Search
  • Follow NativePlanet
Share
» »స‌మ్మ‌ర్ వెకేషన్‌కు స‌రైన ఎంపిక‌.. జార్ఖండ్‌లోని ఈ 5 హిల్ స్టేషన్‌లు!

స‌మ్మ‌ర్ వెకేషన్‌కు స‌రైన ఎంపిక‌.. జార్ఖండ్‌లోని ఈ 5 హిల్ స్టేషన్‌లు!

జార్ఖండ్ పేరువింటే చాలు అద్భుతమైన హిల్ స్టేషన్‌లు గుర్తుకొస్తాయి. ఈ రాష్ట్రం పచ్చని ప్ర‌కృతి అందాల‌కు.. భిన్న‌మైన‌ గిరిజన సంస్కృతికి నిల‌య‌మ‌నే చెప్పాలి. జార్ఖండ్‌లోని హిల్ స్టేషన్‌ల‌ సహజ సౌందర్యం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక జీవ‌న విధానాన్ని చూసిన‌వారెవ్వ‌రైనా మ‌రో ప్ర‌పంచ‌పు క్ష‌ణాల‌ను గ‌డిపిన అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఇక్క‌డి గొప్ప సంస్కృతి, విభిన్న ప్రకృతి దృశ్యాలు అద్యంతం మీ మ‌న‌సును క‌ట్టిపడేస్తాయి. సుందరమైన తూర్పు కనుమల మధ్య నెలకొని ఉన్న ఈ హిల్ స్టేషన్‌లు నగర జీవితంతో అల‌సిన మీ మ‌న‌సుకు ప్ర‌శాంత‌త‌ను చేరువ చేస్తాయి. కుటుంబ స‌మేతంగా స‌మ్మ‌ర్ వెకేష‌న్‌కు ప్లాన్ చేస్తే మాత్రం జార్ఖండ్‌లోని అంద‌మైన ఈ ఐదు హిల్ స్టేష‌న్‌ల‌ను సంద‌ర్శించ‌డం అస్స‌లు మ‌ర్చిపోవ‌చ్చు.

నెటార్‌హాట్

'ఛోటానాగ్‌పూర్ రాణి'గా పిలువబడే నెటార్‌హాట్ సముద్ర మట్టానికి 3,700 అడుగుల ఎత్తులో ఉన్న మనోహరమైన హిల్ స్టేషన్. సాల్, మహువా, యూకలిప్టస్ వంటి వృక్షాల‌తో క‌ప్ప‌బ‌డిన దట్టమైన అడవులతో నిండిన ఈ ప్ర‌దేశం సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆకర్షిస్తుంది. ఇక్క‌డి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం యొక్క ఉత్కంఠభరితమైన క్ష‌ణాల‌ను వీక్షించేందుకు ప‌ర్యాట‌కులు ఎంతో ఆస‌క్తి చూపిస్తారు. ఈ ప్రాంతం మాగ్నోలియా జలపాతం, సద్ని జలపాతం వంటి అందమైన జలపాతాలతో ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా ప్రసిద్ధి చెందింది. మొత్తంగా నెటార్‌హాట్‌ ప్రకృతి ప్రేమికులను క‌నువిందు చేసే స‌మ్మ‌ర్ క్యాంప్‌గా చెప్పొచ్చు.

parasnathhills1

పరస్నాథ్ హిల్స్

గిరిడిహ్ జిల్లాలో ఉన్న పరస్నాథ్ కొండలు జైనుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. ఇక్క‌డి ప్ర‌శాంత‌త ఏటా వేస‌విలో పర్యాటకులకు ఆహ్వానం ప‌లుకుంద‌నే చెప్పాలి. జార్ఖండ్‌లోని ఎత్తైన శిఖరంగా పరస్నాథ్ కొండ స‌ముద్ర‌మ‌ట్టానికి 4,478 అడుగుల ఎత్తులో ఉంది. 24 జైన తీర్థంకరులలో 20 మంది మోక్షాన్ని పొందిన ప్రదేశంగా దీనిని నమ్ముతారు. హిల్ స్టేషన్ పురాతన జైన దేవాలయాలతో నిండి ఉండ‌డంతో ఆధ్యాత్మికత మరియు ప్రకృతి అందాల సమ్మేళనాన్ని ఆస్వాదించేందుకు ప‌ర్యాట‌క ఔత్సాహికులు ఇక్క‌డికి వాలిపోతుంటారు.

tagorehill1

ఠాగూర్ హిల్

ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా ఠాగూర్ హిల్ జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో ఉంది. 300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ రాంచీ నగరం మరియు దాని పరిసర ప్రాంతాల విస్తృత దృశ్యాలను మ‌న‌సారా వీక్షించేందుకు అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతం రామకృష్ణ మిషన్ ఆశ్రమానికి నిలయంగా ఉంది. ఇది ఆధ్యాత్మిక అన్వేషకులకు విడిది కేంద్రంగా ప్ర‌సిద్ధిగాంచింది.

హజారీబాగ్

హజారీబాగ్ అంటే 'వెయ్యి ఉద్యానవనాలు అంటారు. ఈ సుందరమైన హిల్ స్టేషన్ పచ్చదనానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తుంది. స‌ముద్ర మ‌ట్టానికి 2,956 అడుగుల ఎత్తులో ఉన్న హజారీబాగ్ చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, మెరిసే సరస్సులతో క‌నువిందు చేస్తుంది. ఈ పట్టణంలో హజారీబాగ్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంది. ఇది పులులు, చిరుత పులులు మరియు జింకలతో సహా వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలానికి నిలయంగా ఉంది.

లోహర్‌ద‌గా

చోటానాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతంలో 1,128 అడుగుల ఎత్తులో ఉన్న లోహర్‌దగా ఒక విచిత్రమైన హిల్ స్టేషన్. సుందరమైన, ప్రశాంతమైన పరిసరాలకు ప్రసిద్ధి చెందిన లోహర్‌ద‌గా ప్రకృతి ప్రేమికులకు మరియు సాహస ప్రియులకు సరైన గమ్యస్థానం. ఈ ప్రాంతం సుసంపన్నమైన గిరిజన సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. సందర్శకులు సాంప్రదాయ గిరిజన గ్రామాలను అన్వేషించవచ్చు. వారి జీవన విధానాన్ని ద‌గ్గ‌ర‌గా చూసేందుకు అనువైన ప్ర‌దేశం లోహ‌ర్‌ద‌గా.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+