Search
  • Follow NativePlanet
Share
» »వరల్డ్ మ్యూజిక్ డే : సంగీత ప్రియులకు ఒక రోజు !

వరల్డ్ మ్యూజిక్ డే : సంగీత ప్రియులకు ఒక రోజు !

By Mohammad

సంగీతం అంటే ఇష్టమా ? మీ ఫేవరేట్ ట్యూన్ ని వినాలని ఉందా ? అయితే, అందుకోసమై అటువంటి వారికి ప్రపంచంలో ఒక రోజు కేటాయించారు. ఆ రోజు చెవి కోసుకోనేదాకా మీకిష్టమైన సంగీతాన్ని వినవచ్చు. అదే 'అంతర్జాతీయ మ్యూజిక్ డే'.

పుట్టుక

'మ్యూజిక్ డే' మొదట ఫ్రాన్స్ లో ప్రారంభమైనది. దీనిని 1982 వ సంవత్సరం జూన్ 21 నుండి కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ రోజును 'మ్యూజిక్ డే లేదా అంతర్జాతీయ సంగీత దినోత్సవం' గా ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి.

భారత దేశం సంగీత దేశం. మనదేశంలో సంగీతం రాజుల కాలం నుండి ఉన్నది. ఇండియాలో శాస్తీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. దీనితో పాటు పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్ మరియు వెస్ట్రన్ మ్యూజిక్ లను నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో సందేశం లేదు.

మనదేశంలో కూడా కొన్ని అదరగొట్టే సంగీత కచేరీలు మ్యూజిక్ డే రోజున ప్రదర్శిస్తుంటారు. మీరు గనక ఈ ప్రదేశాల్లో ఉన్నట్లయితే తప్పక మ్యూజిక్ ను ఆస్వాదించండి.

షిల్లాంగ్, మేఘాలయ

షిల్లాంగ్, మేఘాలయ

షిల్లాంగ్ లో మ్యూజిక్ వేడుకలు

డైలాన్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించే మ్యూజిక్ వేడుకలు సంగీత ప్రియులను అలరిస్తాయి. అందరూ కలిసి సమకాలీకరించి ఒకే ట్యూన్ లో గిటార్ ను వాయించడంలో షిల్లాంగ్ ప్రపంచ రికార్డ్ నెలకోల్పింది.

అలరించే మ్యూజిక్ : బ్లూస్, జాజ్, క్లాసిక్ రాక్

చిత్ర కృప : Edit Web

గోవా

గోవా

గోవా ఎందుకు సందర్శించాలి

సన్ బర్న్ ఫెస్టివల్, సూపర్సోనిక్ ఫెస్టివల్, గిగ్స్ అనే సంగీత ప్రదర్శనలు గోవా లోని కేఫ్ లలో, పబ్ లలో సంవత్సరం పొడవునా జరుగుతుంటాయి.

అలరించే మ్యూజిక్ : ట్రాన్స్, ఎలక్ట్రోనికా

చిత్ర కృప : spiritzone

బెంగళూరు, కర్నాటక

బెంగళూరు, కర్నాటక

బెంగళూరులో మ్యూజిక్ వేడుకలు

ఎన్ హెచ్ సెవన్ వీకెండర్ ఫెస్టివల్ , స్ట్రోం ఫెస్టివల్, ఫైర్ ఫ్లైస్ ఫెస్టివల్ మొదలైన మ్యూజిక్ షోలు బెంగళూరులోని పబ్ లలో, కేఫ్ లలో లైవ్ గా జరుపుతారు.

అలరించే మ్యూజిక్ : రాక్ , మెటల్, హెవీ మెటల్, బ్లూస్

చిత్ర కృప : Jayesh Lal

జోధ్పూర్, రాజస్థాన్

జోధ్పూర్, రాజస్థాన్

జోధ్పూర్ మ్యూజిక్ వేడుకలు

రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫోల్క్ ఫెస్టివల్ (జానపద పండగ) ను జోధ్పూర్ లోని అందమైన మెహ్రంగర్హ్ కోట లో నిర్వహిస్తారు. డాన్స్, సంగీత ప్రదర్శనలు సంగీత ప్రియులను అలరిస్తాయి.

అలరించే మ్యూజిక్ : జానపద సంగీతం

చిత్ర కృప : Sophie Clemencon

పూణే, మహారాష్ట్ర

పూణే, మహారాష్ట్ర

పూణే మ్యూజిక్ వేడుకలు

సవాయ్ గంధర్వ భీమ్ సేన్ మహోత్సవ్ (ప్రపంచంలోనే అతి పెద్ద ఇండియన్ క్లాసిక్ ఫెస్టివల్) పేరుతో నిర్వహించే మ్యూజిక్, పూణే ప్రజలను ఆకట్టుకుంటుంది.

అలరించే మ్యూజిక్ : రాక్ , పాప్, ఎలక్ట్రానిక్, డాన్సు, గ్లోబల్, క్లాసిక్

చిత్ర కృప : vijay kate

ఢిల్లీ

ఢిల్లీ

ఢిల్లీ మ్యూజిక్ వేడుకలు

సన్ బర్న్ ఫెస్టివల్, పబ్ లలో మరియు కేఫ్ లలో నిర్వహించే మ్యూజిక్ షో లు, విరసాట్ ఫెస్టివల్ , పురాణ ఖిలా ఫెస్టివల్ , కుతుబ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ మరియు కాలేజ్ లలో నిర్వహించే మ్యూజిక్ ప్రదర్శనలు

అలరించే మ్యూజిక్ : పాప్, రాక్, మెటల్, ఎలక్ట్రానిక్స్, డాన్సు, జానపద సంగీతం

చిత్ర కృప : Andrea C. Briceno

ముంబై , మహారాష్ట్ర

ముంబై , మహారాష్ట్ర

ముంబై మ్యూజిక్ వేడుకలు

మూడ్ ఇండిగో ఫెస్టివల్, మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్, ఇండిపెండెన్స్ రాక్, కాల ఘోడ ఫెస్టివల్, పబ్ లలో మరియు కేఫ్ లలో అలరించే బ్లూ ఫ్రాగ్, హార్డ్ రాక్ కేఫ్ మరియు కాలేజ్ లలో నిర్వహించే మ్యూజిక్ ఫెస్టివల్

అలరించే మ్యూజిక్ : బ్లూస్, రాక్, మెటల్, ఎలక్ట్రానిక్స్, డాన్సు, గ్లోబల్ , డాన్సు, క్లాసిక్

చిత్ర కృప : Rutger Geerling

గ్వాలియర్

గ్వాలియర్

ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తాన్ సేన్ పేరుతో గ్వాలియర్ లో మ్యూజిక్ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుండి వచ్చే సంగీత విద్వాంసులు తాన్ సేన్ సమాధి స్థలం వద్ద జరిగే సంగీత కచేరిలో పాల్గొంటారు. కనుక శాస్త్రీయ సంగీత ప్రియులు ఈ షో లో తప్పక పాల్గొనండి.

అలరించే మ్యూజిక్ : సంప్రదాయ సంగీతం, జానపద సంగీతం

చిత్ర కృప : Stefan H

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+