Search
  • Follow NativePlanet
Share
» »సాహసిక సైకిల్ పర్యటన - లాభాలు అనంతం !

సాహసిక సైకిల్ పర్యటన - లాభాలు అనంతం !

ఒక ప్రాంతం వివరంగా చూడాలంటే, సైకిల్ పై టూర్ చేయడం ఒక ఉత్తమ పద్ధతి. ఉదాహరణకు సౌత్ ఇండియా లోని ప్రదేశాలు తీసుకోండి. పడమటి భాగంలో అరేబియా సముద్రం వుంటుంది. దక్షిణంలో హిందూ మహా సముద్రం, తూర్పున బంగాళా ఖాతం వుంటాయి. ఈ తీర ప్రాంతాలు ఎన్నో సుందర దృశ్యాలు, వ్రుక్షజాలం, జంతుజాలం, అన్నిటినీ మించి ప్రాంతీయ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు మీకు అందిస్తాయి. ఇవన్నీ వివరంగా చూడాలంటే, ఒక మంచి గేర్లు కల సైకిల్ ఉత్తమ విహార సాధనం. ఒక్కసారి సైకిల్ ట్రావెల్ చేస్తే చాలు మీకు మరచిపోలేని అనుభవాలను అందిస్తుంది.

ఇండియాలోని నైరుతి దిశగా మలబార్ తీరంలో లక్షద్వీప్ సముద్రానికి పడమటి కనుమలకు మధ్య కల కేరళ రాష్ట్రం మీ సైకిల్ యాత్రను మొదలు పెట్టేందుకు, ఆనందించేందుకు మంచి ప్రదేశం. అతి ఎత్తైన పర్వత అడవులు, పచ్చటి వర్షాధారిత అడవులు, ప్రసిద్ధి చెందిన బ్యాక్ వాటర్స్ తో అనేక అందాలు కలిగి, గాడ్స్ ఓన్ కంట్రీ గా కీర్తించబడుతున్న కేరళ రాష్ట్రం సైకిల్ యాత్రకు సరైన ప్రదేశం. ఈ కారణంగానే చాలామంది టూర్ నిర్వాహకులు కేరళలో తమ సైకిల్ టూర్లు నిర్వహిస్తారు. ఇపుడు కేరళలోనే కాక, వీరు తమిళ్ నాడు రాష్ట్రం లోని కొన్ని భాగాలకు సైతం విస్తరించారు.

సైకిల్ పై మీరు పర్యటిస్తూ కేరళ లో చూడదగిన ప్రదేశాలు ఏవి ? ప్రధానంగా మున్నార్ లోని ప్రకృతి దృశ్యాలు, మీ స్లో సైక్లింగ్ లో చూసి ఆనందించవచ్చు. అందమైన టీ గార్డెన్ లు, పెరియార్ లోని వర్షాధారిత అడవులు మంచి ప్రదేశాలు. వాస్కోడ గామ కనిపెడుతూ దిగిన కోజికోడ్ పట్టణం, అక్కడ నుండి వారసత్వ ప్రదేశాలు గల బ్రిటిష్ కంటోన్మెంట్ పట్టణం అయిన తెల్లిచెర్రి. చాలా మంది సైకిల్ టూర్ ఆపరేటర్ లు ఎక్కువ దూరాలు అంటే రాష్ట్రాల మధ్య కూడా ప్రోత్సహిస్తారు. చెన్నై రాష్ట్రం లో సైకిల్ పై బయలు దేరి, కోచిన్ లేదా ఒకటి రెండు వారాలలో కవర్ చేయగల సమీప రాష్ట్రాలైనా సరే పర్యటించవచ్చు.

కాలిప్సో అడ్వెంచర్స్ మరియు సైకిల్ సౌత్ ఇండియా అనే రెండు సంస్థలు ఇండియాలో ప్రధానంగా ఈ సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నాయి. వీరు సైకిల్ పర్యాటకులకు కొన్ని మార్గాలను సూచిస్తారు. ఇవి ఎంతో సురక్షితమైనవిగా వుంటాయి. ఈ మార్గాలు, నేటి జి పి ఎస్ కంపూటర్ సిస్టం లలో కూడా ప్రతి బిమ్బిస్తున్నాయి. ఇక వాహనం విషయానికి వస్తే, నేటి ఆధునిక సైకిల్ లు ట్రెక్, జైంట్ , కేనన్ డేల్, మెరిడ ఎం బి టి ఎస్ వంటివి పర్యటనకు ఎంచుకోదగినవి.

ఈ సంస్థలు నిర్వహించే టూర్లు ఎలా ఉంటాయంటే ....

అటవీ మార్గాలు
ఒక పర్యటన ఎనిమిది రోజులు. ఈ సైకిల్ టూర్ మైసూరు లో మొదలై, తెల్లిచెర్రిలో ముగుస్తుంది. ఈ టూర్ లో మైసూరు పాలస్ లోని గోల్డెన్ రాయల్ ఎలిఫెంట్ త్రోన్ , గోడలపై రాతితో అద్భుత కళా సంపద కల ఎదక్కాల్ గుహలు, చూడవచ్చు. ఇక్కడ నుండి ప్రపంచ ప్రసిద్ధ జీవ వైవిధ్య 34 ప్రాంతాలలో ఒకటైన వయనాడ్ జిల్లా లోని పర్వత ప్రాంతాలు కూడా చూడవచ్చు.

టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాల తోటల విహారం
ఈ ఎనిమిది రోజుల సైకిల్ పర్యటన విభిన్న సంస్కృతుల నిలయం అయిన కోచి పట్టణంలో మొదలవుతుంది. ఈ పర్యటన అనేక, సుగంధ ద్రవ్యాలు, రబ్బర్, కొబ్బరి తోటల గుండా సాగి చివరకు తట్టేక్కాద్ చేరుతుంది. ఇక్కడ మీరు 275 రకాల మొక్కలు, జీవ జాతులు చూడవచ్చు. చివరకు ఈ సైకిల్ యాత్ర అల్లెప్పేయ్ లో ముగుస్తుంది. అల్లెప్పెలో మీరు విలాసవంతమైన రైస్ బోటు విహారం కేరళ బ్యాక్ వాటర్స్ వరకూ చేయవచ్చు. ఆయుర్వేద మసాజ్ లకు ప్రసిద్ధి చెందినా ప్రాంతాలు కోవలం కూడా చేరవచ్చు.

కార్దామం హిల్స్ ట్రిప్
ఈ కార్దామం హిల్స్ మరియు టీ ఎస్టేట్ ల ట్రిప్ సముద్ర మట్టానికి సుమారు అయిదు వేల అడుగుల ఎత్తున కల మున్నార్ లో నాలుగు రోజులుపాటి సాగుతుంది. సైకిల్ పర్యాటకులు ఈ ట్రిప్ లో టీ గార్డెన్ లు, కార్దామం ఎస్టేట్ లు, స్పైస్ గార్డెన్ లు, కొన్ని అడవి ప్రాంతాలు చూస్తూ అద్భుత వన్య జీవ సంపద కల పెరియార్ చేరవచ్చు. ఇక్కడ మీరు ఆసియాటిక్ ఏనుగులు, ఇండియన్ బైసన్ గ్రేట్ హార్న్ బిల్ వంటి జంతువులను చూడవచ్చు.

సైకిల్ ఎక్కు - దమ్ము పట్టు!

వారసత్వ ప్రదేశాల పర్యటన
ఈ సైకిల్ టూర్ లో మీరు తెల్లిచెర్రి లో మొదలై, కోజి కోడ్ ద్వారా పురాతన పోర్ట్ ముజిరిస్ చేరి అక్కడనుండి ప్రయాణించి చివరకు అల్లెప్పేయ్ చేరవచ్చు.

సహ్యాద్రి కొండల సవాల్
సహ్యాద్రి కొండల పై ఈ ట్రిప్ తొమ్మిది రోజులు సాగుతుంది. పడమటి కనుమల గుండా తట్టేక్కాద్ అడవులలో మొదలై, చివరకు కోచి వరకూ సాగుతుంది. ఈ టూర్ పూర్తిగా సాహసికులకు మాత్రమే. ఎన్నో ఎత్తు పల్లాలు, అనేక హెయిర్ పిన్ బెండ్ లు, వైల్డ్ లైఫ్ సంక్చురి లు ఈ టూర్ లో వుంటాయి. చినార్, వల్పరాయి, ప్రదేశాలు కవర్ చేస్తూ చివరకు మీ సైకిల్ జర్నీ కోచి పట్టణానికి చేరుకుంటుంది.

సాధారణంగా ఈ ట్రిప్ లలో కనీస పక్షం ఇద్దరుగా వుంటారు. కనుక ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ అన్ని టూర్లలో ఒక గైడ్, వెంట వాహనం, తాగు నీరు, చిరుతిండ్లు అందచేస్తారు. గెస్ట్ లకు లక్సరీ వసతులు హెరిటేజ్ విల్లలలో, రిసార్ట్ లలో, కెంపులు, తోటల బంగాళా లు, ట్రీ హౌస్ లు లేదా హోం స్టే లలో ఏర్పరుస్తారు.

ఉల్లాసమూ, ఉత్తేజమూ కలిగించే ట్రావెల్ ఆర్టికల్స్ అందిస్తున్న నేటివ్ ప్లానెట్ ... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని కధనాలు

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+