Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా లో ప్రసిద్ధి చెందిన బీచ్ రోడ్లు !

ఇండియా లో ప్రసిద్ధి చెందిన బీచ్ రోడ్లు !

ఇండియా లో అనేక ఆకర్షణీయ కోస్తా ప్రాంతాలు, మరియు బీచ్ లు కలవు. సాధారణంగా, మనం బీచ్ లను అక్కడ కల నీటి వాతావరణాన్ని ఆనందించేందుకు ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యుల తో కొంత సమయం గడిపేందుకు వెళుతూ ఉంటాము. అనేక నీటి సంబంధిత అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడతాము లేదా ఒంటరిగా కూర్చుని రిలాక్స్ అయి ప్రశాన్తతలను పొందుతాము.

ఈ రంకంగా బీచ్ ప్రయాణాలలో ఆనందిస్తాము. మన కోస్తా తీర రోడ్డు ప్రయాణాలలో కూడా బీచ్ లను కార్లు, బస్సు లలోనుండే దూర తీరాల నుండి చూసి ఆనందించి ప్రయానిస్తాము. మన కారు లో కూర్చుని ప్రయాణిస్తూ కోస్తా తీరాలను చూడటం ఎంతో ఆహ్లాద కరం గా వుంటుంది. మరి ఈ బీచ్ తీరాలు కల ప్రసిద్ధ రోడ్లు ఏమేమి వున్నాయో పరిశీలిద్దాం.

ఇండియా లో కోస్తా తీర రోడ్లు

నేషనల్ హైవే 17 మరావంతే !

నేషనల్ హైవే 17 మరావంతే !

ఈ రహదారి మార్గం ఇండియా లో అత్యధిక సుందర దృశ్యాలు కలగి వుంది. కర్నాటక లోని మరావంటే ప్రదేశం కు సమీపం. ఈ రోడ్ కు ఒక పక్క బీచ్ మరోవైపు ఒక రివర్ వుంటాయి. ఇంతటి అద్భుత దృశ్యం కలది ఈ రోడ్డు మాత్రమే. మీ కారు కొద్దిగా స్పీడ్ తగ్గించి ప్రయాణంలోనే అద్భుత ఆనందాలు పొందవచ్చు.

ఈస్ట్ కోస్ట్ రోడ్

ఈస్ట్ కోస్ట్ రోడ్

ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటే ఇది రాష్ట్ర రహదారి 49 గా కలదు. ఈ రహదారి అద్భుతమైన కోస్తా మార్గం. ఈ రహదారి చెన్నై నుండి కడలూర్ వరకు కలదుల్. బంగాళాఖాతం తీరంలో ఈ మార్గం సుమారు 690 కి. మీ. ల దూరం కలదు. పర్యటనలో ఏ మూడ్ లో ఉన్నప్పటికీ ఈ మార్గ అందాలు మిమ్ములను కట్టి పడవేస్తాయి.

మేరైన్ డ్రైవ్, ముంబై

మేరైన్ డ్రైవ్, ముంబై

ముంబై లోని మేరైన్ డ్రైవ్ పొడవు సుమారు 4 కి. మీ. లు కోస్తా తీరం వెంబడి వుంటుంది. సి - షేప్ లో కల ఈ మార్గం అరబియా సముద్రంలో ఒక భాగం గా వుంటుంది. ఈ ప్రాంతం అంతా పర్యాటకులతో కళ కళ లాడుతూ బిజి గా వుంటుంది. ముంబై నగర వాసులకు ఇది ఒక విహార ప్రదేశం.

మేరైన్ డ్రైవ్, కోచి

మేరైన్ డ్రైవ్, కోచి

కోచి పట్టణంలో మేరైన్ డ్రైవ్ ఒక ప్రసిద్ధ ఆకర్షణ, కొచ్చి పట్టాన సందర్శనలో పర్యాటకులు ఈ ప్రాంతం తప్పక చూసి ఆనందిస్తారు. బ్యాక్ వాటర్స్ కు ఎదురుగా కల ఈ ప్రదేశం వాక్ వే గుండా డ్రైవింగ్ కు అనుమతించదు.

బీచ్ లైన్ విశాఖపట్నం

బీచ్ లైన్ విశాఖపట్నం

బంగాళా ఖాత తీరంలో కల పొడవైన ఈ రోడ్డు 40 కి. మీ. లు వుంటుంది. దీనిపై ప్రయాణిస్తూ వుంటే, అద్భుత ప్రకృతి దృశ్యాలు కనపడతాయి. ఈ రోడ్డు వైజాగ్ లేదా విశాఖపట్నం నుండి కైలాసగిరి కి తీసుకు వెళుతుంది.

న్యూ మేరైన్ డ్రైవ్, పూరి

న్యూ మేరైన్ డ్రైవ్, పూరి

పూరి , కోణార్క్ లను కలుపుతూ న్యూ మేరైన్ డ్రైవ్ కలదు. ఇది కొత్తగా ఏర్పడినది. బంగాళా ఖాతా తీరంలో కల ఈ రోడ్ ను సాధారణంగా కోణార్క్ మేరైన్ డ్రైవ్ అని పిలుస్తారు.

ఆకర్షణీయ కోస్తా తీర రోడ్లు !

ఆకర్షణీయ కోస్తా తీర రోడ్లు !

ఇండియా లో పాండిచేరి లో కల బీచ్ రోడ్ మీకు అద్భుత ప్రకృతి దృశ్యాలను అందించే తీర ప్రదేశాలలో ఒకటి. ఈ రోడ్ సుమారుగా 1.5 కి. మీ. ల దూరం వుంది. పాండిచేరి చేరిన పర్యాటకులు ఈ బీచ్ రోడ్ తప్పక ఆనందిస్తారు.

బీచ్ రోడ్, చెన్నై

బీచ్ రోడ్, చెన్నై

ఈ బీచ్ రోడ్ చెన్నై లో ప్రసిద్ధ బీచ్. మెరీనా బీచ్ కు దాని తీరంలో ప్రసిద్ధి చెందినా కామరాజార్ సలాయి కలదు. ఈ రోడ్డు మిమ్ములను సాన్తోం వరకు తీసుకు వెళుతుంది. ఈ కొద్దిపాటి జర్నీ లో మీరు ఎన్నో ప్రసిద్ధ బీచ్ లు చూడవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+