బైసాఖి పండుగ విశేషాలు చూద్దామా...
బైసాఖీ పండుగను ప్రతి సంవత్సరం పంజాబ్, హర్యానా ప్రాంతాలలో ఏప్రిల్ 14న ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ పంటతో ముడిపడి ఉంటుంది. ఈ రోజున, రైతులు తమ పంటలను పండించిన తర్వాత, సాయంత్రం పూట మంటలు వెలిగించి, చుట్టూ చేరి డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ఈ పండుగలో కొన్ని ప్రాంతాల్లో విభిన్నమైన సంప్రదాయాలు మనకు అగుపిస్తాయి. అటువంటి సంప్రదాయాలను తిలకించాలని మీకు ఉందా? అయితే మరెందుకు ఆలస్యం మీరు కూడా బైసాఖి వేడుకను చూడాలనుకుంటే, ఈ ప్రదేశాలను మీ విహారయాత్ర జాబితాలో చేర్చండి.
ఎక్కడెక్కడ ఏ పేర్లతో పిలుస్తారు..
వైశాఖి అని కూడా పిలువబడే బైసాఖీ, సిక్కు సమాజానికి ఒక ముఖ్యమైన పండుగ మరియు ఇది పంటకోత సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. 2023లో ఇది ఏప్రిల్ 14న నిర్వహించబడుతుంది. ఈ పండుగను ఒడిశాలో పానా సంక్రాంతి అని పశ్చిమ బెంగాల్‌లో నబా బర్షా అని లేదా పొహెలా బోయిషాక్ అని వివిధ పేర్లతో మరియు విభిన్నమైన సంప్రదాయాలతో వివిధ భారతీయ రాష్ట్రాల్లోజరుపుకుంటారు. అలాగే, తమిళనాడులో ఈ రోజును పుత్తండుగా జరుపుకుంటారు.
మళయాల క్యాలేండర్ ప్రకారం ఈ రోజును విషుగా పాటిస్తారు. అస్సాంలో దీనిని బొహగ్ బిహుగా జరుపుకుంటారు. సిక్కు ప్రజలు ఈరోజును మతపరమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పండుగ నాడు గురుద్వారాలను సందర్శించడం, లంగర్లు నిర్వహించడం, ప్రార్థనలు చేయడం, ఆశీర్వాదాలు కోరడం వంటివి చేస్తారు. ఈ రోజును సౌరనూతన సంవత్సరంగా కూడా జరుపుకుంటారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం మొదటి రోజున జరుపుకుంటారు. సిక్కు సాహిత్యం ప్రకారం మార్చి 30,1699 న సిక్కుల పదవ గురువు ఖల్సా పంత్‌ను ఏర్పాటు చేశారు. జ్యోతిష్య శాస్త్రప్రకారం, బైశాఖిని మేషా సంక్రాంతిగా కూడా జరుపుకుంటారు.
అమృత్‌సర్
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్ పర్యాటకులలో ప్రధాన ఆకర్షణగా ఉంది. దీనిని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. బైసాఖీ సందర్భంగా గోల్డెన్ టెంపుల్ అందంగా అలంకరించబడి ఉంటుంది. ఈ దృశ్యం పర్యాటకులకు ఎంతగానో ఆకట్టకుంటుంది. ఈ పండుగ సందర్భంగా పెద్ద ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. మీరు బైసాఖి వేడుకను చూడాలనుకుంటే ఈ ప్రాంతాన్ని తప్పకుండా సందర్శించండి.

పాటియాలా
పాటియాలా కూడా బైసాఖిని జరుపుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ అలంకరించబడిన గురుద్వారా అందం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈ పండుగకు ప్రత్యేక జాతర కూడా నిర్వహిస్తారు. ప్రజలు పంజాబీ పాటలపై నృత్యం చేస్తూ బైసాఖీ వేడుకను ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు.

చండీగఢ్
బైసాఖీ పండుగ ప్రత్యేక సందర్భంగా, ఈ నగరం పంజాబీ రంగులలో కనిపిస్తుంది. ఈ పండుగలో ప్రజలు సాంప్రదాయ పంజాబీ దుస్తులను కూడా ధరిస్తారు. మీరు ఇక్కడ సాంప్రదాయ మరియు ఆధునిక రూపాన్ని చూడవచ్చు. బైసాకి వేడుకలకు ఇది చాలా అందమైన ప్రదేశం.

పింజోర్
ఈ నగరం చండీగఢ్ నుండి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. బైసాఖీని జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. ఈ పండుగలో మీరు ఈ ప్రదేశం యొక్క అత్యంత అందమైన రూపాన్ని చూడవచ్చు. ఇక్కడ, స్థానిక వంటకాలు కాకుండా స్థానిక వస్తువులను కూడా బైసాఖి జాతరలో ప్రదర్శిస్తారు.



Click it and Unblock the Notifications














