Search
  • Follow NativePlanet
Share
» »నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..

నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..

నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం.. మంగ‌ళవారం (మార్చి 26) నుంచి సింహాచ‌ల వ‌రాహ‌లక్ష్మి న‌ర‌సింహ‌స్వామి వారి ఆల‌యంలో మ‌హాయ‌జ్ఞం ప్రారంభం కానుంది. ఈ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం ఏప్రిల్ 1వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. న‌ర‌సింహాస్వామి వారి ఆల‌యంలో శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు చెబుతున్నారు. ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత సింహాచ‌లంలో ఈ మ‌హాయ‌జ్ఞం నిర్వ‌హించ‌నుండ‌డంతో భ‌క్తులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

సింహాచ‌ల ఆల‌యంలోని ఉత్తర గోపురం ఎదురుగా ఉన్న కళ్యాణోత్సవం ప్రాంగణంలో మ‌హాయ‌జ్ఞానికి స‌ర్వం సిద్ధం చేస్తోన్న‌ట్లు సింహాచ‌లం ఆల‌య ఈవో సింగ‌ల శ్రీ‌నివాస‌మూర్తి తెలిపారు. ఈ యాగా కార్య‌క్ర‌మానికి యాగ‌శాల నిర్మాణం, హోమగుండాల ఏర్పాటు, భక్తులు కూర్చునేందుకు సౌకర్యాలు, తాగునీరు వంటి ఇతర వసతులు క‌ల్పిస్తున్న‌ట్లు ఆల‌య ఈవో వివ‌రించారు. ఈ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్రమం వ‌రుస‌గా ఏడురోజుల‌పాటు జ‌ర‌గనుంది. ఉద‌యం ఎనిమిది నుంచి ప్రారంభ‌మ‌య్యి మ‌ధ్యాహ్నం 12వ‌ర‌కు జ‌రిగే ఈ యాగంలో భ‌క్తులు పాల్గొన‌వ‌చ్చు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా భ‌క్తులు మూడువేల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంద‌ని ఆల‌య అధికారులు వెల్ల‌డించారు.

mahayagnastartsfromtodayinsimhachalam1

మధ్యాహ్నం ప్రత్యేక అన్నప్రసాదం..

ఈ మహాయజ్ఞంలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొనాలనుకునే భక్తులు సింహగిరితోపాటు కొండ దిగువన శ్రీదేవి కాంప్లెక్సు ఆలయంలో కౌంటర్ల ద్వారా మూడువేల రూపాయ‌లు చెల్లించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఆల‌య అధికారులు చెప్పారు. యజ్ఞంలో పాల్గొనే భక్తుల‌కోసం ఉదయం టిఫిన్‌, అలాగే మధ్యాహ్నం ప్రత్యేక అన్నప్రసాదం ఉంటుందని పేర్కొన్నారు.

దీంతోపాటు భ‌క్తుల‌కు అంతరాలయంలో ప్రత్యేక దర్శన స‌దుపాయాలు కల్పిస్తామని, ఉభయదాతలతో పాటు మరో ఇద్దరికి కూడా ఈ అవ‌కాశం ఉంటుందని ఆల‌య అధికారులు తెలిపారు. ఈ మ‌హాయ‌జ్ఞంలో పాల్గొనేవారికి శాలువ, రవిక, కళ్యాణం లడ్డు, అరకిలో పులిహోర ప్రసాదం, స్వామివారి రాగి ప్రతిమ అంద‌జేస్తారు. మ‌హాయ‌జ్ఞం మంగ‌ళ‌వారం(మార్చి 26) ఉదయం ప్రారంభమై ఏప్రిల్‌ 1న మహా పూర్ణాహుతి, శాంతి కళ్యాణోత్సవంతో ముగుస్తుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

మార్చి 27 నుంచి 31 వరకు నిర్ణీత రుసుము చెల్లించాలి..

అంతేకాదు, సింహాద్రి అప్పన్న ఆలయంలో ఐదేళ్ల తర్వాత ఈ మహత్తర యజ్ఞాన్ని నిర్వహిస్తుండ‌డంతో దీనికి మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. లోక కళ్యాణంతో పాటు భక్తుల కోర్కెలు తీరేందుకు, స్వామి అనుగ్రహం కలిగేందుకు ఆలయ వైదిక పెద్దల పర్యవేక్షణలో చతుర్వేద హవన పూర్వక పాంచాహ్నిక పంచకుండాత్మకంగా ఈ శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టనున్నారని భ‌క్తులు విశ్వ‌సిస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రారంభమై ఏప్రిల్‌ 1న మహా పూర్ణాహుతి, శాంతి కళ్యాణోత్సవంతో ఈ క్రతువు పరిపూర్ణమవుతుందన్న విష‌యాన్ని భ‌క్తులు గ్రహించాల‌ని కోరుతున్నారు.

యాగంలో పాల్గొనే భక్తులు ఈ నెల 27 నుంచి 31 వరకు నిర్ణీత రుసుము చెల్లించి భాగస్వాములు కావచ్చు. అలాగే, ఈ హోమాలలో సుదర్శన హోమానికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ఈ యాగంలో పాల్గొనే భక్తులు సైతం మార్చి 27 నుంచి 31 వరకు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పరోక్ష సేవలో పాల్గొనాల‌నుకునే భ‌క్తుల‌కు యూట్యూబ్‌ ద్వారా వీక్షించే సదుపాయాన్ని క‌ల్పించ‌నున్నారు. వీరికి ప్రసాదం, రాగి ప్రతిమ పోస్ట్ ద్వారా పంపిస్తారు.

More News

Read more about: simhachalam visakhapatnam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+