Search
  • Follow NativePlanet
Share
» »అమ్మాయిలు మీరు ఒంటరిగా పర్యాటకానికి వెళ్లాలా?

అమ్మాయిలు మీరు ఒంటరిగా పర్యాటకానికి వెళ్లాలా?

అమ్మాయిలు ఒంటరిగా టూర్ వెళ్లడానికి అనువైన ప్రాంతాల జాబితా ఇదే.

ఇటీవల కాలంలో అమ్మాయిలు మాత్రమే ఔటింగ్, టూర్ పోవడం ఎక్కువయ్యింది. అబ్బాయిలతో కాని, కుటుంబం సభ్యులతో కాని కలిసి టూర్ వెళ్లడంతో పోలిస్తే ఒంటరిగా లేదా అమ్మాయిలు మాత్రమే జంటగా టూర్ వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయిలు ఒంటరిగా లేదా జట్టుగా వెలుతూ చూడదగిన పర్యాటక ప్రాంతాల వివరాలు మీ కోసం....

మనాలి

మనాలి

P.C: You Tube

చలికాలం తప్ప మిగిలిన అన్ని సమయాల్లో మనాలి అమ్మాయిలకు ఎంతో అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ చుట్టూ మంచుపర్వత అందాలతో పాటు పర్వత లోయలు అమ్మాయిలకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడ ట్రెక్కింగ్, స్కేయింగ్, ప్యారాగ్లైండింగ్ తదితర సహసక్రీడలు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళల కోసం నిపుణులు అందుబాటులో ఉంటారు.

గోవా

గోవా

P.C: You Tube

గోవాను ఇండియా పార్టీ రాజధాని అని పిలుస్తారు. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో అలల హోరులో మంద్రంగా వినిపించే సంగీతానికి తోడు మనకు ఇష్టమైన తిండిని తింటూ స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రాంతం. ఇక్కడ ఎంజాయ్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.

షిల్లాంగ్

షిల్లాంగ్

P.C: You Tube

అమ్మాయిలు జట్టుగా పర్యాటకానికి వెళ్లాలనుకొంటే వారికి ముందుగా మదిలో మెదిలేది సేఫ్టి. భారత దేశంలో అలా మహిళా పర్యాటకులకు రక్షణ కల్పించే పర్యాటక ప్రాంతాల్లో షిల్లాంగ్ ముందు వరుసలో ఉంటుంది. ఈ షిల్లాంగ్‌లో పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక మ్యూజిక్ ఫెస్ట్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్లే చాలా మంది అమ్మాయిలు ఈ మ్యూజిక్ ఫెస్ట్ కోసమే అక్కడకు వెలుతూ ఉంటారు.

జైపూర్

జైపూర్

P.C: You Tube

పింగ్ సిటీగా పేరుగాంచిన ఈ జైపూర్ రాజస్థాన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సిటీ విదేశీ పర్యాటకులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తోంది.అందువల్లే ఇక్కడ పర్యాటకుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఏనుగు, ఒంటెల సవారీని ఎప్పటికీ మర్చిపోలేము.

పాండిచ్చేరి

పాండిచ్చేరి

P.C: You Tube

పాండిచ్చేరి కూడా ఎక్కవగా విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందువల్ల ఇక్కడ అమ్మాయిల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ సముద్రతీర ప్రాంతాల్లో ఆటలాడుకోవడంతో పాటు షాపింగ్ చేయడాన్ని అమ్మాయిలు బాగా ఇష్టపడుతారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+