Search
  • Follow NativePlanet
Share
» »త‌క్కువ బ‌డ్జెట్‌తో కాశీ నుంచి రామేశ్వరం యాత్ర‌...

త‌క్కువ బ‌డ్జెట్‌తో కాశీ నుంచి రామేశ్వరం యాత్ర‌...

త‌క్కువ బ‌డ్జెట్‌తో కాశీ నుంచి రామేశ్వరం యాత్ర‌...

భారతదేశంలో చాలా పురాతన అద్భుత దేవాలయాలు ఉన్నాయి. కాశీ వంటి పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించాల‌ని చాలామందికి చిర‌కాల కోరిక‌గా ఉంటుంది. కాశీని వార‌ణాసి లేదా కాశీ అని కూడా పిలుస్తారు. భార‌త‌దేశ‌పు అతి ప్రాచీన న‌గ‌రాల్లో కాశీ ఒక‌టి. ఇది హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన పుణ్య‌క్షేత్రం. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీని సంద‌ర్శించాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటారు. కాశీ పవిత్ర గంగానది ఒడ్డున వెల‌సింది ఈ కాశీ విశ్వనాథ దేవాలయం భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఇక్క‌డి మహాదేవుని దర్శనం కోసం భారతదేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ కాశీ విశ్వనాథ దేవాలయాన్ని విశ్వేశ్వర అనే పేరుతో కూడా పిలుస్తారు. విశ్వేశ్వర అనే పదానికి 'ప్రపంచాన్ని పరిపాలించేవాడు' అని అర్థం. ఇటువంటి పుణ్య‌క్షేత్రాన్ని సంద‌ర్శించేందుకు ఐఆర్‌సిటిసి (ఇండియ‌న్ రైల్వే స‌ర్వీసు) ఒక కోత్త స‌ర్వీసును ప‌ర్యాట‌కుల ముందుకు తీసుకొచ్చింది.

ఈసారి భారతీయ రైల్వేలైన్‌ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారతదేశంలోని ప్రధాన యాత్రా స్థలాలకు పర్యటనలను నిర్వహిస్తుంది. ఇందులో కేవ‌లం భారతదేశం మాత్రమే కాకుండా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్ కూడా రైలు, విమానాల ప్ర‌యాణాల‌ను పరిచయం చేస్తోంది. ఈ సారి భక్తులను కాశీ నుంచి రామేశ్వరం వరకు తీసుకువెళ్లేందుకు ఐఆర్‌సిటిసి ఓ స‌రికోత్త ప్యాకేజీతో ప‌ర్యాట‌కుల ముందుకు వ‌చ్చింది.

kashi yatra

దీపావ‌ళి ప్ర‌త్యేక యాత్ర‌..

ఈ దీపావ‌ళికి ఐఆర్‌సిటిసి టెంకాసి నుండి ప్రయాగ్‌రాజ్ - వారణాసి - గయ - రామేశ్వరం వరకు రైలులో ప్ర‌యాణించేందుకు సరసమైన టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ యాత్ర 9 పగళ్లు, 8 రాత్రులతో జరుగుతుంది. టెంకాసి, రాజపాళయం, శివకాశి, విరుదునగర్, మధురై, దిండిగల్, తిరుచ్చి, తంజావూరు, కుంభకోణం, విజయవాడ, ప్రయాగ్‌రాజ్, వారణాసి, గయా, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం , చిదంబరం, తిరుచ్చి, మండపం, మధురై, విరుదునగర్, శివకాశి, రాజపాళయం, తెంకాసి వరకు ఈ యాత్ర కొన‌సాగుతోంది. కేవ‌లం ప‌దిహేడు వేల రూపాయ‌ల‌తో ఈ ప్రాంతాల‌న్నీ చుట్టేయొచ్చు.టెంకాసి నుండి ప్రారంభమయ్యే భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు 04 AC & 07 స్లీపర్ క్లాస్ కోచ్‌లతో దీపావళి గంగా స్నాన యాత్రకు ప‌ర్యాట‌కుల‌ను తీసుకువెళుతుంది. ఈ తొమ్మిది రోజుల ప‌ర్య‌ట‌న‌లో దేశంలోని ప్రధాన మతపరమైన, పర్యాటక ఆకర్షణలను కవర్ చేస్తూ టూర్ ప్యాకేజీని అమలు చేయాలని ఐఆర్‌సిటిసి ప్రతిపాదించింది. ఈ ప్రయాణం వచ్చే నెల 09.11.2023న ప్రారంభం కానుంది.

rameshwaram to kashi irctc package

ప్యాకేజీలోకి వ‌చ్చేవి..

ఈ ప్ర‌యాణంలో ప్రయాగరాజ్, త్రివేణి సంగమం, వారణాసి, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి ఆలయం, సారనాథ్, గయ, విష్ణు పథ ఆలయం, రామేశ్వరం, రామనాథస్వామి ఆలయం వంటి ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల‌ను చూడొచ్చు. ఈ ప్యాకేజీలో వసతి ఖర్చులతో పాటు తొమ్మిది రోజుల బ్రేక్‌ఫాస్ట్‌లు, తొమ్మిది రోజుల‌ లంచ్‌లు, ఎనిమిది రోజుల‌ డిన్నర్లు, ప్రవేశ టిక్కెట్లు, నీరు, రవాణా, వాటర్ బాటిళ్లు, గైడ్‌లు మొదలైనవ‌నీ వ‌స్తాయి. భోజనాలకు సంబంధించి ముందుగా ఏర్పాటు చేసిన భోజనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర ఆహారాన్ని తినాలనుకుంటే మాత్రం వాటి ఖ‌ర్చు ప్ర‌యాణికులే సొంతంగా భ‌రించాల్సి ఉంటుంది. కాశీ నుండి రామేశ్వరం వరకు అతి తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలనుకుంటే మాత్రం ముందుగా ఈ లింక్‌లో మీ వివ‌రాల‌న్నీ https://www.irctctourism.com/pacakage _description?packageCode=SZBG09 లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+