Search
  • Follow NativePlanet
Share
» »ముంబై నగర సందర్శన

ముంబై నగర సందర్శన

గొప్ప సినీ స్టార్ అయిపోదామానుకుంటున్నారా ? అలా అయితే ముంబై నగరం చేరండి. ఎన్నో అవకాశాలు. ఈ నగరం ప్రతి మూలలోను ఎన్నో అవకాశాలు కలిగి వుంది. రైల్వే స్టేషన్ నుండి స్థానిక చాట్ అమ్మకాలవరకూ ఎన్నో అవకాశాలు. ఇక్కడ కల ప్రతి ఒక్కరూ ముంబై నగర అభివృద్ధికి కృషిచేస్తూ తమ జీవనోపాధి సంపాదించుకునే వారే.

ఒక పర్యాట కుడిగా వెళితే, ఎన్నో నగర ఆకర్షణలు. బీచ్ లు, ఫిలిం సిటీ, పార్క్ లు లేదా నగరంలోని ఇతర ప్రదేశాలు. మరి ఇవన్నీ చూడాలన్నా లేక ముంబై లో కొద్ది రోజులు వుండి ఒక కెరీర్ సాధించాలన్నా ముంబై మెట్రో సరైన ప్రదేశం. అటువంటి ముంబై నగరంలో కల ప్రధాన ఆకర్షణలు చూడండి.

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

చత్రపతి శివాజీ టెర్మినస్
దీనిని గతంలో విక్టోరియ టెర్మినస్ అనే వారు. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు కలదు. ఇక్కడ కల చాలామంది ట్రైన్ లలో ప్రయాణిస్తారు. ఈ స్టేషన్ లో దూర ప్రయాణ రైళ్ళు మరియు స్థానిక రైళ్ళు కూడా వచ్చి చేరతాయి. నవంబర్, 2008 సంవత్సరం లో ఇది ఉగ్రవాద దాడులకు గురయింది.
Photo Courtesy: ramesh Iyanswamy

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

డబ్బావాలాస్
డబ్బావాలాస్ ప్రతి ఇండి వద్ద టిఫిన్ బాక్స్ లు సేకరించి ఆఫీస్ లలో సంబంధిత ఉద్యోగస్తులకు లంచ్ వేళకు అందిస్తారు. అత్యంత క్రమ శిక్షణతో నడుస్తున్న ఈ వ్యవస్థను కొన్ని విదేశీ విశ్వ విద్యాలాలుకూడా స్టడీ చేస్తున్నాయి.
Photo Courtesy: A y A n

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

గేటు వే అఫ్ ఇండియా
బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ నిర్మాణం ఎనిమిది అంతస్తులు కలిగి హార్బర్ సమీపంలో వుంటుంది. టూరిస్టులు తప్పక చూడదగిన ప్రదేశం.
Photo Courtesy: garbyal

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

హాజీ ఆలి దర్గా
హాజీ ఆలి దర్గా ముంబై లోని వర్లి లో కలదు. ఇది మసీదు మరియు దర్గా. ప్రతి శుక్రవారం ప్రార్ధనలతో బిజి గా వుంటుంది. విడి రోజులలో ఈ దర్గా ను విశ్రాంతిగా చూడవచ్చు.
Photo Courtesy: Soham Banerjee

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

ది తాజ్ మహల్ పాలస్ హోటల్
తాజ్ మహల్ పాలస్ హోటల్ ఒక కళా ఖండం. గేటు వే అఫ్ ఇండియా కు కొద్ది దూరం లో కల ఈ హోటల్ ముంబై కి ఒక మంచి గుర్తుగా వుంటుంది. 2008 సంవత్సరంలో ఈ హోటల్ కూడా ఉగ్రవాదుల దాడికి గురై బాగా నష్ట పోయింది. నేడు మరొమాఉ పునరుద్ధరించబడి కళకళ లాడుతూ కనపడుతుంది. ప్రసిద్ధ విదేశీ పర్యాటకులు సైతం ఈ హోటల్ వసతి ఎంపిక చేస్తారు.
Photo Courtesy: Ting Chen

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

హాంగింగ్ గార్డెన్స్
వీటినే ఫిరోజ్ షా మెహతా గార్డెన్స్ అని కూడా అంటారు ఇక్కడ కల బూట్ హౌస్ వద్ద విజిటర్ లు ఫోటో తీయిన్సుకోనటానికి ఆసక్తి చూపుతారు.

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

ధోభి ఘాట్
ఇది ప్రపంచ అతి పెద్ద ఓపెన్ ఎయిర్ లాండ్రీ. ఇక్కడ ముంబై లోని హాస్టళ్ళ మరియు ఆస్పత్రుల గుడ్డలు శుబ్రపరుస్తారు. ముంబైలో ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. దోబీలు ఇక్కడ నిలబడి గుడ్డలు ఉతకటం ఎంతో ఆకర్షణీయ విధానంగా వుంటుంది. Photo Courtesy: Jon Hurd

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

దారవి దారవి
ఇది ఒక స్లమ్ ప్రదేశం. ఆసియా ఖండంలోనే అతి పెద్దది. లోకల్ టూర్ నిర్వాహాకులు రూ.500 నుండి రూ.4000 వరకూ వివిధ చార్జీలతో ఈ స్లం ప్రదేశ పర్యటన చేయిస్తారు. ఇది ఒక మురికి వాడ మాత్రమే కాక, కొన్ని చిన్నపాటి పరిశ్రమలు సైతం కలిగి మురికి వాడ ప్రజలకు జీవనోపాధి చూపుతోంది. Photo Courtesy: markhillary

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

మెరైన్ డ్రైవ్
సౌత్ ముంబై కోస్ట్ లైన్ వెంట కల పొడవైన రోడ్ మెరైన్ డ్రైవ్ అంటారు. ఈ ప్రాంతం లో దొరికే స్ట్రీట్ ఫుడ్ లు తింటూ నడిస్తే ఆనందం. భెల్ పూరి, పాణి పూరి మొదలైనవి దొరుకుతాయి. దీనినే క్వీన్స్ నెక్లస్ అంటారు. సాయంత్రాలు లైటింగ్ తో కళకళ లాడిపోతూ వుంటుంది. Photo Courtesy: Leonora Enking

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

జుహు బీచ్
హుహు బీచ్ ముంబైలో తప్పక చూడదగిన ప్రదేశం. టూరిస్ట్ లే కాక, స్థానికులు కూడా ఇక్కడకు వచ్చి సాయంత్రాలు ఆనందిస్తారు. స్థానిక ఆహారాలు అయిన వడ పావ్, భెల్ పూరి, ఐస్ గూలాస్ వంటివి నోరూరే రుచులతో ప్రతి ఒక్కరిని ఆనంద పరుస్తాయి. అపుడపుడూ కొంతమంది బాలి వుడ్ స్టార్ లను కూడా ఇక్కడ చూడవచ్చు. Photo Courtesy: Gr8.philosopher

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

బ్యాండ్ స్టాండ్ ప్రోమనేడ్
ఈ ప్రదేశం ఉదయాలు జాగర్ ల ప్రదేశం గాను సాయంత్రం అయ్యే సరికి ప్రేమికుల ప్రదేశంగా మారిపోతుంది. ఈ ప్రదేశం నుండి సూర్యాస్తమయ అందాలు చూసి ఆనందించవచ్చు.

Photo Courtesy: Ishan Manjrekar

ఈ నగరం దేనికైనా రెడీ

ఈ నగరం దేనికైనా రెడీ

బాలి వుడ్ ముంబై
ముంబై బాలి వుడ్ పరిశ్రమ ఇండియా లోనే అతి పెద్దదైనది. సంవత్సరానికి సుమారు వంద సినిమాల తయారీ తో ఎంతో ప్రధాన పరిశ్రమగా ముంబై నగరంలో రూపు దిద్దుకొంది. ఫిలిం సిటీ లో కల సెట్టింగ్ లు తప్పక చూడాలి. పబ్లిక్ కు అనుమతించారు కాని మహారాష్ట్ర టూరిజం యొక్క గైడ్ టూర్ లు అనుమతిస్తారు.
Photo Courtesy: Eric The Fish

ముంబై ఇతర ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

ముంబై నగర హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+