Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో .. భారతీయులకు అనుమతిలేని ప్రదేశాలు !

భారతదేశంలో .. భారతీయులకు అనుమతిలేని ప్రదేశాలు !

By Mohammad

మనం ఎవరమండి ..! భారతీయులం. ఈ దేశంలో మనం ఎక్కడైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా నివాసం ఉండవచ్చు ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి. మరి మన దేశంలో మనకే ప్రవేశం లేని కొన్ని ప్రదేశాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా ??

నమ్మి తీరాలి. మన భారతదేశంలో మనకే కొన్ని ప్రదేశాలలో ప్రవేశం లేదు. అక్కడికి వెళితే మనకు నో ఎంట్రీ. కేవలం ఇతర దేశాల వారిని మాత్రమే అనుమతిస్తారు. అదేంటీ, ఈ గడ్డ మీద పుట్టిన మనకు ఆ ప్రదేశాలలో ప్రవేశం లేదా ? ఇతర దేశాల వారికి ప్రవేశమా ? అదెక్కడి వింత అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఆ ప్రదేశాలు ఏంటో మీరు తెలుసుకోక తప్పదు.

భారతీయలకు అనుమతి లేకుండా, కేవలం ఫారెనర్స్ కు మాత్రమే ప్రవేశం కల్పించే ఆ ప్రదేశాలు ఏంటో ? ఎక్కడున్నాయో ? ఒకసారి తెలుసుకుందాం పదండి.. !

01. 'ఫారెనర్స్ ఓన్లీ' బీచ్ లు

గోవా ఎంత సుందర ప్రదేశమో అందరీ తెలుసు. ఇక్కడకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. గోవా లో బీచ్ లు లెక్కలేనన్ని ఉన్నాయి. గోవా పోయాం కదా అని ఏ బీచ్ పడితే ఆ బీచ్ కు వెళ్ళేరు. కొన్ని బీచ్ లు కేవలం ఫారెనర్స్ కు మాత్రమే అనుమతిస్తాయి. ఇండియన్స్ ను అనుమతించరు. ఇండియాను సందర్శించే విదేశీయలకు ఈ బీచ్ ల వద్ద రెస్టారెంట్లు, పబ్ లు, వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి.

యూనో -ఇన్ హోటల్, బెంగళూరు

యూనో -ఇన్ హోటల్, బెంగళూరు

02. యూనో - ఇన్ హోటల్

సిలికాన్ సిటీ గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరంలో యూనో- ఇన్ హోటల్ కలదు. బెంగళూరు లో ఉన్న మన భారతీయులకు ఇందులో అనుమతి లేదు కానీ జపాన్ దేశస్థులకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఇక్కడ బాధ కలిగించే విషయం ఏమిటంటే ఈ హోటల్ త్వరలోనే మూతపడనుంది.

03. ఫ్రీ కసోల్ కేఫ్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కసోల్ పట్టణంలో ఫ్రీ కసోల్ కేఫ్ కలదు. ఇందులో భారతీయులు తినటానికి, తాగటానికి అనుమతి లేదు. కేవలం ఇజ్రాయిల్ దేశస్థులకు మాత్రమే అనుమతిస్తారు. వారికి మాత్రమే సర్వ్ చేస్తారు. ఒకేవేళ మీరు వెళ్లి కూర్చున్న మీకు సర్వ్ చేయరు.

04. లాడ్జీ

చెన్నై లో ఒక లాడ్జ్ ఉందండీ ! (పేరు తెలీదు) అక్కడ ఇండియన్స్ కు గదులు ఇవ్వరు. అంతేకాదు లాడ్జ్ బయట పెద్దపెద్ద అక్షరాలతో కుక్కలకు మరియు భారతీయులకు ప్రవేశం లేదు అని బోర్డు తగిలించి ఉంటుంది. కేవలం ఫారిన్ పాస్ పోర్ట్ కలిగిన వారిని మాత్రమే లాడ్జ్ లోకి అనుమతిస్తారు.

బీచ్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విదేశీయులు, పాండిచ్చేరి

బీచ్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విదేశీయులు, పాండిచ్చేరి

05. ఫారెనర్స్ బీచ్

పాండిచ్చేరి లో కూడా కొన్ని బీచ్ లు ఫారెనర్స్ ను మాత్రమే అనుమతిస్తాయి. ఇండియన్స్ ను అనుమతించరు. విదేశీయులు బీచ్ లో విశ్రాంతి, స్పా, మసాజ్ వంటి వాటిని ఆచరిస్తుంటారు. అంతేకాదు ఆడుకోవటానికి, తినటానికి వారికి ఇక్కడ ఎన్నో సౌకర్యాలు ఏర్పాటుచేశారు. పాండిచ్చేరి అప్పట్లో 'ఫ్రెంచ్ కాలనీ' గా పిలిచేవారట. అందుకే ఇప్పటికీ ఫ్రెంచ్ దేశస్థులు ఇక్కడికి తరచూ వస్తుంటారు.

మీరు గనక ఈ ప్రాంతాలలో సందర్శించేటప్పుడు పైన పేర్కొన్న ప్రదేశాలవైపు వెళ్ళకండి. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. దరిద్రం కాకపైతే, మన ఇండియాలో మనకు చూడటానికి ప్రవేశం కల్పించకుండా ఇతర దేశాలవారిని అనుమతిస్తారా ? ఇంకా రేపొద్దున ఇలాంటి భాగోతాలు ఎన్ని చూడాలో ? ఏమో ?

సరేలెండి, దిగువన పేర్కొన్న బాక్స్ లో మీ సలహాలను, సూచనలను తెలియజేయండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+