ముంబై నగరం అందరూ చూడాలని కలలు కనే నగరం. ఎల్లపుడూ ఎంతో బిజి గా, జీవనం పరుగులు పెట్టిస్తూ వుంటుంది. భారత దేశానికి వినోద రాజధాని, వాణిజ్య రాజధాని, ఒక పెద్ద నగరం. అందరకూ ఎంతో ఆకర్షణీయంగా కనపడే, ఈ మహానగరంలో అందమైన సరస్సులు కలవు. ముంబై నగరం, ప్రపంచంలోని అయిదు అత్యధిక జనాభా కల నగరాలలో ఒకటి. ఇక్కడి జనాభాకు నీటి అవసరాలకు కొన్ని మంచి నీటి సరస్సులు కలవు.
దక్షిణ ముంబై నగరానికి విహార్ మరియు తులసి సరస్సులు నీటిని అందిస్తాయి. మిగిలిన సరస్సులు, నగర చుట్ట పక్కల కల ప్రాంతాలకు నీటిని ఇస్తాయి. ఈ సరస్సులు ప్రధానంగా పడమటి కనుమల నుండి వచ్చే వర్షాధారపు ప్రవాహాల నీటితో నిండిపోతాయి. ఈ సరస్సులలో చాలా సరస్సులు వలస పక్షులకు ఆశ్రయం ఇస్తాయి. టూరిస్ట్ లకు ఇది ఒక పెద్ద ఆకర్షణ. సరస్సులు చూస్తూ ప్రయాణిస్తే, మీకు చివరకు అందమైన ముంబై మహా నగరం మరింత అందంగా కనపడుతుంది.

Photo by: Elroy Serrao
విహార్ సరస్సు
విహార్ సరస్సు అతి పెద్దది (27 మైళ్ళ విస్తీర్ణం) ముంబై లోని అన్ని సరస్సులలోకి ఇది పెద్దది, అందమైనది. సందర్శకులు ముగ్దులవుతారు. ఈ సరస్సు సంజయ్ గాంధి నేషనల్ పార్క్ లో కలదు. ముంబై నగరానికి పురాతన కాలంనుండి లేదా మొట్ట మొదటిగా ఈ సరస్సు నుండి నీరు సరఫరా అయ్యింది. ఈ సరస్సుకు మితి నది నుండి నీరు వచ్చి చేరుతుంది. ఈ సరస్సులో కొన్ని మొసళ్ళు కూడా కలవు. సరస్సు పక్కనే, ఒక క్రొకోడైల్ పార్క్ నిర్వహిస్తున్నారు. విహార్ సరస్సు చుట్టుపక్కల పరిసరాలు, చాలా అందంగా వుంటాయి. ఈ ప్రదేశంలో అనేక సినిమా షూటింగ్ లు కూడా జరుగుతాయి. .

Photo by: Nicholas
తులసి లేక్
తులసి సరస్సు ను తస్సో నది పై డాం నిర్మించటం ద్వారా ఏర్పరచారు. ఈ సరస్సు ముంబై లో రెండవ పెద్ద సరస్సు. విహార్ సరస్సు కు కూడా ఇక్కడి నీరు చేరుతుంది. ముంబై నగరానికి ఉత్తరంగా 32 కి. మీ. ల దూరం లో కల ఈ తులసి సరస్సు కు నీరు పోవే - కన్హేరి పర్వత శ్రేణుల నుండి వచ్చే ప్రవాహాల నుండి వచ్చి చేరుతుంది. పుష్కలమైన మొక్కలు, జలచరాలతో ఈ ప్రదేశం అతి సుందరంగా వుంటుంది.

photo by: Michael Kohli
పోవాయ్ సరస్సు
ఈ నగరం లో విహార్, తులసి సరస్సులతో పాటు కల మరో అందమైన మూడవ సరస్సు పోవాయ్ సరస్సు. ఇది ముంబై కు ఉత్తర దిశగా గల ప్రాంతంలోని పోవాయ్ వాలీ లో కలదు. ఈ సరస్సు ప్రదేశంలో అందమైన తోటలు నిర్మించారు. స్వర్గం లాంటి ఈ ప్రదేశం సందర్శకులకు అమిత ఆనందం కలిగిస్తుంది.
బాంద్రా సరస్సు
బాంద్రా సరస్సు సుమారు 7.5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి వుంది. ఈ బాంద్రా సరస్సును పూర్వం లోటస్ ట్యాంక్ అనే వారు. ఈ సరస్సు సుమారు 200 ల ఏళ్ళ నాటిది. ఈ సరస్సు కారణంగా ఇక్కడ మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందినది.
మీ ముంబై నగర సందర్శనలో అతి సుందరంగా వుండే ఈ సరస్సులను తప్పక చూసి ఆనందించండి.



Click it and Unblock the Notifications












