Search
  • Follow NativePlanet
Share
» » ఇండియా లోని ఈశాన్య భాగంలో పర్యాటక ప్రదేశాలు !

ఇండియా లోని ఈశాన్య భాగంలో పర్యాటక ప్రదేశాలు !

ఎంత నిరంతరం పర్యటన చేసే వారు అయినప్పటికీ, ఇండియా లోని ఈశాన్య ప్రాంతాల పర్యాటక ప్రదేశాలకు త్వరగా వెళ్లారు. ఇండియా లోని ఈశాన్య ప్రాంతంలో కూడా అనేక ప్రసిద్ధ ఆకర్షణలు కలవు. ఈ ప్రాంతంలో ప్రపంచం లోని అతి పెద్ద డ్రై ఫిష్ మార్కెట్ కలదు. అతి చిన్న, మరియు అతి పెద్ద నదీ ద్వీపాలు కూడా ఇక్కడ కలవు.

ప్రపంచంలో దీర్ఘ కాలం రాజ్యం పాలించిన రాజ వంశం ఇక్కడే కలదు. ప్రసిద్ధి చెందిన ఇంటర్నెట్ బ్రౌసర్ ఫైర్ ఫాక్స్ ఇక్కడ కలదు. సౌత్ ఈస్ట్ ఆసియ లో అతి శుభ్రమైన గ్రామం ఇక్కడ కలదు. ఈ అంశాలన్నీ కల ఈఅశాన్య ప్రాంతం తప్పక టూరిజం మ్యాప్ లో ప్రమోట్ చేసి ఆ ప్రాంత సాంస్కృతిక, ఆర్ధిక అభివృద్ధి లకు పాటు పడాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇక్కడ కల పర్యాటక ప్రదేశాలు ఈ ప్రాంతంలో బెస్ట్ అని చెప్పవచ్చు.

కాజి రంగా

కాజి రంగా

కాజి రంగా ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడ ఒకే కోమ్ము కల దుప్పులు ప్రసిద్ధి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనపడవు. నార్త్ ఈస్ట్ లో ఈ ప్రదేశం తప్పక చూడదగినది.

Pic Credit: Wiki Commons

శివసాగర్

శివసాగర్

శివసాగర్ బలవంతులైన అహోం రాజుల రాజధాని. వీరు నిరంతరాయంగా 600 సంవత్సరాలు ఇక్కడ పాలించారు. భవిష్యత్ లో ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగలదు.

Pic credit: Wiki Commons

బిహు

బిహు

బిహు అనేది ప్రదేశం కాదు. ఇది అస్సాం లో ఒక హార్వెస్ట్ పండుగ. దీనిని స్టేట్ ఫెస్టివల్ గ గుర్తించారు. బిహు సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది. కాని ఏప్రిల్ లో వచ్చే బిహు ను ప్రధాన పండుగ గా భావిస్తారు.

Pic Credit: Wiki Commons

మజూలి

మజూలి

మజూలి ఒక రివర్ ఐలాండ్. ఇది ప్రపంచ అతి పెద్ద ద్వీపాలలో ఒకటి

Pic Credit: Wiki Commons

మజూలి

మజూలి

మజూలి ఒక ద్వీపం. ఇక్కడకు అక్టోబర్ నెలలో జరిగే రాదా కృష్ణుల రాస లీల ఉత్సవం చూసేందుకు వందలాది పర్యాటకులు వస్తారు.

Pic Credit: Wiki Commons

మనాస్

మనాస్

ఈ వైల్డ్ లైఫ్ సాన్క్చురి లో మీరు కనపడితే ఒక టైగర్ చూడవచ్చు. లేదా ఇక్కడ కల ఎకో టూరిజం లాడ్జ్ లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ప్రాంతం భూటాన్ బోర్డర్ లో కలదు.

Pic Credit: Shutterstock

ఉల్టా పాణి

ఉల్టా పాణి

ఇండియా లో కల అనేక బటర్ ఫ్లై జాతులలో 75% ఈశాన్య ప్రాంతంలో కలవు. మానస్ రిజర్వు ప్రాంతంలో కల ఉల్టా పాణి లో 300 పైగా బటర్ ఫ్లై జాతులు చూడవచ్చు.

Pic Credit: Nagesh Kamath

దిబ్రు సైకోవా

దిబ్రు సైకోవా

ఈ ప్రాంతం ప్రపంచంలోని 34 జీవ వైవిధ్యం కల ప్రాంతాలలో ఒకటి. దిబ్రు - సైఖోవా మీకు అచ్చమైన అటవీ అనుభవాలను ఇస్తుంది. నేడు అంతరించిపోతున్న జంతువులు ఫెరాల్ గుర్రాలు, హూ లాక్ గిబ్బంస్ వంటివి ఇక్కడ చూడవచ్చు.

Pic credit: itsmynortheast.com

కామాఖ్య

కామాఖ్య

ఇండియా లో ఇది ఒక ప్రసిద్ధ శక్తి పీట టెంపుల్స్ లో ఒకటి. ఈ దేవత ఒక తాంత్రిక శక్తి. ఈ ప్రదేశం హిందూ యాత్రికులకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ జరిగే అమ్బుబాచి మేళ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

Wiki Commons

సూలకూచి

సూలకూచి

సూలకూచి ఒక ప్రసిద్ధ నేతపని వారి టవున్. ఇక్కడ అస్సాం సిల్క్, ఏరి మరియు మూగా బట్టలు తయారవుతాయి. నేత పని వారిని వారి పనిలో చూసేందుకు ఈ టవున్ సందర్శన మంచి అవకాశం కల్పిస్తుంది.

Pic Credit: rajkumar1220

బ్రహ్మపుత్ర రివర్ విహారం

బ్రహ్మపుత్ర రివర్ విహారం

సాధారణ పర్యాటక ప్రదేశాలు చూసిన తర్వాత, బ్రహ్మపుత్ర నది పై బోటు లో విహరించి అస్సాం అందాలు మరో కోణంలో చూడండి.
Pic Credit: http://www.assambengalnavigation.com

లివింగ్ రూట్ బ్రిడ్జి లు

లివింగ్ రూట్ బ్రిడ్జి లు

మేఘాలయ రబ్బర్ చెట్లు కు ప్రసిద్ధి. ఈ చెట్ల వెళ్ళు పది నుండి పది హేను సంవత్సరాలు పెరిగితే బలపడి అవి ఒక బ్రిడ్జి గా రూపొందుతాయి. ఈ సహజ బ్రిడ్జి లను చూసేందుకు ప్రపంచం లోని అనేక ప్రాంతాలనుండి పర్యాటకులు వస్తారు.

షిల్లాంగ్

షిల్లాంగ్

స్కాట్ లాండ్ అఫ్ ది ఈస్ట్ గా చెప్పబడే షిల్లాంగ్ కు వెళ్లి అక్కడి సీనరీ లు ఆనందించండి. సిటీ లో అనేక టూరిస్ట్ ప్లేస్ లు కలవు.

Pic Credit: Vikramjit Kakati

కేవ్స్

కేవ్స్

ఇండియా లో పొడవైన గుహలు, మేఘాలయ లోని జైంతియా హిల్స్ లో కలవు. మావా స్మాయి గుహలు తప్పక చూడదగినవి.

Pic Credit: Rajkamal Sarma
మవసిన రాం క్రౌన్

మవసిన రాం క్రౌన్

ఈ ప్రదేశం ఒక పూర్తి చిత్తడి ప్రదేశం. ఇది చిరపుంజి కి 15 కి. మీ. ల దూరంలో కలదు.

ఫోటో క్రెడిట్ : Wiki Commons

ఎలిఫెంట్ ఫాల్స్

ఎలిఫెంట్ ఫాల్స్

ఎలిఫెంట్ ఫాల్స్ షిల్లాంగ్ సమీపంలో కలవు. జలపాతాల మొదలు వరకు నడచుకు వెళ్లి నీరు పడే దృశ్యం ఆనందించవచ్చు.

Pic Credit: Wiki Commons

నోహ కలికాయ్ జలపాతాలు

నోహ కలికాయ్ జలపాతాలు

చిరపుంజి సమీపంలో కల ఈ జలపాతాలు సుమారు 1100 అడుగుల ఎత్తునుండి పడి ఇండియా లో అతి పొడవైనవిగా పేరు గాంచాయి.

మావ్ లీనంగ్

మావ్ లీనంగ్

సౌత్ ఆసియ లోనే ఇది ఒక అతి శుభ్రమైన గ్రామం. ఈ గ్రామంలో ప్రకృతి ఒడిలో మంచి విశ్రాంతి లభిస్తుంది.

Pic Credit: ashwinkumar

ఉమియం లేక్

ఉమియం లేక్

ఉమియం లేక్ ను బారా పాణి అని కూడా అంటారు. ఈ లేక్ మీరు షిల్లాంగ్ ప్రవేశంలో కొండలమధ్య పైన చెట్ల మధ్య చూడవచ్చు. పిక్నిక్, ఫిషింగ్ , వాటర్ స్పోర్ట్స్ కు ఇది ఒక మంచి ప్రదేశం.

డావ్ కి

డావ్ కి

ఈ గ్రామం ఇండియా - బంగ్లాదేశ్ లకు సరిహద్దు గ్రామం. గతంలో మీరు సరిహద్దు గ్రామం చూడకపోతే, ఇపుడు చూడండి. Pic Credit: tharaq

చాప్ చార్ కూట్

చాప్ చార్ కూట్

దీనిని ప్రదేశం అనే కంటే ఒక ఫెస్టివల్ అని చెప్పాలి. ఇది మిజో జాతి ప్రజల హార్వెస్ట్ ఫెస్టివల్. ఇది ప్రతి సంవత్సరం మార్చ్ లో వస్తుంది. సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తారు.

Pic Credit: itsmynortheast

తవాంగ్ మొనాస్టరీ

తవాంగ్ మొనాస్టరీ

ఈ మొనాస్టరీ ఇండియాలో అతి పెద్ద మొనాస్టరీ. దీనికి గల లైబ్రరీ లో అతి పురాతన, విలువైన గ్రంధాలు కలవు.

Pic Credit: Wiki Commons
T

జస్వంత్ ఘర్

జస్వంత్ ఘర్

అరుణాచల్ ప్రదేశ్ లోని ఈ భవనం ఒక ఇండియన్ సోల్జర్ పేరు కలిగి వుంది. జస్వంత్ సింగ్ రావట్ అనే ఈ సైనికుడు ఇండియా, చైనా యుద్ధం 1962 లో మరణించాడు. నేటికీ జస్వంత్ సింగ్ ఆత్మ ఈ ఇండో చైనా బోర్డర్ ను కావలి కాస్తుందని చెపుతారు.

Pic Credit: itsmynortheast

నమ్దాపా నేషనల్ పార్క్

నమ్దాపా నేషనల్ పార్క్

జీవ వైవిధ్యంలో ఈ పార్క్ ప్రసిద్ధి గాంచినది. ఈ నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్ లో కలదు.

Pic Credit: travelling slacker

రూమ్ టెక్ మొనాస్టరీ

రూమ్ టెక్ మొనాస్టరీ

ఈ మొనాస్టరీ సిక్కిం లో అతి పెద్ద మొనాస్టరీ. చాలా అందంగా వుండి పర్యాటకులను విశేష రీతిలో ఆకర్షిస్తుంది.

Pic Credit: Wiki Commons

తీస్తా రివర్

తీస్తా రివర్

సిక్కిం రాష్ట్రంలో రివర్ రాఫ్టింగ్ కు ఈ నది పేరు గాంచినది. ఈ నదిలో రాఫ్టింగ్ ను వైట్ వాటర్ రాఫ్టింగ్ అంటారు.

Pi Credit: Wiki Commons

నాతు లా పాస్

నాతు లా పాస్

ప్రపంచంలో అత్యధిక ఎత్తు లో కల వాహన రోడ్డు ఇది. ఈ మార్గం భారత పౌరులకు వారంలో కొద్ది రోజులు ఓపెన్ గా వుంటుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ బోర్డర్. చైనా సైనికులను ఇక్కడ నుండి చూడవచ్చు.

Pic Credit: Wiki Commons

యుక్సోం అండ్ జొన్గ్రి

యుక్సోం అండ్ జొన్గ్రి

సిక్కిం ట్రెక్కింగ్ కు ఒక స్వర్గం సిక్కిం లో ఈ మార్గం ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గం.

Pic Credit: Wiki Commons

యాక్ సఫారి

యాక్ సఫారి

పర్యావరణ స్నేహ పూరితంగా ట్రావెల్ చేయండి. యాక్ జంతువు పై సఫారి చేయండి.

Pic Credit: Rajkamal Sarma

గురు దొంగ్మార్ లేక్

గురు దొంగ్మార్ లేక్

చైనా బోర్డర్ పక్కనే కల ఈ సరస్సు ప్రపంచంలోనే అత్యధిక ఎత్తు కల సరస్సులలో ఒకటి.

Pic Credit: Wiki Commons

లోక్ తక లేక్

లోక్ తక లేక్

లోక్ తక లేక్ మణిపూర్ దిగువ కొండలలో కలదు. ఇక్కడ మీరు ఈశాన్య భారత దేశ అతి పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ చూడవచ్చు. ప్రపంచ అతి పెద్ద ఫ్లోటింగ్ పార్క్, కీబుల్ లామాజావో నేషన్ పార్క్ ఇక్కడ కలదు. అరుదైన సంగాయి జింకలను కూడా ఇక్కడ చూడవచ్చు.

Pic Credit: Wiki Commons

ఉనకోటి

ఉనకోటి

ఈ ప్రదేశంలో కల రాళ్ళపై అతి పెద్ద చిత్రాలు శివుడి వి చెక్కారు. నేటికీ వీటిని ఎవరు చేక్కారో అంతుపట్టదు. ఈ ప్రాంతం త్రిపుర ఉత్తర భాగంలో కలదు. ఈ చెక్కిన చిత్రాలు సుమారు వేయి సంవత్సరాల పురాతనమైనవిగా భావిస్తారు.

Pic Credit: Wiki Commons

నీర్ మహల్

నీర్ మహల్

ఖాళీగా కల ఈ పాలస్ సందర్శించండి. ఒకపుడు ఇది త్రిపుర రాజుల జీవన శైలి చూపేది. ఇండియా లో కల రెండు నీటి మహాల్స్ లోను జల మహల్ తర్వాత ఈ నీర్ మహల్ పేరు గాంచినది.

ఉజ్జయంత పాలస్

ఉజ్జయంత పాలస్

ఈ మాజీ రాయల్ పాలస్ అగర్తల లో కలదు. ఇది ఇపుడు ఒక మ్యూజియం. Pic Credit: Wiki Commons

హార్న్ బిల్ ఫెస్టివల్

హార్న్ బిల్ ఫెస్టివల్

ఈ ఫెస్టివల్ కు ఈ పేరు నా గా జాతిలో ప్రసిద్ధమైన ఒక హార్న్ బిల్ అనే పక్షి వలన వచ్చినది. ఈ హార్న్ బిల్ ఫెస్టివల్ ను నాగాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తారు. ఈ పండుగ వేడుకలలో వారి సాంప్రదాయ సంస్కృతులు గోచరిస్తాయి.

Pic Credit: Suraaj Ajithakumar

కిసామా విలేజ్

కిసామా విలేజ్

ఇది ఒక మోడల్ విలేజ్. నాగ కల్చర్ చూపుతుంది. వారి జాతి జీవిన విధానాలు ఇక్కడ గోచరిస్తాయి. ఈ ప్రదేశంలోనే హార్న్ బిల్ ఫెస్టివల్ కూడా అతి వైభవంగా నిర్వహిస్తారు.

Pic Credit: Suraaj Ajithakumar

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+