Search
  • Follow NativePlanet
Share
» »భ‌క్తుల‌కు గ‌మ‌నిక : శ‌బ‌రిమ‌లకు ప్ర‌త్యేక ట్రైన్ల‌ను ప్ర‌క‌టించిన రైల్వేశాఖ‌...

భ‌క్తుల‌కు గ‌మ‌నిక : శ‌బ‌రిమ‌లకు ప్ర‌త్యేక ట్రైన్ల‌ను ప్ర‌క‌టించిన రైల్వేశాఖ‌...

దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది కేరళలోని శబరిమల అయ్యప్ప ఆల‌యం. ఇక్క‌డ ప్ర‌తి ఏటా శీతాకాలంలో అయ్యప్ప దర్శనాలు రెండు నెలల పాటు జ‌రుగుతాయి. ఈసారి కూడా ఈ ఆల‌యం వార్షిక వేడుకలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకలు నవంబర్‌ 17 వ తేదీ నుంచే ప్రారంభం అయ్యాయి. మ‌కర సంక్రాంతికి కనిపించే మకర జ్యోతి కోసం దేశవ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా యాత్రికులు తరలివస్తుంటారు. అందుకే సాధార‌ణ రోజుల్లో కంటే మక‌ర‌జ్యోతి స‌మ‌యానికి ఈ ఆలయం జ‌నంతో కిక్కిరిసిపోయి ఉంటుంది.

shabrimala

శబరిమలకు ప్రత్యేక రైళ్లు...

ఈ సంద‌ర్భంగా రైల్వే శాఖ కూడా శ‌బరిమ‌ల వెళ్లే అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించింది రైల్వేశాఖ‌. ఇప్ప‌డు శబరిమల అయ్యప్ప దీక్షల సీజన్ మొదలైంది. చాలామంది అయ్య‌ప్ప భ‌క్తులు అయ్య‌ప్ప మాల‌లు ధ‌రించి శ‌బ‌రిమ‌ల‌కు వెళ్తుంటారు. కాబ‌ట్టి ఈ సంద‌ర్భంగా అయ్య‌ప్ప వెళ్లే భ‌క్తుల‌కోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను తీసుకోచ్చింది. ఈ రైళ్ల‌ రూట్స్, టైమింగ్స్ గురించి ఇప్ప‌డు తెలుసుకుందాం.

shabrimal iyappa temple

ట్రైన్స్ వివ‌రాలు..

సికింద్రాబాద్, నర్సాపురం నుంచి ఈ రైళ్లు అందుబాటులో క‌ల‌వు. రైలు నెంబర్ 07121 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు 2023 నవంబర్ 19న అందుబాటులో ఉంటుంది. కాబ‌ట్టి సికింద్రాబాద్ నుంచి వెళ్లే భ‌క్తులు ఈ రైలులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. తిరిగి సోమవారం రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక మ‌రో రైలు నెంబర్ 07122 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు 2023 నవంబర్ 21న అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరడం జ‌రుగుతుంది.

sabrimala festival

తిరిగి బుధవారం ఉదయం ప‌ది గంటలకు సికింద్రాబాద్ స్టేష‌న్ చేరుకుంటుంది. సికింద్రాబాద్, కొల్లాం రూట్‌ల‌లో నడిచే రైలు దారిలో చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్ మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోల్, కావలి, నెల్లూర్, గూడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలాప్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, చెంగన్నూర్, మవెలికెర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నంలో ఉంచుకోవాలి.

ఇక ట్రైన్ నెంబర్ 07119 నర్సాపూర్ నుంచి కొట్టాయం వరకు 2023 నవంబర్ 19న అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్‌ ఆదివారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేర‌డం జ‌రుగుతుంది. తిరిగి ఇదే ట్రైన్ సోమవారం మధ్యాహ్నం 4.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07120 కొట్టాయం నుంచి నర్సాపూర్ వరకు 2023 నవంబర్ 20న అందుబాటులో ఉంటుంది. ఈ టైన్ సోమవారం రాత్రి ఏడు గంటలకు కొట్టాయంలో బయల్దేరుతుంది.

ఆ త‌ర్వాత తిరిగి ఈ టైన్ మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు నర్సాపూర్ చేరుకోవ‌డం జ‌రుగుతుంది. నర్సాపూర్, కొట్టాయం రూట్‌లో నడిచే ఈ ట్రైన్‌ దారిలో పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోల్, నెల్లూర్, గూడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలాప్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+