ఖజురాహో ప్రదేశం గురించి చెప్పగానే మీకు ఏమనిపిస్తుంది ? అందమైన శిల్పాలు, ప్రతి శిల్పంలోను నైపుణ్యతతో చెక్కబడిన నగిషీలు, అన్నీ కలిపి ఆ శిల్పాల అందం మిమ్మల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. మన దేశంలోని ఖజురాహో శిల్ప సముదాయం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. విభిన్న జీవన తీరు తెన్నులను ప్రదర్శిస్తుంది. ఈ దేవాలయ సముదాయంలో మధ్య యుగానికి చెందిన అనేక దేవాలయాలు కలవు. మంచి పనితనంతో చెక్కబడిన కామ కేళి శిల్పాలు ఈ ప్రదేశాన్ని ఇండియా పర్యటన లో అధిక సంఖ్యాకులు పర్యటించే లా చేస్తున్నాయి. గుర్తింపు పొందిన ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశంలో సుమారు 25 దేవాలయాలు కలవు. వాటిలో కొన్నింటిని పరిశీలించి వాటి విశేషతలను తెలుసుకుందాం.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
ఖజురాహో లోని చిత్రగుప్త టెంపుల్ లో సన్ గాడ్ లేదా సూర్య భగవానుడి విగ్రహం ప్రధానంగా వుంటుంది. చూసేందుకు అద్భుతంగా వుండే అతి పెద్దదైన ఈ విగ్రహం ఏడు గుర్రాలు లాగుతున్న ఒక రధం పై సూర్యుడు నిలబడి వున్న తీరులో వుంటుంది. ఈ టెంపుల్ లో ని ఇతర ఆకర్షణలలో అందంగా చెక్కబడిన ప్రవేశ ద్వారం, సుందరమైన దేవ కన్యలు, పదకొండు తలలు కల శ్రీ మహా విష్ణువు విగ్రహం వుంటాయి. టెంపుల్ గోడలు కూడా అందమైన దేవతల, దేముల్ల శిల్పాలు చెక్కబడి వుంటాయి.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
దేవి జగదంబ అంటే ఈ విశ్వానికే మాత అని అర్ధం. ఈ దేవి జగదంబ టెంపుల్ లో జగదంబిక విగ్రహం వుంటుంది. ఖజురాహో లోని దేవాలయాలన్నిటి లోకి ఈ టెంపుల్ అతి సుందరమైనది. ఈ టెంపుల్ లో కల దేవి విగ్రహం అతి పెద్దది. మాత విగ్రహమే కాక గోడలపై ఇంకా అనేక ఇతర విగ్రహాలు కూడా చెక్క బడి వుంటాయి.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
ఈ టెంపుల్ ఖజురాహో లోని ఇతర టెంపుల్స్ అంత పెద్దది కాకపోయినా, దీనిపై కల కామ కేళి శిల్పాలతో చూసిన వెంటనే ఆకర్షణీయంగా వుంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేముడు శ్రీ మహా విష్ణువు. శిల్ప శైలి ని ప్రేమించే వారికి ఈ టెంపుల్ మరియు దాని గోడలు అత్యంత ప్రియమైనవిగా వుంటాయి. అతి చిన్నగా చెక్కబడిన ఈ శిల్పాలు ఖజురాహో శిల్ప తీరు తెన్ను లతో ముచ్చట గోల్పుతాయి.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
ప్రసిద్ధి చెందిన దుల్హాదేవ్ టెంపుల్ లో శివుడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ ఖజురాహో టెంపుల్స్ సముదాయం లో దక్షిణ భాగంలో కలదు. ఆకర్షణీయంగా చెక్కబడిన శివ భగవానుడి విగ్రహం మరియు టెంపుల్ లోని ఇతర విగ్రహాలు , గోడలకు గల చెక్కడాలు ఆ కాలం నాటి శిల్పుల శిల్ప నైపుణ్యాన్ని చాటుతాయి.
ఈ టెంపుల్ అయిదు చిన్న భాగాలుగా విభజించబడి, ఒక పెద్ద హాలు కలిగి వుంటుంది. ఈ టెంపుల్ లో శివుడిని ఒక పెండ్లి కుమారుడుగా అలంకరించబడటం విశేషత గా వుంటుంది.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
సుమారు 600 పైగా కల అద్భుత శిల్పాలు, హిందూ దేముల్ల విగ్రహాలతో లక్ష్మణ టెంపుల్ చూసేందుకు ఆకర్షణీయంగా వుంటుంది. లక్ష్మణ టెంపుల్ ఖజురాహో టెంపుల్స్ సముదాయంలోని పడమటి భాగంలో వుంటుంది. శతాబ్దాల క్రిందటి శిల్ప వైభవాలను నేటికి సంరక్షిస్తోంది. ఈ టెంపుల్ శ్రీ మహా విష్ణువు విగ్రహం కలిగి వుంటుంది. టెంపుల్ లోని ప్రతి ప్రదేశం చక్కట్ ఫెన్సింగ్ తో సంరక్షిస్తున్నారు. ఈ టెంపుల్ ప్లాట్ ఫారం పై గుర్రాలు, ఏనుగులు వంటి జంతువులు చెక్కబడి అందంగా కనపడతాయి.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
ఖజురాహో లోని లక్ష్మి టెంపుల్ , మాత లక్ష్మి విగ్రహం కలిగి వుంటుంది. ఈమె ఐశ్వర్యానికి, సంపదలకు అధిపతి గా చెప్పబడుతుంది. ఈ టెంపుల్ ఖజురాహో లోని పడమటి దేవాలయాల సముదాయానికి చెందినది. ఇక్కడి విగ్రహాలు నున్నగా మెరుస్తూ ఆకర్షణీయంగా వుంటాయి. ఇవి పసుపు ఇసుక రాతితో చెక్కబడిన విగ్రహాలు. ఈ దేవాలయంలో ప్రధాన విగ్రహమే కాక, సుమారు 650 ఇతర దేముల్ల, దేవతల చక్కగా చెక్కబడిన శిల్పాలుగా వుంటాయి.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
కన్దారియా మహాదేవ టెంపుల్ ఖజురాహో స్మారకాల సముదాయంలో పడమటి భాగానికి చెందినది. మధ్య యుగం నటి అందమైన దేవాలయాలలో దీనిని కూడా ఉత్తమమైనది గా పరిగనిస్తారు. ఇక్కడి ప్రధాన దైవం మహా శివుడు. ఈ టెంపుల్ లోని దేవతలు, దేముల్ల శిల్ప భంగిమలు కామ కేళి భంగిమలను ప్రదర్శిస్తాయి. ఇవి సుమారు 600 విగ్రహాలకు పైగా వుంటాయి. గోడలపై కూడా అనేక చిత్రాలు చెక్కారు.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
ఇక్కడి విశ్వనాథ టెంపుల్ లో దేముడు మహా శివుడు. ఈ శివుడి విగ్రహం మార్బుల్ తో చెక్కబడి వుంటుంది. టెంపుల్ లోపలి భాగం లో బ్రహ్మ దేముడి అతి పెద్ద శిల్పం చెక్కబడి వుంటుంది. బ్రహ్మ విగ్రహానికి దోవ తీసే మెట్లు ఇరువైపులా ఏనుగులు, సింహాల బొమ్మలు కలిగి వుంటాయి.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
ఆదినాధ్ టెంపుల్ జైన మతానికి సంబంధించింది. ఆదినాధ్ టెంపుల్ ఖజురాహో లోని జైన్ టెంపుల్స్ లో చాలా ప్రధానమైనది. ఒకే శిఖరం కల ఈ టెంపుల్ ఆనాటి అందమైన శిల్ప శైలి కి అద్దం పడుతుంది. ఈ టెంపుల్ గోడలకు సంగీత కారుల చిత్రాలు అందంగా చెక్కబడి వుంటాయి.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
దురదృష్టవశాత్తూ, బీజ మండల టెంపుల్ నేడు శిధిలావస్థలో కలదు. అయినప్పటికీ ఖజురాహో లోని అందమైన టెంపుల్స్ లో ఒకటిగా పరిగనించ బడుతోంది. టెంపుల్ పై భాగంలో కల తెల్లటి రాయి ఈ టెంపుల్ ను ఇతర టెంపుల్స్ అందాలతో వేరు పరుస్తుంది. ఇక్కడ ఎంతో కాలంగా వస్తున్న ఒక విచిత్ర సంప్రదాయం కలదు. ప్రతి రాత్రి ఇక్కడ ఒక పవిత్ర దీపారాధన చేస్తారు. ఈ సంప్రదాయాన్ని ఇక్కడి సమీప గ్రామంలో కల ప్రజలు ఆచరిస్తున్నారు.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
ఖజురాహో లోని దేవాలయాలలో చౌసత్ యోగిని టెంపుల్ చాలా ప్రసిద్ధి పొందినది. ఈ టెంపుల్ లో 64 మంది యోగినుల విగ్రహాలుంటాయి. ఈ యోగినులు దేవీ మాతల రూపంలో వుంటారు. ఖజురాహో లోని దేవాలయాలనిటి లోకి ఈ దేవాలయంలో మాత్రమే అక్కడ స్థానికంగా దొరికే గ్రానైట్ రాతి తో నిర్మించారు. దేవాలయంలో కూడా అధిక చెక్కడాలు లేవు.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
శాంతినాథ టెంపుల్ ను ఖజురాహో టెంపుల్స్ నిర్మాణాలలో చిట్ట చివరిది గా నిర్మించారు. ఈ జైన టెంపుల్ జైన మతస్తులకు ప్రధాన తీర్థ యాత్రలలో ఒకటి. ఈ టెంపుల్ లో ఆదినాదుడి విగ్రహం ప్రధానమైన దేముడిదిగా వుంటుంది. ఖజురాహో టెంపుల్స్ కు పర్యటనకు వచ్చే పర్యాటకులందరూ ఈ టెంపుల్ సందర్శనకు వస్తారు. ఈ టెంపుల్ లోని ధర్మశాలలో సందర్శకులకు వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

ఖజురాహో అందాలు - కౌగిళ్ల బంధాలు!
ఖజురాహో స్మారకాల సముదాయం లోని బ్రహ్మాండమైన మరొక దేవాలయం పార్శ్వనాత్ టెంపుల్. ఈ టెంపుల్ మొదటి జైన తీర్తంకరుడు అయిన ఆదినాధ్ దేముడి విగ్రహం కలిగి వుంటుంది. ఈ టెంపుల్ లో అనేక ఇతర శిల్పాలు, చెక్కడాలు కలవు. ఈ టెంపుల్ లో ఏ రకమైన కామ కేళి శిల్పాలు లేకున్నప్పటికీ, పర్యాటక ప్రసిద్ధ ఆకర్షనలలో ఒకటిగా నిలుస్తోంది.



Click it and Unblock the Notifications











