అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలంటే వీసాలు, సరైన డాక్యుమెంట్స్ ఎంతో అవసరమని చాలామందికి తెలుసు. అలాంటి నిబంధనలు భారతదేశంలోని ప్రదేశాలు సందర్శించేందుకు కూడా కావాలంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించాలంటే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. దీనినే ఇన్నర్ లైన్ పర్మిట్ అని కూడా అంటారు. ఇవి భారతదేశపు అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్న ప్రాంతాలను సందర్శించేందుకు తప్పకుండా కావాలి. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేవి స్వదేశంలొని విభిన్న సంస్కృతులను రక్షించేందుకు ఎంతో అవసరం. ఇప్పడు మనం భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను సందర్శించాలంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. ఆ ప్రాంతాలేంటో ఒకసారి తెలుసుకుందాం పదండి.

అరుణాచల్ ప్రదేశ్
అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక సంపద కలిగిన అరుణాచల్‌ప్రదేశ్.. మయన్మార్, భూటాన్, చైనాలతో సరిహద్దును పంచుకుంది. ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్, దాని సున్నితమైన ప్రదేశం కారణంగా పర్యాటకులు సందర్శించేందుకు ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP)ను తప్పకుండా పొందవలసి ఉంటుంది. పర్యాటకులు న్యూఢిల్లీ, కోల్‌కతా, గౌహతి మరియు షిల్లాంగ్ వంటి నగరాల్లోని రెసిడెంట్ కమీషనర్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రక్షిత ప్రాంతాల కోసం ఈ అనుమతులను పొందాల్సి ఉంటుంది. ఒక్కో వ్యక్తికి రూ.100తో ఈ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం 30 రోజుల వరకు మాత్రమే యాక్సెస్‌ను అందిస్తాయి. ఈ పర్మిషన్‌ను ఆన్‌లైన్‌లో కూడా సౌకర్యవంతంగా పొందొచ్చు.

లక్షద్వీప్
లక్షద్వీప్ దాని సహజమైన బీచ్‌లు, స్పష్టమైన జలాలు, రుచికరమైన వంటకాలకు ఎంతగానో ప్రసిద్ధిచెందింది. అయితే, ఈ స్వర్గాన్ని సందర్శించాలంటే తప్పకుండా ప్రయాణికులు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్, ప్రత్యేక అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఈ భారత కేంద్రపాలిత ప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్యను నియంత్రించడానికి ఈ పర్మిషన్ ఎంతో అవసరమని అధికారులు అంటున్నారు. ఈ అనుమతిని పొందాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా తమ గుర్తింపు పత్రాలతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. లక్షద్వీప్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఆ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లో కూడా సులభంగా పొందొచ్చు, పర్యాటకులు ఈ వెయ్యి ద్వీపాల స్వర్గధామాన్ని ఐదు నెలల వరకు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.

మిజోరం
మిజోరాం, దాని సుందరమైన ప్రకృతి దృశ్యాలు, విభిన్న స్వదేశీ కమ్యూనిటీలకు ఎంతగానో ప్రసిద్ధిచెందింది. ఇది మయన్మార్ , బంగ్లాదేశ్‌తో సరిహద్దులను పంచుకుంటుంది. మిజోరంను సందర్శించాలంటే ప్రయాణికులు ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ సిల్చార్, కోల్‌కతా, గౌహతి, షిల్లాంగ్, న్యూ ఢిల్లీ వంటి వివిధ నగరాల్లో ప్రభుత్వ లైజన్ ఆఫీసర్ నుండి ILPని పొందొచ్చు. విమానంలో వచ్చే ప్రయాణికులు ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలోని భద్రతా అధికారి నుండి ప్రత్యేక పాస్‌ను అందిస్తారు. ఈ అనుమతులు రెండు రకాలుగా వస్తాయి, 15 రోజులు తాత్కాలికంగా, ఆరు నెలల పాటు సాధారణమైనవిగా ఉంటాయి.
నాగాలాండ్
నాగాలాండ్, భారతదేశపు ఈశాన్య ఆభరణాలు, దాదాపు 16 ప్రత్యేక తెగలకు నిలయంగా ఉంది. సుసంపన్నమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ఈ ప్రాంతం కలిగిస్తుంది. మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఈ ప్రాంతం ఉంది. అందుకే ఇది ప్రయాణికులకు సున్నితమైన ప్రాంతంగా అభివృధ్ధి చెందిది. నాగాలాండ్‌ను సందర్శించాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) తప్పనిసరిగా అవసరం. ఢిల్లీ, కోల్‌కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మోకోక్‌చుంగ్ వంటి నగరాల్లోని వివిధ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల నుండి ఈ అనుమతిని పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా ఈ పర్మిట్‌లను పొందొచ్చు.
సిక్కిం
సిక్కింలోని సహజమైన, మారుమూల ప్రాంతాలను పర్యటించేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. నాథులా పాస్, త్సోంగో-బాబా మందిర్, ద్జోంగ్రీ ట్రెక్, సింగలీలా ట్రెక్, యుమెసామ్‌డాంగ్, గురుడోంగ్‌మార్ లేక్, యుమ్‌తాంగ్, జీరో పాయింట్, థంగు-చోప్తా వ్యాలీ వంటి ప్రదేశాలను సందర్శించాలంటే తప్పనిసరిగా ఇన్నర్ లైన్ పర్మిట్ ఎంతో అవసరం. టూరిజం, పౌర విమానయాన శాఖ జారీ చేసిన ఈ అనుమతులను బాగ్‌డోగ్రా విమానాశ్రయం, రంగ్‌పో చెక్‌పోస్ట్‌లో పొందొచ్చు.



Click it and Unblock the Notifications











