Search
  • Follow NativePlanet
Share
» »సినిమా షూటింగ్ ల జలపాతాలు !!

సినిమా షూటింగ్ ల జలపాతాలు !!

నేటి రోజులలో సినిమాలు చూడటం ఎంతో సాధారణం. అయితే అందులో దృశ్యాలు వివిధ ప్రదేశాలలో షూట్ చేయబడతాయి. దృశ్యాలు ఎంత ఆకర్షణీయంగా వుంటే సినిమా అంత సక్సెస్ కూడా అని చెప్పవచ్చు.

By Venkatakarunasri

నేటి రోజులలో సినిమాలు చూడటం ఎంతో సాధారణం. అయితే అందులో దృశ్యాలు వివిధ ప్రదేశాలలో షూట్ చేయబడతాయి. దృశ్యాలు ఎంత ఆకర్షణీయంగా వుంటే సినిమా అంత సక్సెస్ కూడా అని చెప్పవచ్చు. ఈ సినిమాల వారు ఎంపిక చేసే ప్రదేశాలలో జలపాతాల దృశ్యాలు అద్భుతంగా వుంటాయి. అందులోనూ, బాలీవుడ్ యూనిట్ లు ఎంతో శ్రమకోర్చి అందమైన జలపాతాలను ఎంపిక చేసి మరీ సినిమాలను విజయవంతం చేస్తారు. అభిమాన నటుడు షా రుఖ్ ఖాన్ లేదా కరీనా కపూర్ వంటి నటీ నటులు ఒక జలపాతం వద్ద రొమాన్స్ చేస్తూ కనపడితే, ఇక ప్రేక్షకులకు అది కను విందు. ఎంతో ప్రశంసిస్తారు. ఇతర దేశాలలో కంటే కూడా మన దేశంలో ఈ సినిమాల ప్రభావం మన జీవితాలపై అధికంగా కనపడుతుంది. మరి బాలీవుడ్ యూనిట్ లు సాధారణంగా చేసే ఈ ప్రదేశ ఎంపిక ఎక్కడో పరిశీలిద్దాం.

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

అతిరాపల్లీ జలపాతాలు ఇండియా లోని ఆగ్నేయ కోస్తా తీరంలో కేరళ లోని త్రిస్సూర్ జిల్లా లో కలవు. ఈ జలపాతాలు పడమటి కనుమలలోని అనముడి పర్వత శ్రేణుల నుండి ప్రవహించే చలకూడి నది నుండి పుడతాయి. అతిరపల్లీ జలపాతాలను ఇండియా నయాగర జలపాతాలు అని కూడా పిలుస్తారు.

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

అతిరా పల్లి జలపాతాల వద్ద బాలీవుడ్ చలన చిత్రాలు షూట్ చేసారు. వాటిలో మొట్ట మొదటగా మణిరత్నం తీసిన ' దిల్ సే' సినిమా కలదు. రావన్ సినిమా లో కల 'బెహ్ నే డే' పాటను ఈ జలపాతాల వద్ద చిత్రీకరించారు. 'గురు ' సినిమా తీసిన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్, ఈ జలపాతాల దృశ్యాన్ని ఎన్నో చోట్ల ఉపయోగించాడు.

isapisa

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

హోగేనక్కల్ జలపాతాలు, కావేరి నది నుండి పుడతాయి. అందమైన ఈ వాటర్ ఫాల్స్ తమిల్ నాడులోని ధర్మపురి జిల్లా లో కలవు. షా రుఖ్ ఖాన్ - కరీనా కపూర్ లు నటించిన అశోకా సినిమాలోని కొన్ని పాటలను హోగేనక్కల్ జలపాతాల వద్ద చిత్రీకరించారు.

Mithun Kundu

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

దూద్ సాగర్ అంటే అర్ధం పాల సముద్రం అని అర్ధం. దూద్ సాగర్ జలపాతాలు మండోవి నది నుండి పుట్టాయి. ఈ జలపాతాలు కర్ణాటక - గోవా సరిహద్దులో కలవు. ఇక్కడికి వెళ్ళాలంటే, ట్రైన్ లో మాత్రమే వెళ్ళాలి. చెన్నై ఎక్స్ప్రెస్స్ సినిమా లోని కొన్ని భాగాలు ఈ జలపాతాల వద్ద షూట్ చేసారు.

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

బాలీవుడ్ సినిమాలు - కోరినన్ని షూటింగ్ లు !

ఎంతో విజయవంతమైన బాలీవుడ్ సినిమా ' కోయలా' లోని పాటలు ఈ నౌరంగ్ జలపాతాల వద్ద షా రుఖ్ - మధురి లపై చిత్రీకరించారు. ఈ జలపాతాలు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లా లో కలవు. ఇక్కడ అనేక విదేశీ చిత్రాలు కూడా చిత్రీకరించారు.

Easyvivek

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+