Search
  • Follow NativePlanet
Share
» »మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ హిల్‌స్టేష‌న్ల‌ను చూసొద్దామా?

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ హిల్‌స్టేష‌న్ల‌ను చూసొద్దామా?

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ హిల్‌స్టేష‌న్ల‌ను చూసొద్దామా?

నిత్యం పెరుగుతున్న ఎండ‌లు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండుతున్న ఎండలు మరియు య‌బ‌ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వాతావరణం నుండి కొంత ఉపశమనం పొందేందుకు సెలవులకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఈ హిల్‌స్టేష‌న్లు వేస‌వి నుండి కొంత ఉపశ‌మనం పొందేలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు, కొండ‌లు, కోన‌లు, జ‌ల‌పాతాలు మిమ్మ‌ల్ని మ‌రోప్ర‌పంచంలోకి తీసుకువెళ‌తాయి. ఇంకా ఇక్క‌డ చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. మ‌రెందుకాల‌స్యం ఈ హిల్‌స్టేష‌న్ల‌ను ఓసారి సంద‌ర్శిద్దామా?

omkareshwar

ఓంకారేశ్వర్

మధ్యప్రదేశ్‌లో ఉన్న ఓంకారేశ్వర్ ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌లో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో అనేక అందమైన దృశ్యాలను తిల‌కించ‌వ‌చ్చు. ఈ ప్రదేశం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వరాలయానికి ప్రసిద్ధి. దేశంలోని అత్యంత ప‌విత్ర‌మైన పుణ్య‌క్షేత్రాల‌లో ఒక‌టిగా ఈ ప్రాంతం ప్ర‌సిద్ధి చెందింది. ప్ర‌తిఏటా ఇక్క‌డి వేలాదిసంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు.

pachmarhi1

పచ్మర్హి

ప‌చ్మ‌ర్హి అనేది మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని న‌ర్మ‌దాపురం జిల్లాలో ఉన్న ఒక హిల్‌స్టేష‌న్‌. న‌ర్మ‌దాపురం జిల్లాలోని సాత్పురా శ్రేణి లోయ‌లో 1067 మీట‌ర్ల ఎత్తులో ఉన్న దీనిని సాత్పురా కి రాణి అని పిలుస్తారు. ఇది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఎత్తైన ప్ర‌దేశం. మధ్యప్రదేశ్‌లో అనేక పర్యాటక ప్రదేశాలు ప్రసిద్ధి చెందినప్పటికీ, పచ్మ‌ర్హి ఎల్లప్పుడూ ప్రజలలో ఆకర్షణకు కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఎత్తైన కొండలలో ఉన్న ఈ నగరంలో అందమైన జలపాతాలు, అడవులు మరియు గుహలను చూడొచ్చు. దీంతో పాటు సమీపంలోని మహాదేవ్ హిల్స్, సాత్పురా నేషనల్ పార్క్ మరియు ప్రియదర్శిని పాయింట్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

టామియా

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్ధిచెందిన హిల్‌స్టేష‌న్‌ల‌లో టామియా ఒక‌టి. అడవులు మరియు అందమైన మైదానాలతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మ‌రియు ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌తో మిమ్మ‌ల్ని మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తుంది. ఇక్క‌డి ప‌ర్వ‌త శిఖ‌రంపై ఉన్న టామియా గుర్ర‌పుడెక్క ఆకారంలో ఉన్న పాతాల్‌కోట లోయ మ‌రియు ఇక్క‌డి ద‌ట్ట‌మైన అడవులు అద్భుత‌మైన వీక్ష‌ణ‌ల‌ను అందిస్తాయి. ఈ అడ‌వులు 2500 మిలియ‌న్ సంవ‌త్స‌రాల నాటి కొన్ని ఔష‌ద‌మొక్క‌లు, రాళ్ల‌కు నిల‌యంగా ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో పాతాల్‌కోట్ వ్యాలీ, ట్రైబల్ మ్యూజియం, సన్‌సెట్ మ్యూజియం వంటి సందర్శనా స్థలాలను కూడా ఆనందించవచ్చు.

శివపురి

శివ‌పురి మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క నగ‌రం అని పిలుస్తారు. దీనికి చాలా కార‌ణాలున్నాయి. ఒక‌టి దాని స‌హ‌జ రూపం అయితే, మ‌రోటి ఇక్క‌డి చూడ‌ద‌గిన ప్ర‌దేశాలు. ఇక్క‌డి ఉప్పొంగుతున్న జ‌ల‌పాతాలు, చుట్టూ అంతులేని ప‌చ్చ‌ద‌నంతో ఎక్కువ‌సేపు ప‌ర్యాట‌కులు ఈ ప్రాంతంలోనే ఉండేలా చేస్తుంది. శివ‌పురి స‌ముద్ర మ‌ట్టానికి సుమారు 752మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది.

ఈ ప్రాంతానికి మినీ సిమ్లా అనే పేరుకూడా ఉంది. ఇక్క‌డ స‌హ‌జ‌మైన జ‌ల‌పాతాలున్నాయి. ప్ర‌శాంత‌త‌కు నిల‌య‌మైన ఈ ప్రాంతంలో అందమైన సరస్సులను కూడా చూడొచ్చు. జాదవ్ సాగర్ సరస్సు, చాంద్‌పథ వంటివి ఇక్కడ ప్రసిద్ధి చెందిన కొన్ని సరస్సులు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో మాధవ్ నేషనల్ పార్క్, బంగంగా టెంపుల్ మరియు బోట్ రైడ్ వంటివి కూడా ఆనందించవచ్చు.

mandu

మాండు

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన సందర్శనా స్థలాలలో మాండు కూడా ఒకటి. ఇక్కడ పచ్చదనం మరియు ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా అనేక రాజభవనాలను కూడా సందర్శించవచ్చు. ఈ ప్రదేశం చరిత్ర ప్రేమికులకు ఎంతో అనువైద‌నే చెప్పుకోవ‌చ్చు. ఈ ప్రాంతంలో జహాజ్ మహల్, రాణి రూపవతి మహల్, హిందోలా మహల్ మొదలైన వాటిని చూడొచ్చు.

More News

    Read more about: omkareshwar pachmarhi
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+