Search
  • Follow NativePlanet
Share
» »మైసూరు దసరా - పండుగ ఒకటే...ఆనందాలు అనేకం!

మైసూరు దసరా - పండుగ ఒకటే...ఆనందాలు అనేకం!

దసరా పండుగ ఎంతో వేడుక. అందులోనూ మైసూరులో దసరా పండుగ అంటే మరింత ఆనందంగా వుంటుంది. ఆ పది రోజులా ఒక స్వప్నంలా సాగిపోతుంది. ఈ పండుగను చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకుంటారు. వైభవోపేత ఊరేగింపులు, మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, అనేక కచేరీలు, రాచ ఠీవి కల ఏనుగుల ఊరేగింపులు, నాట్యం చేసే బొమ్మలు, దీపాలతో మిల మిల మెరిసే భవనాలు, తాజా పూవులు, అన్నిటినీ మించి నోటి రుచులూరే మైసూరు పాక్ వంటి స్వీట్లు, ఇతర ఆహారాలు వంటివి ఎన్నో ఆనందించవచ్చు. బహుశ, మైసూరు దసరా అంటే చాలు, మీ ఇంట్లో పిల్లలు ఈ రకమైన కలలు కనటం మొదలు పెట్టేస్తారు. సమీపంలో కల మండ్య నగరం లేదా దూరాన కల ముంబై నగరం లేదా విదేశాల నుండి కూడా ప్రజలు ఈ మైసూరు దసరా పండుగ వేడుకలకు వచ్చి తనివి తీరా ఆనందిస్తారు. ఈ సాంప్రదాయక మైసూరు దసరా సుమారుగా 15 వ శతాబ్దం లోనే మొదలైంది. కర్ణాటక రాష్ట్ర పండుగ గా కొనసాగుతోంది. దీనినే నవరాత్రి అని కూడా అంటారు. ఈ పండుగ తొమ్మిది రోజులకు ఒక్కొక్క రోజుకు ఒకొక్క పేరు కలదు.


చివరి రోజైన పదవ రోజును విజయదశమి అంటారు. ఈ విజయదశమి రోజునే ఘనమైన ఏనుగు అమ్బారీల ఊరేగింపు జరుగుతుంది. మాత చాముండేశ్వరి దేవి విగ్రహాన్ని ఒక బంగారు మంటపంలో వుంచి ఏనుగుపై నగర వీధుల గుండా ఊరేగిస్తారు. సాంప్రదాయం మేరకు మైసూరు రాజ కుటుంబం ఈ ఊరేగింపు ముగింపును నిర్వహిస్తుంది. ఈ విజయదశమి రోజేనే మాత చాముండేశ్వరి దేవి వృషభ తల కల రాక్షసుడు మహిశాసురిడిని వదిన్చిందని చెపుతారు.
ఇక అప్పటి నుండి ఈ దేవత మైసూరు పట్టణాన్ని రక్షిస్తోందని నమ్ముతారు. అదే నమ్మికతో మైసూరు ఒడయార్ రాజవంశీకులు ఆ మాత చాముండేశ్వరి పై భక్తి శ్రద్ధలతో ఈ దసరా ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. సాంప్రదాయక రీతిలో నేటికీ మైసూరు రాజ వంశీకులు ఒక బంగారు సింహాసనం పై కొలువు దీరి దర్బార్ అనే ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. నిజానికి మైసూరు దసరా మనం ఊహించిన దాని కంటే కూడా ఎంతో బాగుంటుంది. మైసూరు దసరా కధలుగా చెపితే పిల్లలు నిద్ర కూడా పోకుండా ఆసక్తి గా వింటూనే వుంటారు. దసరా వేడుకలను కర్నాటక ప్రభుత్వం ఎప్పటి కపుడు మరింత వైభవోపేతం చేస్తోంది. గత వైభవాలను పునరుద్ధరించేందుకు నడుం కడుతోంది. ఉత్సవాలలో జానపద నృత్యాలు, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక బొమ్మల కొలువులు ఈ పండుగ ప్రత్యేకత. పారిశ్రామిక ప్రదర్శన మరో ప్రత్యేకత. మైసూరు పాలస్ ను పది వేల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ రకమైన వేడుకలు ప్రతి సంవత్సరం మించి పోతున్నాయి. మైసూరు దసరా వేడుకలు చూసేందుకు వచ్చే సందర్శకులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రముఖులకు రూ. 7,000 ఖరీదు కల గోల్డ్ కార్డ్ లను జారీ చేసి వేడుకలు ఆనందించేలా చేస్తున్నారు. ఈ కార్డ్ పొందిన వారు నగరం లోని అనేక పర్యాటక ఆకర్షనలను పది రోజుల పాటు ఉచితంగా చూసి ఆనందించవచ్చు కూడాను.
మైసూరు దసరా - పండుగ ఒకటే...ఆనందాలు అనేకం!
మైసూరు ఎలా చేరాలి ?
మైసూరు కు రోడ్డు, రైలు మార్గాలు కలవు. బెంగుళూరు - మైసూర్ రోడ్ చక్కని నిర్వహణ కలిగి వుంది. బెంగుళూరు లేదా, ఇండియా లోని వివిధ ప్రాంతాల నుండి మైసూరు కు తరచుగా రైళ్ళు కలవు. మైసూరు కు సమీప విమానాశ్రయం 185 కి. మీ. ల దూరంలో కల బెంగుళూరు లో కలదు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లలో నేరుగా మైసూరు చేరవచ్చు. ఇదే ప్రయాణంలో పర్యాటకులు మార్గం లో కల సిల్క్ సిటీ రామనగర చూడవచ్చు. ఇక్కడ తయారయ్యే విలువైన పట్టు చీరలు కొనుగోలు చేయవచ్చు. మైసూరు లో మీరు కొనాలనుకునే మైసూరు పట్టు వస్త్రాలు అక్కడకు రామనగరం నుండే సరఫరా అవుతాయి. రామ నగరం అందమైన కొండ ప్రాంతాలకు ప్రసిద్ధి. సాహస పర్యాటకులు ఈ కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. ప్రసిద్ధ షోలే హిందీ సినిమా షూటింగ్ ఇక్కడి కొండలపై షూట్ చేయబడింది.

రామ నగరం దాటిన తర్వాత వచ్చే చన్నపట్న టవున్ చెక్క బొమ్మలకు ప్రసిద్ధి. ఇక్కడ మీ పిల్లలకు ఇష్టమైన చెక్క బొమ్మలు ఇతర హస్త కళల అలంకరణ వస్తువులను కొనుగోలు చేసి ఆనందించవచ్చు.

చన్నపట్న తర్వాత వచ్చే ఊరు ...మద్దూర్ . మద్దూర్ లో తినేందుకు రుచికరమైన వడలు ప్రసిద్ధి. తిని ఆనందించండి. మద్దూర్ వడలు తింటూ ఆనందంగా ముందుకు సాగితే, మీకు ఎడమవైపుగా కావేరి నది తీరం కల చారిత్రాత్మక శ్రీ రంగ పట్నం టెంపుల్ కనపడుతుంది. ఇక్కడ కల శ్రీ రంగనాథ స్వామీ టెంపుల్ ను గంగ వంశ పాలకులు సుమారు 9 వ శతాబ్దంలో నిర్మించారు. శ్రీ రంగ పట్నం నుండి 19 కి. మీ. ల దూరం ప్రయాణిస్తే చాలు, మీరు కలలు కనే వైభవోపేత దసరా వేడుకల పట్టణం మైసూరు వచేస్తుంది.

More News

    Read more about: mysore dasara festival
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+