Search
  • Follow NativePlanet
Share
» »2100 ఏళ్ల నాటి లక్షల కోట్ల రుపాయల సంపద మీదే అయితే...

2100 ఏళ్ల నాటి లక్షల కోట్ల రుపాయల సంపద మీదే అయితే...

మధ్యప్రదేశ్ లోని ఖండేరావ్ కోట గురించిన కథనం.

By Kishore

విశాల భారత దేశంలోనే అనేక కోటలు ఉన్నాయి. ఈ కోటలు అప్పటి స్థానిక రాజుల యుద్ధనిరతికి నిదర్శనాలు. ఇందులో చాలా కోటలు దాదాపు మూడు నాలుగు వేల ఏళ్లకు పూర్వం నిర్మించనవి కూడా ఉన్నాయి. ఇందులో చాలా వరకూ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం. ఈ ఒక్క విషయం చాలు అప్పటి భారతీయుల భవన నిర్మాణ ప్రతిభ ఎలా ఉండేదో చెప్పడానికి. కాగా, ఇటువంటి కోటల్లో చాలా వరకూ అనేక రహస్యాలను తమలో దాచుకొన్నాయి. అటువంటి కోవకు చెందిన ఓ కోట మధ్య ప్రదేశ్ లో మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈ కోటకు సంబంధించిన విశేషాలు మీ కోసం...

దుర్యోధనుడి ఆలయం సందర్శనతో భూ స్వామి మీరే...దుర్యోధనుడి ఆలయం సందర్శనతో భూ స్వామి మీరే...

పోగొట్టుకు పోయిన వస్తువులు, తప్పి పోయిన కుటుంబ సభ్యులను మీ చెంతకు చేర్చే అమ్మవారుపోగొట్టుకు పోయిన వస్తువులు, తప్పి పోయిన కుటుంబ సభ్యులను మీ చెంతకు చేర్చే అమ్మవారు

రాక్షసుడి శరీరభాగాలు పడినే చోటే...శక్తి పీఠాలు అందుకే వీటి సందర్శనతోరాక్షసుడి శరీరభాగాలు పడినే చోటే...శక్తి పీఠాలు అందుకే వీటి సందర్శనతో

1. 2100 ఏళ్ల నాటి కోట

1. 2100 ఏళ్ల నాటి కోట

P.C:You Tube

భారత దేశంలో అనేక రహస్య ప్రాంతాల్లో లక్షల కోట్ల నిధులు ఉన్నట్లు ఉన్న కథలు మనం ఇప్పటికీ అనేక కథనాల్లో చెప్పుకొన్నా. అయితే నిధులకు దెయ్యాలు కాపాలా ఉండటం ఇప్పటి వరకూ మనం చెప్పుకోలేదు. అయితే మధ్యప్రదేశ్ లో ఉన్న 2100 ఏళ్ల నాటి కోటలో దెయ్యాలు సంపదను దెయ్యాలు రక్షిస్తుంటాయాని స్థానికులు కథలు కథలుగా చెబుతుంటారు.

2. ఖండేరావ్ కోట

2. ఖండేరావ్ కోట

P.C:You Tube

లక్షల కోట్ల రుపాయల విలువ చేసే సంపదను కలిగిన ఈ కోట పేరు ఖండేరావ్ కోట. స్థానిక రాజైన ఖండేరావ్ ఈ కోటను నిర్మించినట్లు చెబుతుంటారు. ఇందులో ఉన్న సంపదను ప్రతి రోజూ రాత్రి దెయ్యాలు వచ్చి చూసి వెలుతుంటాయని చెబుతారు. ఎవరైనా ఈ సంపదను తీసుకోవడానికి వెళితే వారిని వెంటపడి చంపేస్తాయని స్థానికుల కథనం.

3. ప్రతి రోజూ నృత్యాలు

3. ప్రతి రోజూ నృత్యాలు

P.C:You Tube

ప్రతి రోజూ రాత్రి ఇక్కడ ప్రేతాత్మల సభ జరుగుతుంది. ఆ సమయంలో దెయ్యాల రూపంలో ఉన్న నాట్యగత్తెలు నృత్యాలు చేసే అక్కడ ఉన్న ప్రతేతాత్మలను రంజింప జేస్తాయని చెబుతారు. ఈ సమయంలో గజ్జెల శబ్దం తాము విన్నట్లు అక్కడ ఉన్న స్థానికులు చెబుతూ ఉంటారు. అందువల్లే రాత్రి సమయంలో ఎవరూ ఇక్కడ ఉండటానికి సాహసించరు.

4. చూడటానికే చాలా భయంకరం

4. చూడటానికే చాలా భయంకరం

P.C:You Tube

ఈ కోట మధ్యప్రదేశ్ లోని శివపురి అనే చిన్న గ్రామం శివారిలో ఉన్న చిన్న అడవిలో ఉంది. వేల సంవత్సరాలుగా ఇది శిథలావస్థలోనే ఉంది. స్థానికంగా ఉంటున్న చాలా మందికి కూడా సరిగా తెలియదు. కొన్నేళ్ల క్రితం మీడియా వల్ల ఈ కోట వెలుగులోకి వచ్చింది.

5. ఎందుకు

5. ఎందుకు

P.C:You Tube

పూర్వం ఈ కోటలోనే ఖండేరావ్ తన పరివారంతో నివశించేవారని చెబుతారు. ఒకసారి వారంతా ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ పరివారం అంతా ఈ కోటలోనే నివశిస్తూ ఉందనేది స్థానిక కథనం. ఎవరైనా ఈ కోటను స్వాధీనం చేసుకొని అందులో నివశించడానికి ప్రయత్నిస్తే ఆ దెయ్యాలు వారిని భయపెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసేవి. అందువల్లే ఈ కోట చాలా ఏళ్లుగా శిథిలావస్థలోనే ఉంది.

6. ఎలా చేరుకోవాలి

6. ఎలా చేరుకోవాలి

P.C:You Tube

ఈ కోట మధ్యప్రదేశ్ లోని శివపురంలో ఉంది. ఇక్కడికి దగ్గరగా గ్వాలియర్ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి నేరుగా ట్యాక్సీ ద్వారా ఈ ఖండేరావ్ కోటను చేరుకోవచ్చు. శివపురిలో రైల్వే స్టేషన్ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X