Search
  • Follow NativePlanet
Share
» »Masan Holi 2024: చీతా భ‌స్మంతో హోలీ వేడుక‌లు.. ఎక్క‌డో తెలుసా..?

Masan Holi 2024: చీతా భ‌స్మంతో హోలీ వేడుక‌లు.. ఎక్క‌డో తెలుసా..?

హిందూ మతంలో ఎంతో ముఖ్య‌మైన పండుగ‌ల‌లో హోలీ ఒక‌టి. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జ‌రుపుకుంటారు. ఈ పండుగ‌ను అన్నిర‌కాల రంగులతో జరుపుకోవ‌డం విశేషం. అందుకే దీనిని రంగుల పండుగ అని కూడా అంటారు. ఇక‌, ఈ పండుగ ప్ర‌త్యేకంగా ఫాల్గుణ మాసం ప్రారంభమంలో వస్తోంది. ఇక ఈ ఏడాది ఈ రంగుల పండుగ మార్చి 25న వ‌చ్చింది. రంగుల‌తో జ‌రుపుకునే పండుగ‌నే ఎవ‌రైనా చూసి ఉంటారు. కానీ, బూడిద‌తో జ‌రుపుకునే పండుగ‌ను ఎవ‌రైనా చూశారా? ఆ పండుగ ఎక్క‌డ జ‌రుపుకుంటారో ఇంత‌కీ ఎవ‌రికైనా తెలుసా? మ‌రెందుకాల‌స్యం ఆ ప్ర‌దేశం ఎక్క‌డుందో తెలుసుకుందాం ప‌దండి.

చాలా ప్ర‌దేశాల్లో హోలీని రంగుల‌తో కాకుండా గుడ్లు, ట‌మాట‌లతో కూడా జ‌రుపుకోవ‌డం చూసుంటాం. కానీ ఇక్క‌డ బూడిద‌తో ఈ పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఇక్క‌డ మార్చి 21 నుంచి హోలీ ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అదే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి ప్రాంతం. ఇక్క‌డ లడ్డూలు, పూలు, కర్రలతో హోలీ పండుగ నిర్వ‌హించుకోవ‌డంతో పాటు పైరు బూడిదతో కూడా హోలీ ఆడతారు. ఇది చాలా విభిన్నమైన హోలీ అని చెప్పుకోవ‌చ్చు. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు త‌ర‌లి వస్తుంటారు. ఈ హోలీ వేడుకను వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఓసారి దీనిగురించి తెలుసుకుందాం.

masanholi

పూలు, ల‌డ్ల‌తో హోలీ ఆడ‌తారు..

హోలీ ఆనందంతో నిండిన‌ రంగుల పండుగ అని అంటుంటారు. ఈ రోజున, ప్రజలు అన్ని ద్వేషాలను మరచిపోయి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ సంతోషంగా గ‌డుపతుంటారు. ఈ సంద‌ర్భంగా చాలామంది కలిసి నృత్యం చేస్తూ పాట‌లు కూడా పాడతారు. అయితే హోలీని రంగులతోనే కాకుండా మధుర-బృందావనంలో పూలు, లడ్ల‌తో కూడా హోళీ ఆడతారు. ఇక‌ వారణాసిలో అయితే, చితాభస్మంతో హోలీ ఆడే సంప్రదాయం ఎప్ప‌టినుంచో ఉంది. దీన్నే 'మసానే కి హోలీ' అంటారు. ఇది చాలా భిన్నమైన హోలీగా ప‌రిగ‌ణిస్తారు. ఈ ప్రత్యేకమైన హోలీలో భాగం కావాలనుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా వారణాసికి వెళ్లాల్సిందే. కాశీలోని చితాభ‌స్మ హోలీ మార్చి 21న నిర్వ‌హిస్తారు.

ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?

రంగభారీ ఏకాదశి రోజున భోలే శంకర్ తల్లి పార్వతీదేవికి గౌణాన్ని ప్రదర్శించి కాశీకి తీసుకువచ్చాడని ఇక్క‌డివారి న‌మ్మ‌కం. అప్పుడు అందరితో పాటు గులాల్‌తో హోలీ ఆడాడు. దెయ్యాలు, పిశాచాలు, జీవులు మొదలైన వాటితో గులాల్‌తో హోలీ ఆడలేకపోయాడు. రంగభారీ ఏకాదశి అనంత‌రం అతను శ్మశానవాటికలో తన బృందంతో కలిసి మాసన్ హోలీ ఆడాడు, అప్పటి నుండి చితా భస్మ హోలీని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంద‌ని చెబుతుంటారు. ఇక్కడ ప్రసిద్ధ శ్మశాన వాటిక అయిన వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో మసాన్ హోలీని ప్రత్యేకంగా జరుపుకుంటారు.

మ‌ర‌ణ‌మ‌నేది.. మోక్షం పొందే మార్గం..

ఉదయం నుంచి హోలీ ఇక్క‌డ మొద‌ల‌వుతుంది. సాధువులు, శివభక్తుల బృందం శివుని పూజించి హవనాన్ని నిర్వహిస్తారు. భజన, కీర్తనలతో పాటు నృత్యాలు కూడా చేస్తారు. అనంత‌రం చితాభస్మంతో హోలీ ఆడటం విశేషం. మసాన్ హోలీ వేడుక భ‌క్తుల‌కు మరణాన్ని దుఃఖంగా కాకుండా మోక్షం పొందే మార్గంగా చూడమని చెబుతుంద‌ని ఇక్క‌డివారంటారు. భారతదేశంలోని చాలా నగరాల నుండి ఈ హోలీనీ వీక్షించేందుకు ప్ర‌త్యేకంగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. వారణాసికి రైళ్లు, విమాన ర‌వాణా మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబ‌ట్టి ఇక‌, మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రీ.

More News

    Read more about: varanasi uttarpradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+