Search
  • Follow NativePlanet
Share
» »నాగాలాండ్ అద్భుత ప్రదేశం !

నాగాలాండ్ అద్భుత ప్రదేశం !

By Mohammad

తెలియని ప్రదేశాలను చూడాలంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి. ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో ఇటువంటి ప్రదేశాలు అనేకం కానవస్తాయి. ఇక్కడికి వెళ్ళటానికి అనేకమంది ఆసక్తిని కనబరుస్తారు కానీ రవాణా సౌకర్యాలు అంత మెరుగుగా ఉండవు కనుక ఆ ప్రదేశాలను టచ్ చేయటానికి సాహసించరు.

భారతదేశంలో దాగి ఉన్న అద్భుత ప్రదేశాలలో నాగాలాండ్ ఒకటి. కొండలు,లోయలు,మైదానాలతో కూడిన నాగాలాండ్ సందర్సన మనల్ని మరల మరలా వచ్చేలా చేస్తుంది. నాగాలాండ్ సహజసిద్ద సౌందర్యం మరియు సంస్కృతీ చూడాలంటే రెండూ ఫేక్ జిల్లా కు ప్రయాణం అవ్వక తప్పదు.

తెగలు - పండుగలు

ఫేక్ జిల్లా కు సరిహద్దులుగా మయన్మార్, మణిపూర్, కోహిమా, తుఏన్‌సాంగ్ మరియు జునెబోటొ జిల్లాలు ఉన్నాయి. ఫేక్, కోహిమా నగరం నుండి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫేక్ అనే ఆ పదం 'ఫేక్రేకేద్జే' నుండి పుట్టింది. ఇక్కడ మాట్లాడే భాషలు తెన్యిదీ మరియు నగమేసే. ఫేక్ లో ఖుతోన్యే ,తురిన్యే, తుర్హిన్యే ,న్గున్యే ,తుఖంయే మరియు సుఖ్రున్యే అనే పండుగలను జరుపుకుంటారు.

phek festival

చిత్ర కృప : Roderick Eime

ఇది కూడా చదవండి : నాగాలాండ్ పర్వత ప్రదేశం - కిఫిరే !

ఫేక్ అంటే 'వాచ్ టవర్' అని అర్థం. ఈ అందమైన జిల్లా తిజు, లంయే మరియు సేద్జు అనే మూడు అందమైన నదుల ద్వారా అలంకరించబడి ఉంటుంది. ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో శిల్లో, చిడ మరియు డజుడు సరస్సులు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని లోయలలో కొన్ని అరుదైన జాతుల ఆర్కిడ్లు కనబడతాయి. గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలంనకు ప్రసిద్ధి చెందినది ఈ ఫేక్. ఫేక్ 'బ్లేథ్స్ త్రాగోపాన్' అనే ప్రఖ్యాత వేటకు ఉపయోగించే పక్షులకు కేంద్రంగా ఉంది.

valley

చిత్ర కృప : Mongyamba

ఖేజ్హకేనో

ఫేక్ జిల్లాలో ఉన్నఖేజ్హకేనో అనే చిన్న గ్రామం పర్యాటకులకు అత్యంత చిరస్మరణీయ ప్రయాణాలలో ఒకటిగా ఉంటుంది. ఖేజ్హకేనో అనే గ్రామం చరిత్ర మరియు పురాణం తో ముడిపడి ఉన్నది. ఖేజ్హకేనో నుంచి అనేక నాగ తెగలు ఉద్భవించాయని విశ్వసిస్తారు. మరొక ప్రసిద్ద కధనం ప్రకారం గ్రామంలో భూమిపై వరిని ఎండబెట్టినప్పుడు ఆశ్చర్యకరంగా బండరాయిగా మారిందట.

ఇది కూడా చదవండి : పేరెన్ - ప్రకృతి చే దీవించబడ్డ భూమి !

ఇప్పటికి ఈ రాతిని గ్రామంలో గుర్తించవచ్చు. పర్యాటకులు ప్ఫుత్సేరో,తబుబి నుండి ఖేజ్హకేనో గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

shilloi lake

చిత్ర కృప : roko_chase

షిల్లో సరస్సు

షిల్లో సరస్సు పాదముద్ర ఆకారంలో ఉండే అందమైన సరస్సు. దీనిని స్థానికులు లత్సం అని పిలుస్తారు. మయన్మార్ కు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ సరస్సు 0. 25 నుండి 0. 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలదు. సరస్సు లోతు 4 మీటర్లు ఉంటుంది. తాగునీటికి, ఫిషింగ్ కు మరియు ఇతర నీటి సదుపాయాలకు ఈ సరస్సు అంతగా ఉపయోగకరమైనది కాదు.

curvy roads

చిత్ర కృప : zang aier

ఫేక్ ఎలా చేరుకోవాలి ?

ఫేక్ చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

ఫేక్ కు సమీపాన 184 కిలోమీటర్ల దూరంలో దిమాపూర్ దేశీయ విమానాశ్రయం కలదు. గౌహతి, కోల్కత్తల నుండి ఈ విమానాశ్రయం అనుసంధానించబడినది. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి ఫేక్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఫేక్ కు సమీపాన దిమాపూర్ రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో లేదా టాక్సీ లలో ఎక్కి ఫేక్ వెళ్ళవచ్చు.

బస్సు / రోడ్డు మార్గం

కోహిమా, దిమాపూర్ మరియు ఇతర సమీప ప్రాంతాల నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఫేక్ పట్టణానికి కలవు. టికెట్ ధరలు చౌకగా ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+