Search
  • Follow NativePlanet
Share
» »24 గంటల్లో ముంబై పర్యటన ఎలా ?

24 గంటల్లో ముంబై పర్యటన ఎలా ?

ముంబై మహా నగరం లో ఒక రోజు ఎలా గడపాలి ? అనుకుంటున్నారా ? ముంబై నగరం ఇరవై నాలుగు గంటలూ ఎంతో బిజిగా వుంటుంది. ముంబై రాత్రి జీవనం గురించి వేరుగా చెప్పనవసరం లేదు. ముంబై నగరం నిరుపేదలకు, అధిక ధనవంతులకు కూడా ఆశ్రయం ఇస్తుంది. ఒక వైపు మురికి వాడలు, దారిద్ర్యం కాగా మరో వైపు ఆకాశాన్ని అంటే భవనాలు, ధనికుల విలాస జీవితాలు. ఈ నగరాన్ని భారత దేశ ఆర్ధిక రాజధాని నగరంగా కూడా పిలుస్తారు. సిటీ లో అంతా బిజి లైఫ్ కాగా సముద్రపు ఒడ్డున ప్రశాంతత. బ్రిటిష్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఎన్నో చూడవచ్చు.

ముంబై లో ఒక రోజు పర్యటన !

మనం మన ఒక రోజు ముంబై నగర టూర్ ను విక్టోరియ గోతిక్ శిల్ప శైలి కల చారిత్రక విక్టోరియ టెర్మినస్ నుండి మొదలు పెడదాం. ఇది ముంబై లో ఒక మంచి వాణిజ్య ప్రదేశం. షాపింగ్ ప్రియులకు ఒక పారడైస్. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విలియం ఎమర్సన్ చే డిజైన్ చేయబడిన క్రాఫార్డ్ మార్కెట్ లో మీరు తాజా పండ్లు, కూరగాయలు వంటివి కొనుగోలు చేయవచ్చు. ఇంకా మీకు సమయం మిగిలి వుంటే, , మీరు ఫుడ్స్ బాగా ఇష్టపదేవారైతే, ఇక్కడే కల మంచి రుచుల వంటకాలు అందించే రెస్ట రెంట్లు లంచ్ టైం లో మీకు స్వాగతం చెపుతాయి.ఈ రెస్టారెంట్ల లో వివిధ రకాల సి ఫుడ్స్ కూడా లభ్యంగా వుంటాయి. స్థానిక వంటకాలు నోరు ఊరిస్తాయి అనటంలో సందేహం లేదు. ముంబై నగరం చాట్లకు పెట్టింది పేరు.

లంచ్ తర్వాత ఓవల్ మైదాన్ మరియు హై కోర్టు చూడండి. హై కోర్టు ఒక జర్మన్ భవనంలో కలదు. కోర్టు లోపలికి సందర్శకులను అనుమతిస్తారు. ఫ్రెంచ్ శిల్ప శైలి కల ముంబై యూనివర్సిటీ భవనం నగరంలో తప్పక చూడవలసిన ఒక ప్రత్యేక పర్యాటక ఆకర్షణ.

సాయంకాలం కొలాబా కాజ్ వే లో గడపండి. ఇక్కడ మీరు గేటు వే అఫ్ ఇండియా మరియు 2008 సంవత్సరంలో ఉగ్రవాదుల దాడులకు గురై పునరుద్ధరించబడిన తాజ్ మహల్ పాలస్ హోటల్ లు చూడవచ్చు. రాత్రి భోజనం కడుపు నిండా ఇక్కడ తిన వచ్చు. ఇంకనూ మీరు అలసిపోక పోతే, కంటికి విందు, మనసుకు పసందులు కలిగించే నైట్ క్లబ్ లు ఈ ప్రదేశంలో ఎన్నో కలవు. వాటిలో ఒకటి ఎంచుకొని ముంబై నగర రాత్రి నైట్ క్లబ్ ఆనందాలు ఎలా ఉంటాయనేది కూడా రుచి చూడండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+