదిన మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్ మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు బోనగిరికి చేరుకుంటుంది. అక్కడినుండి ఆ మరుసటి రోజు వేకువ జామున 1.20గంటలకు కావలి రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. తిరిగి అక్కడినుండి ఉదయం 7.30 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. అక్కడ స్టేషన్‌లో దిగిన తర్వాత హోటల్‌కు చేరుకొని ఆలయ దర్శనం చేసుకుంటారు. అనంతరం రాత్రి 10గంటలకు స్టేషన్‌కు చేరుకొని రామేశ్వరానికి ప్రయాణం మొదలవుతుంది. మూడోరోజు ఉదయం 6.30 గంటలకు కుడాల్‌నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా రామేశ్వరానికి పయనమవుతారు. ఇక, అక్కడ స్వామివారి దర్శనంతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలకు వీక్షించేందుకు బయలుదేరుతారు. ఆ రాత్రంతా అక్కడే స్టే చేస్తారు. ఆ తర్వాత అక్కడినుండి బస్సులో మధురైకి బయలుదేరుతారు.

వివిధ ఆలయాల సందర్శన..
మరుసటిరోజు మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం భాగ్యం పొందుతారు. ఇక, అక్కడ సాయంత్రం వరకు షాపింగ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. అనంతరం కన్యాకుమారి ప్రయాణం కోసం కుడాల్‌నగర్ రైల్వేస్టేషన్ చేరుకుంటారు. ఇక, ఐదోరోజు కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ వంటి సందర్శనా ప్రాంతాలను వీక్షిస్తారు. ఆ నైట్‌కు కన్యాకుమారిలోనే బస చేస్తారు. ఇక, ఆరో రోజు కన్యాకుమారి నుంచి కొచ్వెల్లి చేరుకుంటారు. అక్కడినుండి త్రివేండ్రం చేరుకొని అనంత పద్మనాభ స్వామి దర్శనానికి బయలుదేరుతారు.అనంతరం తిరుచిరాపల్లికి వెళ్తారు. మరుసటి రోజు (ఏడో రోజు) శ్రీరంగం ఆలయానికి వెళ్తారు. అదే రోజు మధ్యాహ్నం అక్కడి నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరుకి పయనమవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు రేణికుంట చేరుకుంటారు. ఇక, తొమ్మిదో రోజు వేకువ జామున 2.30గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలివే..
కార్తీక మాసం సందర్భంగా ఐఆర్‌సిటిసి పర్యాటకుల కోసం ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీని మూడు కేటగిరిల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టూర్ ప్యాకేజీ ధరలేంటో చూసేద్దాం.. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కేటగిరిలో ఈ ధరలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ కేటగిరికి రూ.14,250 చెల్లించాల్సి ఉంటుంది. అదే థర్డ్ ఏసీ అయితే రూ.21,900 చెల్లించాలి. సెకండ్ ఏసీకి రూ.28,450 గా నిర్ణయించారు. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో ట్రైన్ టికెట్, హోటల్‌లో స్టేయింగ్, బస్సు సౌకర్యం వంటివన్నీ ఉంటాయి. అలాగే టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. టూరిస్టులకు ఇన్సురెన్స్ కూడా ఉంటుంది. ఇతర పూర్తి సమాచారం కోసం లేదా ప్యాకేజీ బుక్ చేసుకోవాలనుకునేవారు..ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.



Click it and Unblock the Notifications












