రైసెన్ కోటలో దాగి ఉన్న రహస్యాలు తెలుసుకుందామా!
భారతదేశంలో రహస్యాలు దాగి ఉన్న పురాతన నిర్మాణాలకు కొదవ లేదు. అలాంటి ఓ కోట గురించి తెలుసుకుందాం. ఇక్కడ రాజు తన రాణి మరణాన్ని శాసించాడని ఓ కథనం. అదే మధ్యప్రదేశ్‌లోని రైసెన్ కోట. నేటికీ సమాధానం దొరకని ఎన్నో రహస్యాలు ఈ కోటలో దాగి ఉన్నాయి. ఇక్కడి రాజు తన భార్యను శత్రువుల నుంచి రక్షించేందుకు తల నరికి చంపాడని చెబుతారు. దీని వెనుక కూడా పెద్ద కథే ఉంది. కాబట్టి రైసెన్ కోట రహస్యం గురించి తెలుసుకుందాం.
కోటలు భారతదేశానికి గర్వకారణం. దీంతో పాటు ఎన్నో రహస్యాలను వాటిలో నిక్షిప్తం చేసుకున్నాయి. అనేక కోటలు ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. పురాతన కాలంలో శత్రువుల సైన్యాన్ని నివారించడానికి ఎక్కువగా పర్వతాలపై అద్భుతమైన ఇంజనీరింగ్ శైలిలో నిర్మించబడ్డాయి. అలాంటి కోటే మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఉంది. దీనిని రైసెన్ కోట అని పిలుస్తారు. ప్రధానంగా రెండు మతాల సమానత్వానికి చిహ్నంగా ఈ కోట ప్రసిద్ధి చెందింది.
ఈ కోట 1200 AD లో నగరానికి చేరువగా ఉండే కొండపై నిర్మించబడింది. ఈ కోట లోపల రెండు మతాల సమానత్వాన్ని తెలిపే దేవాలయం మరియు మసీదు ఉన్నాయి. భోపాల్ నగరంలో ఉన్న 800 సంవత్సరాల ఈ పురాతన కోటలో తొమ్మిది గేట్‌వేలు మరియు 13 టవర్లు ఉన్నాయి. ఇది కాకుండా, అనేక గోపురాలు మరియు అనేక మధ్యయుగ భవనాల అవశేషాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ ప్యాలెస్ వందలాది గబ్బిలాలకు నిలయంగా మారింది.

కోట చరిత్ర మహిమాన్వితమైనది
ఈ కోట చరిత్ర మహిమాన్వితమైనదిగా చెబుతారు. చాలా మంది రాజులు ఇక్కడ పరిపాలించారు. అందులో షేర్ షా సూరి ఒకరు. ఈ కోటను గెలవడానికి షేర్ షా సూరి అన్నింటినీ పణంగా పెట్టాడని చెబుతారు. అతను కోటను కైవసం చేసుకునేందుకు ఫిరంగులను తయారు చేయడానికి రాగి నాణేలను కరిగించాడు.
తన కఠోర శ్రమ వల్ల కోటలో విజయం సాధించగలిగాడు. క్రీ.శ. 1543లో షేర్ షా సూరి ఈ కోటను గెలుచే సమయానికి పురంమల్ రాజు పరిపాలించేవాడని చెబుతారు. అతను ఓటమిని అంగీకరించే సమయంలో భార్యను శత్రువుల బారి నుంచి కాపాడేందుకు తానే భార్య తల నరికి చంపాడని చెబుతారు.

ఇక్కడ ఇనుప రాయి కూడా బంగారంగా..
ఈ కోట గురించి ఎవరికీ తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఉంది. కోటను పరిపాలించిన రాజ్‌సేన్ అనే చక్రవర్తి దగ్గర ఓ మహిమాన్విత రాయి ఉండేదని, ఇది ఇనుమును కూడా బంగారంగా మార్చగలదని చెబుతారు. దీని కోసం అనేక యుద్ధాలు జరిగాయి. రాజ్‌సేన్ ఓడిపోయినప్పుడు, అతను దానిని సరస్సులో విసిరాడు. ఇతర రాజుల ఆ రాయిని కనుగొనడానికి చాలా ప్రయత్నించినప్పటికీ, ఆ రాయి ఎప్పుడూ కనుగొనబడలేదు.
పురావస్తు శాఖకు దీనిపై ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ, నేటికీ ఈ ప్రచారాన్ని నమ్మినవారు రాయిని వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకోవడం.. వారికి నిరాశే మిగులడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతుంటారు. పర్యాటకులు ఈ కోటను సందర్శించేందుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ అనుమతి ఉంటుంది. ఇది భోపాల్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications













