Search
  • Follow NativePlanet
Share
» » ప‌శ్చిమ‌బెంగాల్‌లోని హౌరా ట్రైన్ మ్యూజియాన్ని చూసొద్దామా..?

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని హౌరా ట్రైన్ మ్యూజియాన్ని చూసొద్దామా..?

పశ్చిమ బెంగాల్‌లో సంద‌ర్శించ‌ద‌గ్గ ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇక్క‌డ టాయ్ ట్రైన్ ఎంతగానో ప్ర‌సిద్ధిచెందింది. ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌తో పాటు హౌరా బ్రిడ్జి అందాల‌ను కూడా తిల‌కించొచ్చు. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో కుటుంబ సమేతంగా ముఖ్యంగా పిల్లలతో కలిసి టాయ్ ట్రైన్ సంద‌ర్శించ‌డానికి త‌ప్ప‌కుండా వెళ్లాల్సిందే. పిల్ల‌లు ఆడుకునేందుకు ఎంతో అనువైన ప్ర‌దేశం ఇది. ఇంకా ఇక్క‌డ హౌరా ట్రైన్ మ్యూజియం కూడా సంద‌ర్శించ‌ద‌గ్గ‌దే. రండి రైలు మ్యూజియం విశేషాల‌ను తెలుసుకుందాం.

హౌరాలో టాయ్ ట్రైన్ నడపాలనుకునేవారు త‌ప్ప‌కుండా హౌరా ట్రైన్‌ మ్యూజియమ్‌ను సంద‌ర్శించాలి. భార‌తీయ రైల్వే చ‌రిత్ర గురించి ఈ ట్రైన్ మ్యూజియంలో తెలుసుకోవ‌చ్చు. ఈ ప్ర‌దేశం ఒక పిక్నిక్ స్పాట్‌గా కూడా ప్ర‌సిద్ధిచెందింది. ఈ మ్యూజియం సుమారు 4.5 ఎకరాల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంది. ఈ ప్ర‌దేశమంతా ఒక పెద్ద తోట‌లా ఉంటుంది. ఈ తోట‌ వివిధ ర‌కాల చెట్లు, మొక్కలు, ఫౌంటైన్‌లతో అందంగా అలంకరించబడి ఉంటుంది. హౌరాలో భారతీయ రైల్వే నిర్మించిన ఈ రైలు మ్యూజియం నినాదం Learn While You Have Fun.

howrahtrainmuseum, west Bengal

ట్రైన్ మ్యూజియం చరిత్ర?

హౌరా రైలు మ్యూజియం భారతీయ రైల్వేల చారిత్రక వారసత్వ సంపద. ఈ ట్రైన్ మ్యూజియం హుగ్లీ నది ఒడ్డున నిర్మించారు. ఈ రైల్వే మ్యూజియం ఎంతో ప్రత్యేకమైనది. సెప్టెంబర్ 1, 2005న ఇక్క‌డ పునాది రాయి వేశారు. ఏప్రిల్ 7, 2006న దీనిని ప్రారంభించారు. హౌరా రైల్ మ్యూజియం ప్రధానంగా తూర్పు భారతదేశంలో రైల్వేల అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. 2 బోగీలతో కూడిన టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. దీనిలో పిల్లలు వారి తల్లిదండ్రులతో క‌లిసి రైడ్‌ను ఆస్వాదించొచ్చు. ఈ మ్యూజియం మొత్తాన్ని పూర్తిగా సంద‌ర్శించేందుకు 3 నుండి 4 గంటల స‌మ‌యం ప‌డుతుంది.

ఈ ట్రైన్ మ్యూజియంలో ఈస్ట్ ఇండియన్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్-కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ ఫ్రాంటియర్ రైల్వే, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్‌షాప్, కోల్‌కతాలోని మెట్రో రైల్వేకి సంబంధించిన చాలా పాత, అరుదైన ఛాయాచిత్రాలను చూడొచ్చు. వీటితోపాటు ఇక్క‌డ‌ 100 ఏళ్ల నాటి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన డ్రాయింగ్‌లు, పత్రాలు, భారతీయ రైల్వేల ఆధారంగా ఫిలాటెలిక్ సేకరణ, 150 ఏళ్ల నాటి స్టీమ్ ఇంజన్లు, క్యారేజీలు, సెలూన్ రైళ్లు, రైళ్లను చూసేందుకు ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. హౌరా రైలు మ్యూజియంలోని ప్రధాన ఆకర్షణ ఇక్కడ ఉంచబడిన హౌరా స్టేషన్ యొక్క‌ చిన్న నమూనా.

హౌరా రైలు మ్యూజియం ఎలా చేరుకోవాలి..

హౌరా రైలు మ్యూజియం హౌరా స్టేషన్‌కు చాలా దగ్గరలో ఉంది. కోల్‌కతా నుండి హౌరా రైలు మ్యూజియమ్‌కి వెళ్లాల‌నుకునేవారు ముందుగా మహాత్మా గాంధీ రోడ్ క్రాసింగ్ (బడా బజార్) నుండి హౌరా స్టేషన్‌కు చేరుకోవాలి. అక్క‌డి నుంచి బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. హౌరా వంతెన దాటిన తర్వాత హౌరా స్టేషన్ వైపుగా వెళ్లాల్సి ఉంటుంది. హౌరా స్టేషన్‌లోని ఓల్డ్ కాంప్లెక్స్ , హౌరా న్యూ కాంప్లెక్స్ దాటిన తర్వాత, కొంచెం ముందుకు వెళితే, హౌరా రైల్ మ్యూజియం కనిపిస్తుంది.

ప్రవేశ రుసుము...

హౌరా రైలు మ్యూజియం ఉదయం 10.30 నుండి రాత్రి 7.30 వరకు తెరిచి ఉంటుంది. ఈ మ్యూజియంలోకి వెళ్లేందుకు ప్రవేశ రుసుము ₹ 10 చెల్లించాల్సి ఉంటుంది. టాయ్ ట్రైన్ రైడ్ ఫీజు కూడా ఒక వ్యక్తికి ₹ 10. రైల్ మ్యూజియంలో అనేక రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+