జూన్ మాసంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఇక, ఇలాంటి సమయంలో చాలామంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. అలాంటివారికోసం భారత్‌లో సంద్శరించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఉత్తరప్రదేశ్. భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ఒకటి. ఇది ఎంతో అందమైన రాష్ట్రం కూడా. జనాభా పరంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కూడా ఇదే. ఉత్తరప్రదేశ్‌ను హిల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. ఉత్తరప్రదేశ్ అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశీయ, విదేశీ పర్యాటకులు నిత్యం ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. రాజధాని లక్నో నుంచి అయోధ్య, కాశీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్ వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలేన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రదేశం మాన్‌సూన్‌లో వీక్షించే ప్రాంతం. అదేంటో చూసేద్దామా..?
వర్షాకాలంలో ఉత్తరప్రదేశ్‌ను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాను తప్పక వీక్షించాల్సిందే. ఇటావా సందర్శన అద్భుతమైన మనోహరమైన ప్రయాణం అని చెప్పుకోవాలి. ఈ ప్రదేశంలో సందర్శించేందుకు ఎటావా సఫారీ పార్క్ పేరు జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. దాదాపు 8 కిలోమీటర్ల పరిధిలో ఇటావాలో ఉన్న ఈ సఫారీ పార్క్ ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత అందమైన పార్కులలో ఒకటిగా చెప్పొచ్చు. ఇటావాలో ఉన్న ఈ సఫారీ పార్క్ వన్యప్రాణి సఫారీ పార్క్. ఇక్కడికి వస్తే వైల్డ్ సఫారీని ఆస్వాదించవచ్చు. వర్షాకాలంలో ఈ సఫారీ పార్క్ అందాలు చూడదగినవని. అందువల్ల వర్షాకాలంలో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

కోటలు..ప్యాలెస్‌లు..
ఇక్కడ అనేక కోటలు ప్యాలెస్‌లు కూడా ఉన్నాయి. ఇటావాలో ఉన్న రాజా సుమేర్ సింగ్ కోట కూడా ఇదే రకమైన కోట. రాజా సుమేర్ సింగ్ కోట ఇటావాలోని అత్యంత మహిమాన్వితమైన కోట. ఇది రాష్ట్ర చారిత్రక వారసత్వంగా పరిగణించబడుతుంది. ఈ కోట అందాలు, పెయింటింగ్స్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. యమునా నది ఒడ్డున ఉన్న ఈ కోట అందం వర్షాకాలంలో మరింత శోభను సంతరించుకుంటుంది.

ఉత్తమ పర్యాటక ప్రదేశం..
ఇటావాలో ఉన్న యమునా చంబల్ సంగమం ఎంతో ప్రత్యేకమైనది. ఇటావాను సందర్శించినప్పడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని వీక్షించాల్సిందే. ఈ ప్రదేశం అందం, రాముఖ్యత ఎంతో పేరుగాంచింది. ప్రతి నెలా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. యమునా చంబల్ సంగం ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడి ప్రకృతి అందాలు ప్రకృతి ప్రేమికులకు ఎంతో మంచి అనుభూతిని కలిగిస్తాయి. వర్షాకాలంలో ఈ ప్రదేశం పచ్చదనంతో నిండి ఉంటుంది. ప్రశాంతతను కోరుకునేవారు కూడా ఇక్కడికి రావొచ్చు.

ఇటావా కంపెనీ..
ఇటావా కంపెనీ గార్డెన్ స్థానిక ప్రజలకే కాకుండా పర్యాటకులకు కూడా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా నిలిచింది. ఈ అందమైన ఉద్యానవనం బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఈ కంపెనీ గార్డెన్‌లో డజనుకు పైగా రకాల చెట్లు మరియు మొక్కలను, వెయ్యికి పైగా రకాల పువ్వులను చూడొఒచ్చు. వర్షాకాలంలో ఈ చెట్లు మరియు మొక్కలు మరింత అందంగా మారుతాయి. ఇది పర్యాటకులు చూడదగ్గ ప్రదేశం. ఈ పార్కులో అద్భుతమైన లైటింగ్ ఫౌంటెన్ కూడా ఉంటుంది. ఇటావాకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వాహనం, బస్సు ద్వారా కూడా వెళ్లొచ్చు. బస్సు ప్రయాణమయితే సుమారు 2 నుండి 2.5 గంటల్లో అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. మరెందుకాలస్యం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి..



Click it and Unblock the Notifications












