ఒడిశాలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక, ఇందులో పుణ్యక్షేత్రాలకు కొదవే లేదు. ఒడిశా రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలనుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం మూడు రోజులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో ఉంటుంది.
ఈ ప్యాకేజీలో భాగంగా ఇందులో ప్రముఖ దేవాలయాలు కోణార్క్, పూరి సందర్శన, చిలికా లేక్, బీచ్‌లను సందర్శించేయొచ్చు. ఇక, ఈ ప్యాకేజీ ఎక్సోటిక్ ఒడిశా పేరిట ప్రారంభమైంది. 10760 రూపాయలతో ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ప్రతి రోజూ ఈ టూర్ పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకుందాం పదండి..
టూర్ ప్యాకేజీ వివరాలు..
ఒక్కో వ్యక్తి ధర (ఒకటి నుంచి ముగ్గురు వ్యక్తులు)
సింగిల్ ఆక్యుపెన్సీ రూ.26870 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.14365 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ కీ రూ.10655 గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్(5-11 Years) రూ.7005 చెల్లించాలి. చైల్డ్ వితవుట్ బెడ్(5-11 Years) రూ.5630 చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్కో వ్యక్తి ధర (నలుగురు నుండి ఆరుగురు వ్యక్తులు)

డబుల్ ఆక్యుపెన్సీ రూ.12200 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.10760గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్(5-11 Years) రూ. 3645 చెల్లించాల్సి ఉంటుంది. చైల్డ్ వితవుట్ బెడ్(5-11 Years) రూ.3645 చెల్లించాలి.
ఒక్కో వ్యక్తికి టిక్కెట్ వివరాలు... (07 నుండి పది మంది వ్యక్తులు)
డబుల్ ఆక్యుపెన్సీ రూ.11450 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.10005 గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్(5-11 Years) రూ.3460 చైల్డ్ వితవుట్ బెడ్(5-11 Years) రూ.3460 చెల్లించాల్సి ఉంటుంది.
మూడు రోజుల టూర్ షెడ్యూల్..
ఈ టూర్‌లో భాగంగా మొదటి రోజు ఉదయం భువనేశ్వర్ విమానాశ్రయం/రైల్వే స్టేషన్ నుంచి పర్యాటకులను పికప్ చేసుకుని కోణార్క్ మీదుగా పూరికి బయలుదేరుతారు. అనంతరం అక్కడ కోణార్క్ సూర్య దేవాలయం, చంద్ర భాగ బీచ్ వంటి ప్రదేశాల సందర్శన ఉంటుంది. ప్రయాణికుల సొంత ఖర్చుతోనే మధ్యాహ్న భోజనం చేయాల్సి ఉంటుంది. అనంతరం పూరీకి వెళ్లి హోటల్‌లో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. రాత్రి భోజనం, స్టేయింగ్ అక్కడే హోటల్‌లో ఉంటుంది. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా ఉదయం అల్పాహారం ముగించుకుని పూరి జగన్నాథ ఆలయ దర్శనానికి బయలుదేరాల్సి ఉంటుంది. అనంతరం చిలికా సరస్సును సందర్శిస్తారు. సతపద వద్ద సీ మౌత్ వరకు బోట్ రైడ్ ఉంటుంది.
ఈ బోటి రైడ్‌కయ్యే ఖర్చులు ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక, అక్కడినుండి తిరుగు ప్రయాణంలో అలర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం పూరీకి తిరిగి వెళ్లి హోటల్ కు చేరుకుంటారు. ఆ మరుసటి రోజు (మూడోరోజు) ఉదయం టిఫిన్ చేసి హోటల్‌లో చెక్ అవుట్ చేస్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్-అవుట్ చేస్తారు. భువనేశ్వర్ పట్టణ టూర్ ఉంటుంది.
ధౌలి స్థూపం, లింగరాజ్ ఆలయం, ఉదయగిరి, ఖండగిరి గుహలు, ముక్తేశ్వరాలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ లేదా రైల్వే స్టేషన్‌లో పర్యాటకులను డ్రాప్ చేస్తారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ప్రయాణికులు ఇతర పూర్తి సమాచారం కోసం
ఒడిశా టూర్ ప్యాకేజీ బుక్కింగ్ అధికారికి వెబ్‌సైట్‌ను https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBH03 సంప్రదించగలరు.



Click it and Unblock the Notifications













